కార్తీకదీపం జనవరి 12 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam January 12th Update)
ఇంద్రుడు చంద్రమ్మ ఇంటికి వస్తారు. వారికి ఎదురెళ్లిన శౌర్య.. ఎక్కడికి వెళ్ళిపోయారు బాబాయ్ సమయానికి మీరు లేరు అనడంతో ఏం జరిగిందమ్మా అని అడగుతారు. అమ్మ నాన్నలు కనిపించారని శౌర్య అనడంతో..ఇంద్రుడు-చంద్రమ్మ ముఖాలు చూసుకుంటారు. అదేంటి మా అమ్మా నాన్న కనిపించారంటే సంతోషించాల్సింది పోయి ఇలా ఉన్నారని శౌర్య అడగడంతో అదేం లేదమ్మా..గతంలో హిమకు కనిపించి మాయమైనట్టే ఈసారి కూడా అలా వెళ్లిపోయారా అని కవర్ చేస్తాడు. ఇంద్రుడు-చంద్రమ్మని శౌర్య..దీప-కార్తీక్ కి పరిచయం చేస్తారు. చంద్రమ్మతో దీప చనువుగా మాట్లాడడంతో సౌందర్య, పిల్లలు అనుమాన పడతారు. నిజం చెప్పు ఇంద్రుడు వీళ్ళు నీకు ముందే తెలుసు కదా అని సౌందర్య నిలదీస్తుంది. తెలియదమ్మా..మొదటిసారి వీళ్లని చూస్తున్నాం అంటారు. ఇంద్రుడు-చంద్రమ్మ వెళ్లిపోతామని చెప్పడంతో..సౌందర్యకి చెప్పి ఇక్కడే ఉండమని అడగమంటుంది శౌర్య.
Also Read: రిషిధార ప్రేమకథకు చిన్న బ్రేక్ - వసుధార నాకు అక్కర్లేదన్న రిషి, ఇకపై నా సొంతం అన్న రాజీవ్
అందరం కలసి ఇక్కడే ఉందాం..ఇక్కడే సంక్రాంతి చేసుకుని హైదరాబాద్ వెళదాం అని శౌర్య అంటే.. ఇంకా ఇక్కడ ఎందుకు హైదరాబాద్ వెళ్లి సంక్రాంతి చేసుకుందాం అని హిమ అంటుంది. పిల్లలిద్దరిపైనా కోప్పడుతుంది సౌందర్య. కొడకు-కోడలు దొరికిన సందర్భంగా ఇక్కడే సంక్రాంతి జరుపుకుందాం అని ఫిక్స్ చేస్తుంది సౌందర్య. భోగిమంటలు వేద్దాం సిద్ధం చేయండి అంటుంది. దీప-కార్తీక్ ఏదో దాస్తున్నారనే విషయం సౌందర్యకి అర్థమవుతుంది. ఆ తర్వాత బయట ముగ్గు వేస్తుంటారు దీప, శౌర్య, హిమ... ఇంతలో అక్కడకు వచ్చిన హేమచంద్ర...దీపమ్మా ఎప్పుడు వచ్చావని అడుగుతాడు. వెంటనే...దీప నాకు తెలుసన్నట్టు నోరుజారాను అనుకుంటూ...హిమ నువ్వు ఫొటో చూపించావు కదమ్మా అని సర్దిచెబుతాడు. ఈ ఏరియాలో మీరు అందరికీ తెలుసు..వీళ్లు మీ ఫొటోలు అంతలా పట్టుకుని తిరిగారంటాడు... పోనీలే ఇప్పటికైనా వచ్చారు రారేమో అనుకున్నాను అనడంతో శౌర్య,హిమ ఆశ్చర్యంగా చూస్తారు. మళ్లీ నోరు జారాను అని హేమచంద్ర తడబడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడే ఉంటే ఏం వాగుతానో ఏమో అనుకుంటూ... దీప ఆరోగ్య పరిస్థితి గురించి ఇంట్లో చెప్పారు లేదో అనుకుంటూ దీపను అడుగుదాం అనుకుని మళ్లీ ఆగిపోయి అక్కడినుంచి వెళ్లిపోతాడు.
Also Read: మళ్లీ మోనిత ముందు తలొంచిన కార్తీక్, సౌందర్య-దీప ఏం చేయబోతున్నారు!
కార్తీక్-మోనిత: మరొకవైపు కార్తీక్ జరిగిన విషయాలు తలచుకుని కార్లో వెళ్తూ ఉండగా ఇంతలోనే మోనిత కారు అడ్డుపెడుతుంది. అడ్డం తప్పుకో అని కార్తీక్ అనడంతో..ఆ కారు పక్కకు ఆపేసి నా కారులో వచ్చి కూర్చో కార్తీక్ ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటుంది. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నా జీవితంలో ఎవరైనా అవసరం లేని వ్యక్తి ఉన్నారు అంటే అది నువ్వే అని అంటాడు కార్తీక్. ప్లీజ్ కార్తీక్ నాతో పాటు రా అలా రెస్టారెంట్లో పది నిమిషాలు కూర్చుని మాట్లాడు అని అంటుంది మోనిత. కుదరదని కార్తీక్ అనడంతో.. దీప పరిస్థితి మీ అమ్మకు చెప్పేస్తానని బెదిరిస్తుంది మోనిత. కార్తీక్ చేసేది లేక మోనితతో వెళతాడు.
దీప-చంద్రమ్మ: కార్తీక్ బాబు ఇచ్చారు ఎవరికీ తెలియకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోండమ్మా అని దీపకు టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తుంది చంద్రమ్మ. అప్పుడు దీప మీ సార్ పిచ్చి కానీ ఈ టాబ్లెట్స్ వేసుకున్న వేసుకోకపోయినా నేను ఎక్కువ రోజులు బతకను అని అంటుంది దీప. నీకు అసలే వేడిపడదు కానీ పొద్దున్నే నుంచి వంట గదిలోనే ఉన్నారు అని అనగా అంటే ఏం కాదులే చంద్రమ్మ పోవాల్సిన దానికంటే నాలుగు రోజులు ముందే పోతాను ఉన్నన్ని రోజులు నా పిల్లలకు సంతోషంగా వండి పెట్టాననే ఆనందం నాకు ఉంటుంది అని అంటుంది దీప. చంద్రమ్మ దీపని పక్కకు తప్పుకోమని చెప్పి వంట చేస్తూ ఉంటుంది.
కార్తీక్-మోనిత: హోటల్ కి వెళతారు మోనిత-కార్తీక్. ఏం తింటావని మోనిత అడిగితే నన్ను కాల్చుకుని తింటున్నావ్ చాలదా అంటాడు. నువ్వు రాలేదని బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చిందన్న మోనిత...ఎందుకు కార్తీక్ అంత చిరాకు పడతావు నాతో ప్రేమగా ఉండమని చెప్పాను కదా అంటుంది. పది నిముషాలు అన్నావని వచ్చాను..ఎక్కువసేపు నీ ముందు కూర్చుని మాట్లాడే ఓపిక నాకు లేదంటాడు. దీప చనిపోయిన తర్వాత కూడా నాకు దక్కవని తెలుసు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటుంది మోనిత.
రేపటి(శుక్రవారం ఎపిసోడ్ లో)
అందరిలాగే నిండు నూరేళ్లు బతకాలని ఉంది ఒక్క అవకాశం ఉందా డాక్టర్ బాబు అని దీప కన్నీళ్లతో అడుగుతుంది.. ఆ సమయంలో కార్తీక్ కి మోనిత అన్నమాటలు గుర్తొస్తాయి..దీప చనిపోదు..నేను చనిపోతాను...నా గుండెని దీపకు మార్పిడి చేయి..అంతకు ముందు నా మెడలో తాళికట్టు అని అడుగుతుంది మోనిత..