సౌందర్య హిమ మీద అరుస్తుంది. అయ్యిందేదో అయిపోయింది పెళ్లి శుభ లేఖలు కూడా ప్రింట్ వేయించాం ఇక మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో అని తిడుతుంది. అది కాదు నానమ్మ శౌర్య నిరుపమ్ బావని కోరుకుంటుంది కదా అని హిమ అంటే నిరుపమ్ కోరుకోవడం లేదు కదా అని సౌందర్య కోపంగా అరుస్తుంది. అయినా శౌర్య ఆనందం కోసం మనం ఈ పెళ్లి చెయ్యాలి నానమ్మా అని హిమ అంటే నోర్ముయ్ అని తిడుతుంది. ఈవెంట్ మేనేజర్‌కి పెళ్లి పనులు ఎలా చెయ్యాలో చెప్తుంటే శౌర్య వింటుంది. చాలా కాలం తర్వాత ఈ ఇంట్లో జరుగుతున్న శుభ కార్యం అంతా తన ఇష్టప్రకారం తన చేతుల మీదగా జరగాలి అని సౌందర్య అంటుంది.


స్వప్న జరిగింది అంతా తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. నా పిల్లలు అసలు నా మాటే వినడం లేదు అని అనుకుంటుంటే శోభ వచ్చి వాళ్ళు పెళ్లి పనులు మొదలు పెట్టారు అని చెప్తుంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అని స్వప్న అంటుంది. సత్యం, ప్రేమ్ వాళ్ళు వచ్చేసరికి శోభ ప్లేట్ ఫిరాయిస్తుంది. ఆంటీ పొద్దుటి నుంచి ఏమి తినలేదు కనీసం కాఫీ అయినా తాగండి అని నటిస్తుంది. నిరుపమ్ మనసు మార్చుకుంటే పెళ్లి ఆగుతుంది కానీ మీరు కడుపు మాడ్చుకుంటే పెళ్లి ఆగుతుందా మీరైనా చెప్పండి అని శోభ తెగ నటించేస్తుంది. నిరుపమ్ హిమని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆంటీ ఏమి తినడం లేదని అంటుంది. నేను బతికుంటే ఏంటి చస్తే ఏంటి అని స్వప్న అంటుంది. మనం అందరం కలిసి ఎలాగైనా నిరుపమ్ మనసు మారుద్దాం నువ్వు ఇలా భోజనం మానేస్తే ఎలా అని ప్రేమ్ నచ్చచెప్పేందుకు చూస్తాడు కానీ స్వప్న వినదు.


సత్యం సౌందర్య ఇంటికి వచ్చి స్వప్న తినడం లేదని చెప్తాడు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేశావని నీకోసం మీ మమ్మీ బెంగ పెట్టుకుంది, నువ్వు వస్తేనే తింటాను అని భీష్మించుకుని కూర్చుంది పదా వెళ్దాం అని నిరుపమ్ తో అంటాడు. మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చాను మళ్ళీ మమ్మీ భోజనం మానేసిందని నన్ను పిలవడం కరెక్ట్ కాదు కదా అని నిరుపమ్ అంటాడు. అన్నం మానేసింది అన్నా కానీ నీ మనసు కరగడం లేదా అని సత్యం బాధపడతాడు. మమ్మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది అది మీకు అర్థం కావడం లేదని నిరుపమ్ అంటాడు. ఆ శోభని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అది నచ్చకే కదా నేను వచ్చింది తనతో ఎలాగైనా నా పెళ్లి చెయ్యాలని మమ్మీ ఇలా చేస్తుందని నిరుపమ్ అంటాడు ఆ మాటలకి సౌందర్య కూడా మీరు ఏమి అనుకోకండి ఇలాంటి పిచ్చి వేషాలు మానేసి బుద్ధిగా ఉండమని చెప్పండి అని సౌందర్య కూడా చెప్తుంది. కరెక్ట్ గా మాట్లాడావ్ నువ్వు ఇలాగే ఉండు మిగతాది నేను చూసుకుంటాను అని సౌందర్య నిరుపమ్ తో అంటుంది.


సత్యం ఇంటికి వచ్చి అన్నం తినమని స్వప్నని బతిమలాడతాడు. శోభ నా కోడలు నిరుపమ్ తో శోభ పెళ్లి ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటుంది. నిరుపమ్ దగ్గరకి హిమ వచ్చి మాట్లాడుతుంది. శౌర్యని పెళ్లి చేసుకోమని మళ్ళీ బతిమలాడుతుంది. కానీ శౌర్య మనసులో నేను లేను ఆశ్రమంలో నేను తనని ప్రేమించడం లేదని చెప్పినప్పుడే తన మనసులో నా మీద ప్రేమ సగం చచ్చిపోయింది తను కిడ్నాప్ అయి గదిలో ఉన్నప్పుడు నేను శౌర్యతో ఒక మాట అన్నాను.. ఆ మాటకి నా మీద ఏ మూలో ఉన్న మిగతా ప్రేమ చచ్చిపోతుందని అంటాడు. అలా అంటే పాపం శౌర్య హర్ట్ అవుతుంది కదా అని హిమ బాధపడుతుంది. శౌర్యకి తను కోరుకున్న జీవితం ఇవ్వొచ్చు కదా బావా అని హిమ అడుగుతుంది. మరి నేను కోరుకున్న జీవితం సంగతి ఏంటి నాకుంది ఒక్క జీవితమే కదా అది నీతో పంచుకోవాలనే కదా నేను కోరుకుంది ఇది క్లియర్ అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


Also Read: తులసి కోసం ఓడిపోయి తనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సామ్రాట్- అది చూసి కుళ్ళుకుంటున్న లాస్య, నందు


ఇక నిరుపమ్ స్వప్న దగ్గరకి వెళ్తున్నట్టు సౌందర్య వాళ్ళకి చెప్తాడు. అక్కడికి వెళ్తే ఘోరాలు జరుగుతాయి వద్దు బావా అని హిమ అంటుంది. శోభ మన ప్రాబ్లం అది ఎలా సాల్వ్ చెయ్యాలో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు వెళ్లాల్సిన పని లేదు నేను వెళ్తానులే అని సౌందర్య నిరుపమ్ ని ఆపేస్తుంది. అదంతా చూసిన్ శౌర్య అందరూ హిమ పెళ్లి కోసం ఎంత ఆరాటపడుతున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఇక్కడ ఉండటం అవసరమా అనుకుంటుంది. సత్యం తింటుంటే శోభ వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఆంటీ అక్కడ తినకుండా కడుపు మాడ్చుకుని కూర్చుంటే మీరు ఇక్కడ తింటున్నారా అని వెటకారంగా మాట్లాడుతుంటే సౌందర్య వచ్చి లాగి పెట్టి శోభ చెంప చెల్లుమనిపిస్తుంది. నా కూతురు ఇంట్లో ఉంటూ నీ పెత్తనం ఏంటే అని శోభని తిడుతుంది. నా ఇంటికి వచ్చి నాకు కాబోయే కోడలిని కోడతా వెంటీ మమ్మీ అని స్వప్న అరుస్తుంది. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను కొడతాను.. ఎవరే నీ కోడలు నువ్వు అనుకుంటే సరిపోతుందా.. నీ కోడలు ఎవరో తెలుసా ఇది నీ కోడలు అని హిమ వాళ్ళ పెళ్లి పత్రిక చూపిస్తుంది. ఈ ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ అయ్యింది మీరు ఫిక్స్ అవ్వండి అని వార్నింగ్ ఇస్తుంది.     


Also Read: రిషిని పరుగులు పెట్టించిన దేవయాని- తన కొడుకిని వదిలేయమని ప్రాధేయపడ్డ జగతి