Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫోన్‌లో తన ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు. కనకం గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. రేపు నిశ్చితార్థం తర్వాత పెళ్లి అంటారు ఇలా తన స్వార్థం తాను చూసుకుంటే కనకం గురించి ఎలా అని అంటాడు. నీ చుట్టూ పరిస్థితుల బట్టి నువ్వు అలా నడుచుకోవాల్సి వస్తుందని తప్పదని విహారి ఫ్రెండ్ అంటాడు. ఇక కనకం అప్పడే వచ్చి విహారి మాటలు వింటుంది.


విహారి: అలా అని నేను సైలెంట్‌గా ఉండలేనురా. ఎన్ని ప్రయత్నాలు చేసిన కనక మహాలక్ష్మీ ఆచూకి తెలుసుకోలేకపోతున్నా. తనని క్షేమంగా తన తల్లి దండ్రల దగ్గరకు చేర్చాలిరా. అద్దంలో నేను చూసుకున్న ప్రతీ సారి నా అసమర్థతే కనిపిస్తుంది. ఆదికేశవ్ గారు ఫోన్ చేసిన ప్రతీ సారి నాకు తప్పు చేసినట్లు ఉంది. చిన్న అబద్దాన్నే తట్టుకోలేని నేను ఇప్పుడు ఆయనతో ప్రతీసారి అబద్ధం చెప్తున్నాను రా. నన్ను చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుందిరా.
లక్ష్మీ: విహారి గారు నా కోసం ఇంత వెతుకుతున్నారా.
సహస్ర: అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నుంచి నేర్చుకున్నావ్ బావ. నేను మొత్తం విన్నాను. నువ్వు చాలా మంచోడివని నీ మీద అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ నువ్వు ఇలా అందరికీ అబద్దాలు చెప్తూ అందరికీ మోసం చేస్తున్నావ్  కదా చెప్పు బావ చెప్పు.
విహారి: సహస్ర అది.. సహస్ర..
సహస్ర: నవ్వుతూ నేను ఏదో అలా ఫ్రాంక్ చేయాలని అలా అంటే నువ్వేంటి బావ. బావ నిశ్చితార్థం డ్రస్ ఇదిగో.


మరోవైపు కనకం మేడ మీద బట్టలు ఆరేస్తుంటుంది. చారుకేశవ లక్ష్మీని చూసి అక్కడికి వెళ్తాడు. లక్ష్మీని చంపేయాలి అని చున్నీ తీసి తన మెడకు చెట్టడానికి వెళ్తాడు. లక్ష్మీ చాలా భయపడుతుంది. వెళ్లిపోమని చెప్పినా వెళ్లలేదు అని చంపేస్తా అన్నా భయపడలేదని అందుకే ఇప్పుడే చంపేస్తా అని అంటాడు. ఇంతలో పని మనిషి వచ్చి లక్ష్మీని పిలవడంతో లక్ష్మీ తొందరగా వెళ్లిపోతుంది. ఇక అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. వసుధ సహస్రకి గోరింటాకు పెడుతుంది. సహస్ర పక్కనే అంబిక కూర్చొని సహస్ర మీద సెటైర్లు వేస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఇక సహస్ర తన అమ్మమ్మకి గోరింటాకు పెట్టమని తాతయ్యకి చెప్తుంది. ఇక సహస్ర అంబికతో పిన్ని నువ్వు కూడా ఎవరినో చూసుకుంటే ఇదే పందిట్లో తాతయ్య నీ పెళ్లి కూడా చేసేసే వాడని అంటుంది. విహారి బావని చేసుకోవడం వల్ల నేను చాలా అదృష్టం అంటుంది. 


మరోవైపు పండు కనకం వంటలను పొగిడేస్తాడు. యమున అమ్మగారు నిన్ను తీసుకొచ్చారు కదా నువ్వు ఈ ఇంటి మనిషివే అని అంటాడు. ఇక విహారి హాల్‌లోకి వస్తే సహస్ర గోరింటాకు పెడతానని గోల చేస్తుంది. విహారి తర్వాత పెట్టించుకుంటానంటే ఒప్పుకోదు. దాంతో పద్మాక్షి నిశ్చితార్థం ముందు పెట్టుకోమని అంటుంది. ఇక విహారి తన తల్లి లేకపోవడం చూసి అమ్మ రాలేదా పిలవలేదా అంటాడు. దానికి విహారి తాత రెండోదే అనుకో అంటాడు దాంతో విహారి యమునను తీసుకొచ్చి పద్మాక్షి పక్కనే కూర్చొపెడతాడు. తనకి కూడా గోరింటాకు పెట్టమని వసుధకి చెప్తాడు. ఇక పద్మాక్షి రగిలిపోతుంది. తన పక్కన కూర్చొవడం ఇష్టం లేక లేచి ఫోన్ మాట్లాడుతూ వెళ్లబోతే విహారి ఆపుతాడు.  


విహారి: ఏంటి అత్తయ్యా అలా వెళ్లిపోతున్నావ్. నిజంగానే ఫోన్ వచ్చిందా లేక అమ్మ పక్కన కూర్చొవడం ఇష్టం లేక అలా వెళ్లిపోతున్నావా. 
పద్మాక్షి: అలా ఏం లేదు విహారి నిజంగానే ఇంపార్టెంట్ కాల్.
విహారి: మా అమ్మ అంటే మీ అందరికీ ఎందుకు ఇష్టం లేదో నాకు తెలీదు. ఎందుకు అసహ్యించుకుంటారో తెలీదు. కానీ ఒక్క మాట నిజం అత్త ఈ రోజు ఈ రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయంటే దానికి కారణం మా అమ్మ. ఇన్నేళ్లకి నీ పుట్టింటిలో నువ్వు కాలు పెట్టావంటే దానికి కారణం మా అమ్మ. ఈ రోజు ఈ కుటుంబం మొత్తం ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మా అమ్మ. మా అమ్మ బాధ తెలుసుకున్నానే నేను ముందడుగు వేశా మా అమ్మ కోరిక తెలుసుకొనే ఈ పెళ్లికి రెడీ అయ్యాను. మా అమ్మ విహారి ఈ పెళ్లి చేసుకోవద్దు అని ఒక్క మాట అని ఓ గీత గీస్తే చాలు ఇక జీవితాంతం ఈ విహారి ఆ గీత దాటి వెళ్లడు.
పద్మాక్షి: ఏదో తేడాగా ఉంది నేను ఇగోకి పోతే ఈ పెళ్లి జరగదు. నైస్‌గా మ్యానేజ్ చేయాలి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: స్వప్న కోసం వచ్చిన కార్తీక్, కాంచన.. గుమ్మం బయటే శ్రీధర్, కావేరీ.. కన్నతల్లి ఎవరో? సవతి తల్లి ఎవరో?