Trinayani Serial Today Episode లలితాదేవి ఇంటి నుంచి వెళ్లిపోతా అంటే తిలోత్తమ భుజంగమణి దొంగతనం చేసి ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటున్నావని అంటుంది. లలితాదేవిని దొంగ అని తిలోత్తమ అనడంతో అందరూ షాక్ అయిపోతారు. 


తిలోత్తమ: మర్యాదగా భుజంగమణిని ఇచ్చి వెళ్లు అక్క. కొట్టేసిన భుజంగమణిని ఇక్కడ పెట్టేసి వెళ్లమను. లేదంటే..
విశాల్: అమ్మా..
లలితాదేవి: లేదంటే.
తిలోత్తమ: గన్ తీసి లలితాదేవికి గురి పెడుతుంది. పాప లలిలాదేవి ఒడిలో ఉందని అని అందరూ చెప్పినా తిలోత్తమ వినదు. ఏం చేస్తున్నావో నీకు అయినా అర్థం అవుతుందా అని అంటారు. 
సుమన: అత్తయ్య మీరు కాల్చేస్తారని భయంతో లలితాదేవి అత్తయ్య పాపని ఇవ్వడం లేదు. ఆత్మ రక్షణ కోసం పాపని ఒడిలోనే పెట్టుకున్నారు.
లలితాదేవి: అసలు నా మీద రివాల్వర్ ఎందుకు గురి పెట్టావో చెప్పు.
తిలోత్తమ: అందరికీ కొత్త బట్టలు ఇచ్చి కొత్త బట్టలో భుజంగమణి ఉందని చెప్పి ఇప్పుడు అది దాసేశావ్ మర్యాదగా మణి ఇవ్వు అక్క. నిన్ను కాల్చి అయినా సరే భుజంగమణి ఈ ఇళ్లు దాటకుండా చేద్దాం అనుకున్నా. 
లలితాదేవి: నా దగ్గర మణి ఎందుకు ఉంటుంది. 
తిలోత్తమ: అక్క భుజంగమణి బయటకు తీసుకురా.
లలితాదేవి: నయని భుజంగమణి తీసుకో. 
హాసిని: తీసుకో మంటున్నారు ఎక్కడుంది నయని.


నయని, తిలోత్తమ దగ్గరకు వెళ్తుంది. తిలోత్తమ నయనిని దగ్గరకు రావొద్దని రివాల్వర్ పెడుతుంది. భుజంగమణి తిలోత్తమ అత్తయ్య దగ్గరుందని నయని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. దాంతో విక్రాంత్ మీరే ఎత్తేసి పెద్దమ్మ మీద బాగా తోసేస్తున్నారే అంటుంది. ఇక నా దగ్గర లేదని తిలోత్తమ అంటుంది. నయని తిలోత్తమ కొంగుకున్న భుజంగమణిని బయటకు తీస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నా కొంగులో ఉన్నట్లు నాకే తెలీదని తిలోత్తమ అంటుంది.


సుమన: మరి అక్కకి ఎలా తెలుసు.
లలితాదేవి: నయనినే తిలోత్తమ చీరకు కట్టింది కనక. చీర ఇచ్చినప్పుడే అందులో కట్టి ఇస్తుంది నయని.
నయని: అమ్మగారు చెప్పారు నేను చేశాను.
హాసిని: మరి రివాల్వర్ ఎందుకు తీసుకొచ్చారు తిలోత్తమ అత్తయ్య. 
లలితాదేవి: రివాల్వర్ తెచ్చి మంచి పనే చేసింది. నన్ను షూట్ చేయాలని గన్ గురి పెట్టినప్పుడు పాప నా దగ్గరే ఉంది అంటే ఆపద నాకు పాపకి. గండం నాకు వచ్చిందా లేకపోతే పాపకి వచ్చిందా అన్న విషయం నయని పసిగట్టిందా.
నయని: లేదు
హాసిని: అంటే..
లలితాదేవి: అంటే పాప నాఒడిలో ఉండటం వల్లే నయని పసిగట్టలేకపోయింది. పాప నా దగ్గర ఉన్నప్పుడు నయని ఆపద గుర్తించలేకపోయింది అంటే ఈ పాప జోగయ్య శాస్త్రి గారి మనవరాలు కానే కాదు. 
నయని: అమ్మగారు.
లలితాదేవి: అవును నయని బాగా ఆలోచించండి మీకే అర్థం అవుతుంది. మానసాదేవి కటాక్షం మీ మీద ఉండాలి. వెళ్లొస్తాను భుజంగమణి జాగ్రత్త. 


అందరూ ఆలోచనలో పడతారు. ఇక తిలోత్తమ చీర కట్టుకున్నప్పుడు భుజంగ మణి చూడలేదా అని వల్లభ తల్లిని తిడతాడు. టెన్షన్‌లో గుర్తు పట్టలేకపోయా అని ఈ సారి నయని ఎక్కడ పెడుతుందో కచ్చితంగా చూస్తానని తిలోత్తమ అంటుంది. విశాల్ దగ్గరకు నయని వస్తుంది. గాయత్రీ పాప జోగయ్య శాస్త్రి గారి మనవరాలు అని అంటే అందరూ ఆలోచనలో పడితే మీరు మాత్రం ఏం అనుమానం లేకుండా ఉన్నారని ప్రశ్నిస్తుంది. నయని విశాల్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏదో రహస్యం దాస్తున్నారని అనిపిస్తుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: కళ్లు తెరిచిన రాఘవ.. RR కంపెనీ కూల్చేయడం వెనక జీవన్ కుట్రని తెలుసుకున్న రాజు!