Brahmamudi Serial Today Episode: ఎక్స్‌ ఫో బయట నిలబడ్డ కావ్య దగ్గరకు వచ్చిన రాజ్‌ కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. నీకు మాటకు మాట జవాబు చెప్పడమే తెలుసు అనుకున్నాను. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నాను.  కానీ నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థం అయింది కళావతి. అంటూ తిడతాడు.


రాజ్‌: నీ గెలుపును నాకు చూపించడానికి. నా ఓటమికి చూడటానికి నువ్వు ఇక్కడిక వచ్చి కూర్చున్నావు కదా? ఇక  నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని నిరూపించావు.


కావ్య: మీరు చూసింది ఏదీ నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అసలు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వండి.


రాజ్‌: ఏం చెప్తావు. ఇక్కడ ఉన్న నాకు ఏం చేప్తావు. ఇక్కడ లేని వాళ్లకు చెప్పు. నన్ను దెబ్బతీయాలన్న ఆలోచన నీకు కలిగిందంటే మా సంస్థకు ద్రోహం చేయాలని ఇంత చేశావంటే నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవి ని ఇంకా నమ్మే నా కుటుంబ సభ్యులను మర్చిపోయావంటే ఇది నీలోన నాకు కనబడ్డ కొత్త కోణం. శభాష్‌ నువ్వే సక్సెస్‌ అయ్యావు.


కావ్య: కాదు అది నా వ్యక్తిత్వమే కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను కలలో కూడా ఎవరికి ద్రోహం చేయాలనుకోను. నా వ్యక్తగత కోపాన్ని మనసులో పెట్టుకుని ఇలాంటి నీచానికి దిగజారుతానని మీరనుకుంటే నాకేం చెప్పాలో కూడా తెలియడం లేదు.


రుద్రాణి: మా రాజ్ నిన్ను ఎంతలా నమ్మాడు. నీ అంతట నువ్వు వెళ్లిపోయినా నీ కోసం మా రాజ్‌ దిగివచ్చాడు. నిన్ను మళ్లీ కాపురానికి తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడి మనసును ముక్కలు చేశావు. పదేళ్లుగా వస్తున్న  అవార్డు మాకు రాకుండా చేశావు. మీడియా ముందు ఇంటి గుట్టు మొత్తం తీసేశావు.  


రాజ్: నువ్వు నా నమ్మకం మీదే దెబ్బ కొట్టావు. జీవితంలో ఈ గుణపాఠం నేను మర్చిపోలేను. నీ మీద ఏమూలనో ఉన్న ప్రేమ ఈ క్షణంతో చచ్చిపోయింది. ఇంకెప్పుడూ నాకు ఎదురుపడకు.


కావ్య: ఏవండి నేను చెప్పేది వినండి.


రుద్రాణి: విన్నావుగా ఇక వాడు కానీ మా కుటుంబం కానీ నిన్ను జీవితంలో దగ్గరకు రానిచ్చేది లేదు.


కావ్య: మామయ్యగారు..


సుభాష్‌: వద్దమ్మా ఇంకేం చెప్పకు నేను నీతో నా కొడుకులాగో రుద్రాణి లాగో మాట్లాడలేను.


కావ్య: మామయ్యగారు కనీసం నేను చెప్పేది మీరైనా నమ్మండి.


సుభాష్‌: నాకు నమ్మాలనే ఉందమ్మా కానీ దేన్ని నమ్మాలి. నీ చేతిలో ఉన్న ఈ అవార్డునా..? వాళ్ల కోసం గెలిచిన నీ విజయాన్నా..?


కావ్య: మామయ్యగారు నేను ఇలా కావాలని చేశానంటే మీరు కూడా నమ్ముతున్నారా..?   


అని కావ్య అడగ్గానే కళ్లు ముందు ఇదంతా చూశాక నేను ఎలా నమ్మాలి అని అడిగి సుభాష్‌ కూడా వెళ్లిపోతాడు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సామంత్‌, అనామిక వస్తారు.


అనామిక: కంగ్రాచ్యులేషన్‌ కావ్య


కావ్య: దేనికీ మీరు బిగించిన ఉచ్చులో అమాయకంగా చిక్కుకున్నందుకా..?


అనామిక: ఇది ఉచ్చు కాదు  నీ టాంలెంట్‌కు తగిన గుర్తింపు. అజ్ఞాతంలో ఉన్న నీ ప్రతిభను  ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరో కాదు. మా సంస్థే


 కావ్య: నేను నా కళను మీ కంపెనీకి అంకితం చేయలేదు. నా కాళ్ల మీద నిలబడటానికి ఉపయోగపడితే చాలు  అనుకున్నాను.


అనామిక: నువ్వు నీ భర్త ముందు అంతెత్తున్న నిలబడ్డావు.


కావ్య: లేదు పాతాళంలో పడ్డాను. ఇన్నాళ్లు ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నా నేను  నా క్యారెక్టర్‌ ను వదులుకోలేదు. ఇవాళ నాకంటూ ఒక వ్యక్తిత్వం లేనట్టు నువ్వు రుజువు చేశావు.


సామంత్‌: నీ క్యారెక్టర్‌ నీకు ఏమిచ్చింది. ఆ ఇంట్లో నీకు విలువను ఇచ్చిందా..? ఆ కంపెనీలో నీకు గుర్తింపును  ఇచ్చిందా?


కావ్య: అందరూ అనామికలా ఉండరు మిస్టర్‌ సామంత్‌. నేను ఆ ఇంట్లో బంధాలకు విలువ ఇచ్చాను. అనామికలా  పతనం అయిపోవాలని అనుకోలేదు. నా అస్థిత్వం కోసం కాలు బయటపెట్టాను. కాపురం కూల్చుకునే ఆడదానికి, ఆత్మగౌరవం కోసం బయటకు అడుగుపెట్టిన ఆడదానికి తేడా నీకేం తెలుస్తుందిలే..


అనామిక: ఈ నీతి సూత్రాలు  అన్నీ పట్టుకుని వేలాడుతూ నీ చావు నువ్వు చావు. నువ్వు మాతో చేతులు కలపపోయినా సరే నీ అత్తారింటిని నేను భూస్థాపితం చేస్తాను.


కావ్య: నేను ఉండగా ఆ ఇంటి ముందు మొలచిన గడ్డిని కూడా నువ్వు పీకలేవు.


అంటూ ఇద్దరూ సవాల్‌ చేసుకుని వెళ్లిపోతారు. మరోవైపు ఇంటికి వెళ్లిన రాజ్‌, కావ్యను తిడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి, కావ్యను వెనకేసుకోస్తారు. కావ్య కావాలని చేసి ఉండదని చెప్తారు. దీంతో రాజ్‌ కోపంగా తిడుతుంటాడు, రుద్రాణి కూడా కావ్యను తిడుతుంది. దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం