Ammayi garu Serial Today Episode రాజు రూపకు కాల్ చేసి మాట్లాడుతాడు. రూప మాట్లాడటం విజాయాంబిక, దీపక్ వింటారు. మరోవైపు సూర్య ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. సూర్య ప్రతాప్‌లో మార్పు మొదలయ్యేలా ఉందని అలా జరిగితే మన భవిష్యత్ పోతుందని ఎలా అయినా మన ప్లాన్ మనం వేసుకోవాలని విజయాంబిక అంటుంది. అందుకు ఇప్పుడే తమ్ముడి మనసు మార్చాలని అనుకుంటారు.


సూర్యప్రతాప్: నా కూతురు ప్రాణంగా ప్రేమించిన రాజుని నాకు నచ్చలేదని కారణంతో విడదీయడం సరి కాదేమో. నా తప్పుడు నిర్ణయాలతో నా కూతురి జీవితం నాశనం కావడం కరెక్టే కాదేమో. రేపు నేను రెస్పాండ్ అవ్వాలి. లేదంటే రేపు నా దృష్టిలో ఒక్క రోజు ముగిసిపోతుంది. కానీ రేపు నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. అలా అని నేను వెళ్లి పెళ్లి ఆపితే ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా. కానీ కన్న కూతురి జీవితం బాగు చేయలేకపోతే ఇంకెవరి జీవితం బాగు చేయగలను వెళ్తాను రేపు కచ్చితంగా వెళ్తాను. 
విజయాంబిక: ఏం ఆలోచిస్తున్నావ్ తమ్ముడు.
సూర్యప్రతాప్: రూప జీవితం గురించి ఆలోచిస్తున్నా నీ జీవితంలా నా కూతురి జీవితం అవ్వకూడదని అనుకుంటున్నా.
విజయాంబిక: నాకు అదే అనిపిస్తుంది కానీ రాజు, రూపల జీవితంలో విరూపాక్షి ఎందుకు దూరుతుంది. అసలు రూప ఆ ఇంటికి వెళ్లినా ఆ ముత్యాలు సరిగా చూసుకుంటుందా. నీ మీద కోపం ఆ ముత్యాలు రూప మీద చూపిస్తుందేమో అని భయం వేస్తుంది. అందులోనూ ఈ పెళ్లి తను ఇష్టపడి కావాలను కొని చేస్తుంది దాన్ని నువ్వు ఆపావని నీ మీద కోపం   రూప మీద చూపిస్తుంది. ఆలోచించు అత్తారింట్లోకి పంపి బాధ పెట్టడం కంటే పుట్టింట్లో క్షేమంగా చూసుకోవడం మంచిది. 
సూర్యప్రతాప్: అక్క చెప్పింది కూడా నిజమే కానీ నేను రేపు వెళ్లి ఆపుతాను నా కూతురి జీవితం ఎలా కాపాడుకోవాలో నేను చూసుకుంటా. అది కన్నతండ్రిగా నాకు బాగా తెలుసు.


ఉదయం గుడిలో పెళ్లి కోసం ముత్యాలు అన్నీ సిద్ధం చేయిస్తుంది. రాజు కూడా పెళ్లి కొడుకులా రెడీ అయి కూర్చొంటాడు. అప్పలరాజు వచ్చి కొడుకుతో మాట్లాడుతాడు. ఎందుకు పెళ్లికి సిద్ధమవుతున్నావ్ ఆలోచించురా అమ్మాయి గారి జీవితం అని అంటాడు. పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోతే అమ్మ ఏమైపోతుందో అని అంటాడు. నీ జీవితం నాశనం చేయాలనుకున్న మీ అమ్మని వదిలేసి వెళ్లిపో అని అంటారు. కానీ రాజు మనసు మార్చుకోడు. పెద్దయ్య గారిని నమ్ముతున్నానని ఆయన ఈ పెళ్లి ఆపుతారని నాకు ఆ నమ్మకం ఉందని రాజు అంటాడు. మరోవైపు రూప తండ్రి దగ్గరకు వస్తుంది. మీరు ఏం ఆలోచించినా నా సంతోషం గురించే ఆలోచిస్తారని నాకు తెలుసని అంటుంది.


మీ అక్క మీద ప్రేమతో రాజు తప్పు చేసిందని నన్ను రాజుని తప్పుగా చూశారు. అసలు వీటన్నింటిలో నేను చేసిన తప్పు ఏంటి నాన్న అని అడుగుతుంది. కన్న తల్లిని కూడా నువ్వు మాట్లాడొద్దని అంటే ఇరవై ఏళ్లగా మాట్లాకుండా ఉన్నాను కదా నాన్న అని ఏడుస్తుంది. విజయాంబిక, దీపక్ అక్కడే నిల్చొని మాటల వింటారు. రాజుకి పెళ్లి అయిపోతే నా జీవితం నాశనం అయిపోతుంది నాన్న అని రూప ఏడుస్తుంది. శ్వేత కూడా పెళ్లి కూతురిలా రెడీ అయి వస్తుంది. రాజు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో అనుమానంగా ఉందని ఏదో ప్లాన్ చేసుంటాడని శ్వేత అంటుంది. ఇక జీవన్   మాత్రం ఎలా అయినా ఈ పెళ్లి జరుగుతుందని జీవన్ అంటాడు. గుడి నిండా మనుషుల్ని పెట్టారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: డీఎన్ఏ టెస్ట్‌ కోసం లక్ష్మీ, జున్నులను తీసుకెళ్లిన మనీషా, చూస్తూ ఉండిపోయిన మిత్ర!