ఇంట్లో అందరూ మందు కలిపిన జ్యూస్ తాగేసి ఊగుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి గమనించిన రాహుల్ ఏమైంది మీ అందరికీ అని కళ్యాణ్ ని అడుగుతాడు. వాళ్ళకి కవిత్వం వినిపించాను అందులో పడి ఈత కొడుతున్నారని అర్థం కాకుండా మాట్లాడతాడు. విషయం తెలిసిన ప్రకాష్, శుభాష్ మెల్లగా వాళ్ళ దగ్గరకి వస్తారు. నాకు నా కొడుక్కి అన్యాయం చేసి మీరు ఫుల్ హ్యాపీగా ఉంటారా? అని శుభాష్ ని రుద్రాణి నిలదీస్తుంది. అసలు మొత్తం నడిపించింది నీ భార్య, కోడలు అసలు ఈ పెళ్లి జరగనివ్వను. వీళ్ళు అన్నలు కాదు దున్నలని తాగిన మైకంలో నోటికొచ్చినట్టు తిడుతుంది. తనని రాహుల్ పక్కకి తీసుకుని వెళతాడు. అందరూ డ్రింక్ చేసి మత్తులో ఉంటే మంచి అవకాశం వస్తే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని రాహుల్ మైఖేల్ ని తిడతాడు. టైమ్ దొరికినప్పుడు కిడ్నాప్ చేస్తానని చెప్తాడు.


పెళ్లికి రాహుల్ని అటు స్వప్నని రెడీ చేస్తారు. తోడి కోడళ్ళు కాసేపు రుద్రాణిని దెప్పి పొడుస్తారు. నాకేదో జరిగిపోయిందని సంబరపడుతున్నారు కదా ఒక్కసారి పెళ్లి కూతురు కనిపించలేదని తెలియనివ్వు అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి అనుకుంటుంది రుద్రాణి. రాహుల్ ఇబ్బందిపడుతుంటే రాజ్ ధైర్యం చెప్తాడు. తప్పులు అందరూ చేస్తారు కానీ సరిదిద్దే వాడు గొప్పవాడు. నువ్వు ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతున్నావని అంటాడు. సోరి రాజ్ నువ్వు నామీద చాలా నమ్మకం పెట్టుకున్నావ్ కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయానని రాహుల్ మాయ మాటలు చెప్తాడు. నువ్వు మంచివాడివి నేను ఆ విషయం నమ్ముతానని రాజ్ అంటాడు. రుద్రాణి వచ్చి రాజ్ ని పంపించేస్తుంది.


Also Read: 'నువ్వు సవతి తల్లివి' మాత్రమేనని వేద మనసు గాయపరిచిన ఆదిత్య- హనీమూన్ నుంచి తిరిగొచ్చిన వసంత్, చిత్ర


రుద్రాణి: ఒకవైపు నేను టెన్షన్ తో చచ్చిపోతుంటే నువ్వు కూల్ గా ఎలా ఉంటున్నావ్? అసలు పెళ్లి ఎలా ఆపబోతున్నావ్? స్వప్నని తప్పిస్తున్నావా? లేదా?


రాహుల్: నువ్వు ఏం టెన్షన్ పడకు మమ్మీ ఆ స్వప్న కనీసం పెళ్లి పీటలు కూడా ఎక్కదు. నువ్వు నా పెళ్లి వెన్నెలతో జరిగేలా చూడు తన ఆస్తి నాకు గిఫ్ట్ గా ఇవ్వు


పెళ్లికొడుకు రాహుల్ పీటల మీద కూర్చుంటాడు. స్వప్న గదిలో టిఫిన్ చేస్తుంటే మైఖేల్ వచ్చి తనని కిడ్నాప్ చేస్తాడు. స్వప్న పీటల మీద కూర్చుంటే ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని రాహుల్ టెన్షన్ పడతాడు. స్వప్న కోసం కావ్య, కనకం వాళ్ళు గదిలోకి వస్తారు. ఎక్కడ చూసినా కూడా స్వప్న కనిపించకపోయే సరికి కంగారుపడతారు. పని పూర్తయ్యిందని రాహుల్ తల్లికి సైగ చేసి చెప్తాడు. కావ్య స్వప్న లేకుండా ఒట్టి చేతులతో రావడంతో అందరూ షాక్ అవుతారు. స్వప్న ఎక్కడని రుద్రాణి ఏమి తెలియనట్టు అడుగుతుంది. గదిలో అక్క లేదని కావ్య చెప్పేసరికి ఆశ్చర్యపోతారు.


రుద్రాణి: ఎక్కడికి వెళ్ళింది మీ అక్క


కావ్య: తెలియదు


రుద్రాణి: మీ చరిత్ర తెలుసు రాజ్ పెళ్లిలో నుంచి వెళ్ళిపోయింది అది మొదటి అధ్యాయం ఇప్పుడు నా కొడుకు పెళ్లి నుంచి వెళ్ళిపోయింది


కావ్య: ఆయన పెళ్లి నుంచి వెళ్ళిపోయింది నీ కొడుకు కోసమే తను ఏమి పారిపోదు తనకి ఈ పెళ్లి ఇష్టమే. ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేస్తుందా


రాజ్; అవును ఇప్పటివరకు ఇంట్లో ఉన్న స్వప్న ఎందుకు వెళ్ళిపోతుంది


Also Read: ముకుందకి థాంక్స్ చెప్పిన రేవతి- ఇంకెన్నాళ్ళు ఈ మురారీ, కృష్ణ ప్రేమ ఊగిసలాట


అపర్ణ; అవును ఈ పెళ్లి కోసమే కదా వెన్నెలతో నిశ్చితార్థం ఆపించింది


శుభాష్: ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా?


తన కూతుర్ని వెతికి తీసుకురమ్మని కనకం ఏడుస్తుంది. అక్క ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని కావ్య వెళ్తుంది.