Kiran Abbavaram’s Mass Jathara Song Out: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ స‌స్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  కిరణ్ తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ‘మాస్‌ జాతర’ అనే పాటను విడుదల చేశారు. ‘ఆడు ఆడు ఆడు..’ అంటూ దుమ్మురేపుతోంది. సామ్‌ సీ సంగీతాన్నందించిన ఈ పాట హుషారెత్తించే బీట్‌ తో ఆకట్టుకుంటోంది. సినిమాపై ఈ సాంగ్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతోంది.  పూర్తి పాటను ఇవాళ సాయంత్రం 7 గంటల 29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘క’


ఇక ‘క’ సినిమాను శ్రీ చక్రాస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి ప్రొగ్యూస్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో  పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. కథాకు అనుగుణంగా ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. పాన్ ఇండియన్ మూవీగా తెరెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన  మలయాళ థియేట్రికల్‌ హక్కులను స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కొనుగోలు చేశారు. నయన్‌సారిక, తన్వీరామ్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వాస్‌ డానియేల్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నారు.


ఏడాది గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న కిరణ్


సుమారు ఏడాది గ్యాప్ తర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నాడు. గ‌త ఏడాది ఆయన హీరోగా నటించిన ‘మీట‌ర్’.. ‘రూల్స్ రంజ‌న్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి.  ఈ సినిమాల్లో క‌థ‌లతో పాటు ఆయన క్యారెక్టర్లు చెత్తగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీపై కిరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘క’ మూవీతో సంథింగ్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. త్వరలో ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా విడుదలకానుంది.  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి వరుస ఫ్లాఫులకు చెక్ పెట్టాలని కిరణ్ అబ్బవరం భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొత్త పాయింట్‌ తో వస్తున్న ‘క’ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. 


Read Also:విజయ్ 69వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ప్రేమలు బ్యూటీ మంచి ఆఫరే పట్టిందిగా



Read Also: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్