తమిళనాడుకి చెందిన మీరా మిథున్ మోడల్ గా, నటిగా ప్రేక్షకులకు దగ్గరైంది. తన ప్రాజెక్ట్ లతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈమె పెళ్లి చేసుకున్న అతి కొద్దిరోజుల్లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. రెండేళ్ల క్రితం ఓ మ్యాగజైన్ కి టాప్ లెస్ ఫోటోలిచ్చి సంచలనం సృష్టించారు. అయితే మోడల్ గా ఉన్నప్పటి నుండి ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.
2019లో తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పోటీ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈమె మోడీ సపోర్టర్. బీజీపీ పార్టీను, మోడీని ఎంతగానో అభిమానించే మీరా గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె దళితులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక దర్శకుడి ఉద్దేశిస్తూ మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ డైరెక్టర్ తన పర్మిషన్ తీసుకోకుండా ప్రమోషన్స్ కోసం తన ఫోటోలు వాడుకున్నారని ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో దళితులందరినీ ఆవిడ కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని.. చట్ట వ్యతిరేక పనులు చేసేది వాళ్లేనని సంచలన కామెంట్స్ చేశారు. దళితుల కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమిళ సినీ పరిశ్రమలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లను బయటకు వెళ్లిపోవాలని.. వారి వలనే క్వాలిటీ సినిమాలు రావడం లేదని మీరా మిథున్ చెప్పుకొచ్చారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట దుమారం సృష్టించాయి. తమిళనాడుకి చెందిన దళిత పక్షపాత పార్టీ వీఎస్కే.. మీరామిథున్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులను కించపరిచేలా ఆమె చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరింది. వీడియో ఆధారాలు కూడా స్పష్టంగా ఉండడంతో పలు సెక్షన్ల కింద మీరా మిథున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించిన మీరామిథున్ పై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసు నుండి ఆమె ఎలా తప్పించుకుంటుందో చూడాలి.
Also Read : MAA Naresh: ‘చచ్చిపోతుంటే వదిలేస్తామా?’ హేమాపై జీవిత ఫైర్.. మండిపడ్డ నరేష్!
Anupam Shyam Passed Away: ప్రముఖ సినీ నటుడు కన్నుమూత