Jagadhatri Serial Today Episode: ఒక సేటు బంగారు నగలు తీసుకొచ్చి వైజయంతికి ఇస్తాడు. కౌషికి ఆర్డర్ చేసిందని చెప్తాడు. కౌషికి చాలా మంచిదని వైజయంతి పొగుడుతుంది. ఇంతలో బంగారు రాఖీ తయారు చేయమని ఉంది ఏంటని నిషిక అడుగుతుంది. దీంతో రాఖీ పండుగ తర్వాత ఒక రోజు రాత్రి పూట కౌషికి గారు ఫోన్ చేసి బంగారు రాఖీ చేయమని ఆర్డర్ ఇచ్చారని చెప్తాడు. దీంతో వైజయంతి కోపంగా కౌషికిని తిడుతుంది. దీంతో అందరికీ అనుమానం వస్తుంది. కౌషికికి అబార్షన్ అయిందా? అని ఆలోచిస్తారు. అదేంటో తెలుసుకుందాం పదండి అని హాస్పిటల్ కు బయలుదేరుతారు. మరోవైపు హాస్పిటల్ లో కౌషికిని టెస్ట్ చేసిన డాక్టర్ మీరు చాలా వీక్ గా ఉన్నారు ట్రెస్ పెట్టుకోవద్దని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఇంతలో వైజయంతి, నిషిక, కాచి అక్కడకు వస్తారు.
ధాత్రి: వదిన మీరు ఇక్కడే కూర్చోండి మేము వెళ్లి మెడిసిన్స్ తీసుకొస్తాము.
మరోవైపు
నిషిక: సిస్టర్..
సిస్టర్: చెప్పండి మేడం.
నిషిక: కౌషికి గారు వచ్చారా?
సిస్టర్: ఇందాకే జగధాత్రి మేడం వాళ్లు తీసుకెళ్లిపోయారు.
కాచి: ఆవిడ ఎందుకు వచ్చింది ఎందుకు డాక్టర్ ను కలిసింది.
నిషిక: కౌషికి గారికి అసలు అబార్షన్ అయిందా?
వైజయంతి: ఏందమ్మీ ఈ అమ్మీ ఏమీ అడిగినా అట్టా కళ్లు అప్పగించుకుని చూస్తూ ఉన్నాది.
కాచి: నోరు తెరవాలంటే చేయి బరువెక్కాలి పెద్దమ్మ.
అని డబ్బులు తీసి ఇస్తుంది. కాచి డబ్బులు తీసుకున్న సిస్టర్ నాక్కూడా తెలియదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిషిక ఇప్పుడెలా అత్తయ్యా అని అడగ్గానే మనకు నిజం తెలిసిపోయిందని డాక్టర్ దగ్గర నిజం రాబడదాము పదండి అని అందరూ డాక్టర్ చాంబర్ లోకి వెళ్తారు. డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకోవాలనుకుంటే డాక్టరే వాళ్లను బెదిరించి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. బయట ఉన్న ధాత్రి వాళ్లను చూస్తుంది. తాను ఆడిన నాటకం గుర్తు చేసుకుంటుంది. లోపలికి వెళ్లి డాక్టర్ కు థాంక్స్ చెప్పి వెల్లిపోతుంది. మరోవైపు బయటకు వెళ్తున్న వైజయంతి వాళ్లకు కౌషికి ఎదురు వస్తుంది.
వైజయంతి: ఏందమ్మీ ఆగావు. ( పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయామే ఇక కౌషికి కోపానికి కాలిపోవాల్సిందేనా? అని మనసులో అనుకుంటుంది.)
ధాత్రి: అత్తయ్యగారు మీరందరూ హాస్పిటల్ కు ఎందుకు వచ్చారు.
కేదార్: అలా చూస్తున్నావేంటి నిషి చెప్పండి. ఎందుకు హాస్పిటల్ కు వచ్చారు.
కౌషికి: ఏమైంది పిన్ని ఎందుకు ఎవరూ మట్లాడటం లేదు.
ధాత్రి: మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో భయపడుతున్నట్లు..ఏదో దాస్తు్న్నట్లు.. కంగారుపడుతున్నట్లు ఉంది అత్తయ్యగారు.
వైజయంతి: నేనేం దాస్తున్నాను అమ్మీ ఏం లేదు.
ధాత్రి: మరి హాస్పిటల్ కు ఎందుకు వచ్చినట్టు..
నిషిక: హాస్పిటల్ కు ఎవరైనా ఎందుకు వస్తారే..
కౌషికి: ఏమైంది పిన్ని ఎవరికైనా హెల్త్ బాగాలేదా? డాక్టర్ గారు ఉన్నారు పదండి వెళ్దాం.
కాచి: వద్దక్కా డాక్టర్ గారి దగ్గరకు మాత్రం వద్దు.
ధాత్రి: అదేంటి కాచి ఎవరైనా హాస్పిటల్‌కు ఎందుకు వస్తారు. డాక్టర్‌కు చూపించుకోవడానికే కదా?
నిషిక: ఏంటో ఇందాక నుంచి చూస్తున్నాను.మేమేదో తప్పు చేసి వచ్చిన వాళ్ల లాగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు.
అని నిషిక కోప్పడుతుంటే వైజయంతి భయపడి కౌషికిని కూల్ చేయడానికి నిన్ను చూడ్డానికే వచ్చామని చెప్తుంది. అలాగే కాచికి కొంచెం పంటి నొప్పి అంటే చూపిద్దామని వచ్చాం అంటుంది. దీంతో పదండి డాక్టర్ దగ్గరకు అనగానే ఏమీ వద్దని నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అనగానే సరే అని ధాత్రి, కేదార్, కౌషికి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కారు దగ్గరకు వచ్చిన కేదార్, ధాత్రి డ్రైవర్ గురించి ఆలోచిస్తారు. ఇంతలో కౌషికి వచ్చి వెళ్దాం పదండి అనగానే అందరూ వెళ్లిపోతారు. ఇంతలో ఒక వ్యక్తి కారుకు అడ్డు రాగానే ఆయన్ని చూసిన కౌషికి నాన్న చనిపోయిన రోజు నాన్నని తీసుకెళ్లిన డ్రైవర్ అబ్బులు అంటూ గుర్తు పడుతుంది. ఇంతలో కేదార్ ఆయన్ని ఫోటో తీస్తాడు. కౌషికి కంగారుపడుతుంటే మేము చూసుకంటాము మీరు కూల్‌గా ఉండండి అని చెప్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం