మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో దర్శకుడు కొరటాల శివకి మంచి అనుభవం ఉంది. కమర్షియల్ కథలను సందేశాత్మకంగా చిత్రీకరిస్తుంటారాయన. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్సే. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు కొరటాల. 


తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. 'ఆచార్య' సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండదని.. ఇదొక డిఫరెంట్ కథ అని అన్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఇలాంటి కథ రాయలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు.


అలానే తన తదుపరి సినిమాల గురించి కూడా కొరటాల మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నానని.. ఆయన కోసమే ఓ కథను సిద్ధం చేసి పెట్టానని తెలిపారు. కొరటాల మాటలను బట్టి పవన్ తో కచ్చితంగా సినిమా ఉందనిపిస్తోంది. దీంతో పాటు హీరో ప్రభాస్ తో ఓ సినిమా.. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్పారు. ఇకపోతే రామ్ చరణ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ చేయబోతున్నట్లు చెప్పారు.  


Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు


Also Read: పవన్ సినిమాలో డైలాగ్ లీక్ చేయించిన చిరంజీవి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే