Karthika Deepam Idi Nava Vasantham Serial Episode జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుతూ ఉంటారు. బావ వచ్చి తన తల్లి బాధ గురించి మాట్లాడే తప్పు మా పెళ్లి గురించి మాట్లాడలేదు అసలు బావకి నేనంటే ఇష్టమేనా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని జ్యోత్స్న అడుగుతుంది. పారిజాతం గతంలో కార్తీక్ తనకి జ్యోత్స్నని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని విషయం గుర్తు చేసుకుంటుంది.


పారిజాతం: ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి నీకు ఓ విషయం చెప్తా నువ్వు ఏమీ అనుకోవద్దు. తర్వాత నన్ను ఏమీ అనొద్దు. మీ బావ మనసులో నువ్వు లేవు.
జ్యోత్స్న: షాక్లో.. నీకు ఎలా తెలుసు నీతో ఎవరు చెప్పారు.
పారిజాతం: మీ బావ చెప్పాడు. లండన్ నుంచి తిరిగి వచ్చాకే చెప్పాడు. అభిమానం మాత్రం ఉందని చెప్పాడే. జ్యోత్స్నని మరదలి తప్పా ఇంకెలా చూడలేదు అన్నాడు.
జ్యోత్స్న: మరి పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు.
పారిజాతం: ఏదో మ్యాజిక్ జరిగిందే తన తల్లికోసం అయింటుంది.
జ్యోత్స్న: ఇప్పుడు తల్లికే ఇంట్లోకి రావడానికి తాత పర్మిషన్ ఇవ్వలేదు కదా. అయితే తాత కాదు చచ్చిన మీ తాత చెప్పినా సరే బావతోనే నా పెళ్లి అవుతుంది.  బావ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నాకు బావ కావాలి అంతే. ఎవరు కాదన్నా బావతోనే నా పెళ్లి గుర్తు పెట్టుకో.


స్వప్న అత్తారింట్లో పూజకు ఏర్పాట్లు చేస్తుంది. దీప కార్తీక్‌ని తీసుకొస్తా అని చెప్పడంతో ఎదురు చూస్తూ ఉంటుంది. దాసు స్వప్న నువ్వు ఎదురు చూస్తున్న వాళ్లు రారమ్మా అని అంటాడు. దానికి స్వప్న అత్తింటిలో తొలి దీపం పుట్టింటివాళ్ల సమక్షంలో నేను పెట్టాలి అనుకున్నా వాళ్లు వస్తారని నమ్మకం ఉందని అంటుంది. దాసు మాత్రం అమ్మా స్వప్న నీ పుట్టింటి వాళ్లు ఎవరూ రాను నీకు తండ్రి అయినా మామ అయినా నేనే దీపం వెలిగించమ్మా అని అంటాడు. స్వప్న ఏడుస్తుంది. దానికి కాశీ స్వప్న ఈ రోజు మన కోసం ఎవరూ రాకపోయినా ఏదో ఒక రోజు వస్తారని అంటాడు. ఇంతలో కావేరి స్వప్న  అని పిలుస్తుంది. దాంతో స్వప్న ఎమోషనల్‌గా వెళ్లబోతుంది. కానీ తండ్రిని చూసి తల్లిదండ్రుల్ని ఇంటి గుమ్మం ముందే ఆపేస్తుంది. 


స్వప్న: ఆగండమ్మా నువ్వు ఒక్కదానివేరా ఆయనతో కలిసి అయితే నువ్వు కూడా రావొద్దు.
దాసు: తప్పమ్మా నాన్నని పట్టుకొని అలా అనకూడదు. తనేదో కోపంతో అంది బావ నువ్వు రా..
కావేరి: స్వప్న పెద్దవాళ్లు తప్పు చేస్తే వాళ్లే సరిదిద్దుకుంటారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మీ డాడీ విషయం పక్కన పెట్టు నువ్వు అయితే నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నావ్ కదా. నిన్ను అనాథగా వదిలేయకుండా నీ మంచి చెడు చూడటానికి మేం ఉన్నాం అని చెప్పడానికి వచ్చాం.
స్వప్న: నా మంచీ చెడు చూడటానికి నా భర్త మామ ఉన్నారు మమ్మీ. నాకు ఇది కావాలి అని లేదు అని ఏనాడు మీ గుమ్మం తొక్కను.
శ్రీధర్: పెళ్లి అయిపోయింది కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది.
స్వప్న: నాకు జీవితాంతం తోడు ఉంటారు అనుకున్న అందరికీ నేను మీ కారణంగా శత్రువుని అయిపోయాను. ఈ రోజు నేను వాళ్లెవరికీ నా ముఖం చూపించలేని పరిస్థితిలో ఉన్నాను. చుట్టూ ఉన్న వారు నన్ను ఏమనుకుంటారో తెలుసా. మమ్మీ ముందు నేను ఆ మాట అనకూడదు మీరే అర్థం చేసుకోండి.
కావేరి: వంద మంది వంద అనుకుంటారే మీ మామయ్య కూడా ఈ పని చేయలేదా. 
స్వప్న: మా మామయ్య గారు తన కంటే తక్కువ స్థాయి ఉన్న ఆవిడని స్వచ్ఛమైన మనసుతో పెళ్లి చేసుకున్నారు అంతే కానీ ఒకేసారి రెండు పెళ్లిళ్లు చేసుకోలేదు. 
కావేరి: నువ్వు దొంగ చాటుగా మమల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నా సరే నిన్ను ఆశీర్వదించడానికి మేం వస్తే మమల్నే అవమానిస్తున్నావ్ నీ కోసం ఈ గుమ్మం తొక్కి ఎవరూ రారు. 


కావేరి అలా అనగానే కార్తీక్ కారు వచ్చి ఆగుతుంది. కార్తీక్, దీపలు కలిసి కాంచననను తీసుకొని వస్తారు. కార్తీక్ వాళ్లని చూసి శ్రీధర్ వాళ్లు షాక్ అయిపోతారు. మా  చెల్లెమ్మ నా ఇంటికి వచ్చిందా అని దాసు ఎమోషనల్ అవుతాడు. ఇక స్వప్న నా కోసం ఎవరూ రారు అన్నావు కదా వచ్చారు చూడు అని పరుగున వాళ్ల దగ్గరకు వెళ్తుంది. అన్నయ్య అని కార్తీక్‌ని పట్టుకుంటుంది. పెద్దమ్మని కాళ్లు దగ్గర కూర్చొని నన్ను క్షమించమ్మా అని అంటుంది. 


కాంచన: నువ్వేం తప్పు చేశావమ్మా క్షమించడానికి. తప్పు చేసిన వారు వేరే ఉన్నారు (శ్రీధర్‌ని చూస్తూ)
స్వప్న: నాలాంటి దాన్ని చూడటానికి అన్నయ్య రావడమే ఎక్కువ అనుకున్నా కానీ నువ్వు నా కోసం వస్తావని అస్సలు అనుకోలేదు పెద్దమ్మా.
కాంచన: వాడు నిన్ను చెల్లి అనుకున్నాడు అప్పుడు నువ్వు నాకు కూతురే కదా. సంబంధాలు అక్రమం కానీ సంతానం కాదు స్వప్న. నిన్ను కూతురిగా అనుకొని నీ ఇంటికి వచ్చాను ఇక జరిగింది అంతా మర్చిపో. 
కార్తీక్: కొత్త పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకోకూడదు అంట పద లోపలికి వెళ్దాం. నువ్వు చెల్లివి కదా నిన్ను ఎలా వదులు కుంటా చెప్పు.
శ్రీధర్: మనసులో.. వీడికి తండ్రి అక్కర్లేదు కానీ చెల్లి కావాలంట. కాంచనకు మొగుడు వద్దు కానీ సవతి కూతురు కావాలంట. అందరూ బాగానే ఉన్నారు నేను తప్ప. 
స్వప్న: థ్యాంక్స్ దీప నిన్ను ఎవరైనా నమ్ముకుంటే నమ్మకం నిలబెట్టుకుంటావ్. నువ్వు నన్ను పెళ్లి చేసి జీవితాన్ని ఇవ్వడమే కాదు మంచి కుటుంబాన్ని కూడా ఇచ్చావ్.
శ్రీధర్: నా కుటుంబాన్ని బజారుకు లాగింది కూడా ఈ దీపే కదా. ఇంకా ఇక్కడే ఎందుకు పద పోదాం.
కావేరి: వాళ్లనే రమ్మంది మనల్ని రమ్ముంటుంది కాసేపు ఆగండి. 


మొదటి సారి తన ఇంటికి వచ్చినందుకు దాసు, కాశీ కాంచన వాళ్లకి థ్యాంక్స్ చెప్తారు. ఇక కార్తీక్ స్వప్నకి దీపం వెలిగించమని అంటాడు. దీప స్వప్నతో అమ్మానాన్నల్ని లోపలికి పిలు అంటుంది. దాంతో స్వప్న తల్లితో మమ్మీ నువ్వు మాత్రమే లోపలికి రా అని పిలుస్తుంది. కావేరి వెళ్లబోతే శ్రీధర్ ఆపేస్తాడు. దీప చెప్తే కానీ నీ కూతురికి నువ్వు గుర్తు రాలేదు నువ్వు వెళ్తే వాళ్ల ముందు నన్ను చెప్పుతో కొట్టినట్లే  అని శ్రీధర్ అంటాడు. దాసు నాన్నని కూడా పిలవమంటే స్వప్న ఆ మనిషికి ఇంట్లో చోటు లేదని నా కోసం రావాల్సి వారు వచ్చారని ఇంకా ఒక్క మనిషి గడప బయట ఉండిపోయిందని వస్తుందో లేదో తన ఇష్టమని అంటుంది. దాంతో కాంచన ఇక్కడ ఎవరి కోసం ఎవరూ ఆగిపోవాల్సిన అవసరం లేదని రావాల్సిన వాళ్లు రావొచ్చని కాంచన అంటుంది. కానీ శ్రీధర్, కావేరిలు వెళ్లరు.


కావేరిని వెళ్లిపోదాం అని శ్రీధర్ అంటే బయట నుంచి చూద్దాం అని కావేరి ఆపుతుంది. ఇక కాంచన స్వప్నతో దీపం పెట్టిస్తుంది. ఇద్దరినీ కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకోమని దాసు అంటాడు. కాంచన ఇద్దరినీ ఆశీర్వదిస్తే దానికి శ్రీధర్ ఇప్పుడు కన్న తల్లి ఎవరో నువ్వే తేల్చుకో అని కావేరితో అంటాడు. ఇక పుట్టింటి కానుక అని కాంచన స్వప్నకి తాంబూలంతో పాటు డబ్బులు కూడా ఇస్తుంది. ఇక అందరి దగ్గర స్వప్న, కాశీలు ఆశీర్వదిస్తారు. దీపకున్న విలువ కూడా మనకు లేదు పద అని శ్రీధర్ కోపంతో కావేరిని తీసుకెళ్లిపోతాడు. దీప మీ తల్లిదండ్రులు దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోమని అంటే స్వప్న తల్లిని ఆశీర్వదిస్తుంది. తండ్రి ఆశీర్వదిస్తే నా జీవితం నాశనం అయిపోతుందని అంటుంది. ఇప్పటికైనా నువ్వు మాత్రమే ఈ ఇంటికి రావాలని స్వప్న అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: భుజంగమణి మిస్సింగ్.. లలితాదేవే దొంగ అని నిలదీసిన తిలోత్తమ!