Ammayi garu Serial Today Episode రాజు శ్వేతతో పెళ్లికి సిద్ధమవుతాడు. రాజు అలా పెళ్లికి ఒప్పుకోవడం అనుమానంగా ఉందని శ్వేత అన్నతో అంటుంది. జీవన్ గుడి చుట్టూ తన మనుసుల్ని ఉంచానని అంటాడు. ఇక రాజు ఆలోచిస్తూ ఉంటాడు, రూప ఏడుస్తూ ఉంటుంది.
విజయాంబిక: రేయ్ దీపక్ కన్న తండ్రి ఎంత కసాయి అయినా కూతురి కోసం మారుతాడు. మీ మామయ్య మారినా పర్లేదు కానీ ఆ రాఘవ బతికితే మాత్రం మనం చావడం ఖాయం. కాబట్టి నువ్వు వెళ్లి ఆ రాఘవ గాడిని లేపేయ్ నేను ఇక్కడ మీ మామయ్యని ఆ కుర్చీ నుంచి లేవకుండా చూసుకుంటా.
దీపక్: సరే మమ్మీ.
రూప: ఏడుస్తూ నాన్న ఎందుకు అలా మౌనంగా ఉన్నారు అసలేం అర్థం కావడం లేదు. అక్కడ అత్తయ్య రాజుకి పెళ్లి చేసేస్తే నా పరిస్థితి ఏంటి అని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. అక్కడ రాజు ఏం చేస్తున్నాడో ఏమో.
పంతులు రాజు, శ్వేతలను పిలుస్తాడు. ముత్యాలు శ్వేతని పిలుస్తుంది. రాజుకి ఈ పెళ్లి ఇష్టమేనా అని శ్వేత అడుగుతుంది. ఇక రాజు రూపకి కాల్ చేసి పెద్దయ్య గారు బయల్దేరా అని అడుగుతాడు. లేదు అని రూప ఏడుస్తుంది. దాంతో రాజు ఏం భయపడొద్దు చివరి నిమిషంలో అయినా పెద్దయ్య గారు వస్తారని రాజు అంటాడు. మరోవైపు జీవన్ ఆరోజు ప్రెస్ మీట్‌లో ఉన్న రిపోర్ట్‌తో మాట్లాడటం రాజు చూసేస్తాడు. ఆ విషయం రూపకి చెప్పి కాల్ కట్ చేస్తాడు.
జీవన్: నువ్వు ఎందుకు రా నన్ను డైరెక్ట్‌గా కలుస్తున్నావ్ నిన్ను నన్ను ఆ రాజు చూస్తే నేనే వాడి కంపెనీ కూలగొట్టించా అని తెలిసిపోతుంది.
రాజు: అంటే నా కంపెనీ కూలగొట్టడం వెనక పెద్దయ్యగారి హస్తం లేదన్న నా అనుమానం నిజమే అన్నమాట. కంపెనీని కూల్చేయడంలో వీళ్ల ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి.
జీవన్: ఈ పెళ్లి అయ్యే వరకు రాజుకి ఈ విషయం తెలీకుండా చూసుకోవాలి.
రాజు విలేకర్ని ఫాలో అవుతుండగా ముత్యాలు పిలుస్తుంది. ఐదు నిమిషాలు బయటకు వెళ్తా అంటే ముత్యాలు వద్దని రాజుని తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు విరూపాక్షి హాస్పిటల్‌లో దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఈ రోజు రాజు పెళ్లి అయిపోతే రాఘవ కళ్లు తెరిచినా లాభం ఉండదని అంటుంది. మరోవైపు దీపక్ హాస్పిటల్‌కి వస్తాడు. రాఘవని చంపాలనుకున్న టైంలో విరూపాక్షి రాఘవ దగ్గరకు వస్తుంది.
విరూపాక్షి: రాఘవ నా ఘోడు విని ఆ దేవుడు స్పందిచడం లేదు. నిజం చెప్తే సూర్య వినే పరిస్థితిలో లేడు. నా బాధ నువ్వు తప్పు ఇంకెవరూ అర్థం చేసుకోరు అనిపిస్తుంది. ఎప్పుడూ అమ్మగారు అమ్మగారు అని ఒక బిడ్డలా ఉండే వాడివి నేను కూడా నిన్ను ఒక బిడ్డలానే చూసుకునే వాడిని అప్పుడు మీ అమ్మగారి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉండేవాడికి కదా రాఘవ. ఇప్పుడు లెగు రాఘవ మీ అమ్మగారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వే నాకు దేవుడు. ఆ రోజు నువ్వు అమ్మగారు అని పిలిచే పిలుపులో నువ్వు నిజంగా మీ అమ్మని చూస్తే లే రాఘవ. నన్ను అమ్మగారు అనుకోవద్దు మీ అమ్మ అనుకో రాఘవ. నా మీద పడిన నింద చెరపాల్సిన బాధ్యత నీ మీదే ఉంది రాఘవ.
విరూపాక్షి కన్నీరు రాఘవ చేయి మీద పడటంతో రాఘవలో చలనం వస్తుంది. విరూపాక్షి చాలా సంతోషిస్తుంది. దీపక్ షాక్ అయిపోతాడు. విరూపాక్షి డాక్టర్‌ని పిలుస్తుంది. రాఘవ లేచాడని విరూపాక్షి రూపకి చెప్తుంది. అది విజయాంబికి కూడా వింటుంది. దీపక్ రాఘవని చంపకుండా ఏం చేస్తున్నాడని అనుకుంటుంది. ఇక విరూపాక్ష తన తండ్రిని తీసుకొని గుడికి రమ్మని చెప్తుంది. తను కూడా రాఘవని తీసుకొని వస్తానని అంటుంది. డాక్టర్ వద్దు అన్నా బతిమాలి రాఘవని బయటకు తీసుకెళ్లడానికి విరూపాక్షి పర్మిషన్ తీసుకుంటుంది. విజయాంబిక దీపక్‌కి కాల్ చేసి రాఘవ గుడికి వస్తే మనం చస్తామని అంటుంది. దీపక్ రాఘవ గుడికి రాక ముందే చంపేస్తా అంటాడు. రాఘవని తీసుకొని విరూపాక్షి బయల్దేరుతుంది. రూప తండ్రి దగ్గరకు వచ్చి రాఘవ కోమా నుంచి బయటకు వచ్చాడని అమ్మ గుడి దగ్గరకు వస్తుందని మిమల్ని రమ్మని చెప్తుంది. నేను రాను అని సూర్య ప్రతాప్ అంటాడు. విజయాంబిక కావాలని సూర్యని రెచ్చగొడుతుంది. ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని సూర్యని అడ్డుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.