Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్ తన చెల్లి సంజనను ఇంటికి పిలిచి తన తల్లి జాను విషయంలో చేసిందంతా చెప్తాడు. అమ్మ ఇంకా మారదా అని సంజన అంటుంది. జాను బాగా హర్డ్ అయిందని తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీక నిన్ను పిలిచానని వివేక్ అంటాడు.


వివేక్: వదినతో చెప్తే ఏదో రకంగా నా సమస్యకు పరిష్కారం చెప్తుంది కానీ నాకు తనని బర్డెన్ పెట్టాలని లేదు. పెద్దమ్మ పెద్దనాన్నలు అయితే నాకే నిర్ణయం తీసుకోమన్నారు. అందుకే నీకు పిలిచా. నువ్వు అయితే ఏదో ఒక మంచి నిర్ణయం చెప్తావ్.
సంజన: మరి ఏం చేయాలనుకుంటున్నావ్.
వివేక్: జానుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. 
సంజన: మంచి నిర్ణయం ఒకసారి అలా చేస్తే అమ్మ మరేం చేయలేదు. ఇప్పుడు వదినకు చెప్పినా తనని అమ్మ టార్గెట్ చేస్తుంది. సరేలే ఇదంతా నేను చూసుకుంటా. తాళి పళ్లెం అవి నేను తీసుకొస్తా మిగతావి నువ్వు చూసుకో.


మరోవైపు లక్ష్మీ వాళ్లు డాక్టర్‌ని కలుస్తారు. నన్ను ఎందుకు తీసుకొచ్చావ్ అని జున్ను అడుగుతూనే ఉంటాడు. జున్నుని నర్స్‌లోపలికి తీసుకెళ్తుంది. బయట లక్ష్మీ వాళ్లు ఎదురు చూస్తుంటారు. ఇక మనీషా లక్ష్మీతో ఫలితం గురించి టెన్షన్‌ పడుతున్నావా అని అంటుంది. దానికి లక్ష్మీ రాబోయే ఫలితం నాకు తెలుసు కానీ నేను దీనికి ఒప్పుకుంది నిన్ను శాశ్వతంగా పంపేయడానికి నీ అంతు తేల్చడానికి అని అంటుంది. ఇక జున్ను నర్స్‌ని ఎందుకు ఈ టెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు. దాంతో నర్స్ జున్నుకి మొత్తం చెప్పేస్తుంది. జున్ను షాక్ అయిపోతాడు. ఇక సంజన, వివేక్ కిందకి  వస్తారు. ఈ మాత్రం దానికి నువ్వు రావడం ఎందుకే వివేక్‌ని నేనే చూసుకునేదాన్ని అని దేవయాని సంజనతో అంటే నీకు చెప్పుకోలేకే నన్ను పిలిచాడు అంటుంది. ఇక దేవయాని కూతురితో మీ అత్త లేట్ అయితే తిడుతుంది త్వరగా వెళ్లు అంటే సంజన మా అత్త నీలా కాదు చాలా మంచిది అని తల్లికి కౌంటర్ వేస్తుంది. అరవింద, జయదేవ్ అక్కడికి వస్తారు.


అరవింద: ఏదైనా శుభవార్తా సంజన. 
దేవయాని: శుభవార్త ఏంటి అక్క.
అరవింద: మొన్న దీక్షితులు గారు త్వరలో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుందని చెప్పారు అందుకే అలా అడిగా.
సంజన: దీక్షితులు గారు నిజమే చెప్పారు పెద్దమ్మ.
దేవయాని: నాకు తెలిసిన శుభకార్యం ఏంటే. అంటే నేను వివేక్‌ కోసం సంబంధం చూశా అదేనా
సంజన: నీకే తెలుస్తుందిలే.
దేవయాని: ఏంటి ఇది ఏదో తేడాగా మాట్లాడుతుంది.


మరోవైపు డాక్టర్ జున్ను దగ్గరకు వెళ్తే అక్కడ జున్ను ఉండడు. నర్స్, డాక్టర్లు వచ్చి లక్ష్మీ వాళ్లతో విషయం చెప్తారు. నర్స్ DNA టెస్ట్ గురించి చెప్పానని అంటే మనీషా నర్స్‌ని తిడుతుంది. ఇక జున్ను ఎక్కడికి వెళ్లాడా అని లక్ష్మీ బయట అంతా వెతుకుతుంది. జున్ను రోడ్డు మీద నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళ్తుంటాడు. ఇక మనీషా ఇంటికి బయల్దేరుతుంది.  లక్ష్మీ చాలా టెన్షన్ పడి రోడ్ల మీద వెతుకుతూ అరవిందకి కాల్ చేసి అడుగుతుంది. జున్ను కనిపించడం లేదని చెప్తుంది. ఇంతలో అరవింద బయట చూసి జున్ను ఇంటికి వచ్చాడని నువ్వు నువ్వు ఇంటికి రా అని చెప్తుంది. ఒక్కడివే వచ్చావ్ తప్పు కదా అని అరవింద అంటుంది.


జున్ను: నేను చేసింది తప్పు అయితే మరి మీరు చేసింది ఏంటి నానమ్మ. మనీషా నన్ను ఎక్కడికి తీసుకెళ్లిందో తెలిసి కూడా మీరు ఎవరూ ఆపలేదు కదా. అది తప్పు కాదా.
దేవయాని: ఏంట్రా తప్పు మనీషా ఇంట్లో అందరికీ చెప్పే కదా నిన్ను తీసుకెళ్లింది. అక్కడ బుద్ధిగా టెస్ట్ చేయించుకోకుండా ఇలా వచ్చావ్ పెద్ద వాళ్లని ఎదురిస్తున్నావ్. 


ఇక దేవయానిని పిల్లలతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా అని జున్ను ప్రశ్నించడంతో దేవయానిని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. దాంతో అరవింద ఆపుతుంది. ఎదురించడం వాడి హక్కు అని ఏ తప్పు చేయని, ఎవరికీ తల వంచని రక్తం అది అని జయదేవ్ అంటాడు. వివేక్ కూడా మంచి పని చేశావ్రా నీ లా నేను ఎదురు తిరగగలిగితే నా వల్ల ఒకరు బాధ పడేవారు కాదని అంటాడు. ఇక ఇంతలో మనీషా వచ్చి జున్నుని తిడుతుంది. నువ్వు మీ అమ్మ కలిసే కదా ఇలా ప్లాన్ చేశారని అంటుంది. ఇంతలో లక్ష్మీ వచ్చి జున్నుని హగ్ చేసుకుంటుంది.


ఇక జున్ను లక్ష్మీతో ముందే నాకు విషయం ఎందుకు చెప్పలేదమ్మా నేను ఎంత షేమ్ అయ్యానో తెలుసా. ఎంత బాధ పడ్డానో తెలుసా అంటాడు. ఇక నేను ఎందుకమ్మా ఆ టెస్ట్ చేయించుకోవాలి నేను ఎవరి కొడుకునే అని చెప్పడానికి ఆ డాక్టర్లు ఎవరు. నేను నాన్న కొడుకు అని చెప్పడానికి డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వాలా అని అడుగుతాడు. లక్ష్మీ జున్ను ప్రశ్నలకు ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉండిపోతుంది. మాట్లాడాల్సిన వారు మౌనంగా ఉన్నారని లక్ష్మీ అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: స్వప్న కోసం వచ్చిన కార్తీక్, కాంచన.. గుమ్మం బయటే శ్రీధర్, కావేరీ.. కన్నతల్లి ఎవరో? సవతి తల్లి ఎవరో?