సాక్షికి ఇంత సడెన్ ధైర్యం ఎలా వచ్చిందని గౌతమ్ మహేంద్రతో అంటాడు. దేవయాని పెద్దమ్మని అంటే ఇంచుమించు రిషిని అన్నట్టే కదా ఆ మాత్రం సాక్షికి తెలియదా అని అనుమానం వ్యక్తం చేస్తాడు. నాకు అదే అర్థం కావడం లేదు మహేంద్ర సాక్షి, దేవయాని అక్కయ్య ఇద్దరు ఒక్కటే కదా వీళ్ళిద్దరూ మన ముందు ఇలా మాట్లాడుకుంటున్నారంటే నాకేదో అనుమానంగా ఉందని జగతి కూడా అంటుంది. రిషి, వసుధార కరెక్ట్ గా ఉన్నారు కదా అది చాలు ఇంకేం భయం అక్కర్లేదనీ మహేంద్ర ధైర్యం చెప్తాడు. వసు, రిషి ఒక్కచోట ఉన్నారని సాక్షి మాటల ద్వారా అర్థం అయ్యింది కదా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ మామూలుగా అయ్యేలాగా చూడు దేవుడా అని మహేంద్ర అంటే తదాస్తు దేవతల్లారా తదాస్తు అనెయ్యండి అని గౌతం అంటాడు. ఆ మాటలకి జగతి నవ్వుతుంది. ఇక రిషి, వసు రైతు దామోదర్ ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.


రిషి: వసుధార నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో కారు రిపేర్ అయినక నేను నిద్రలేపుతాను.


వసు: ఇంత మంచి వాతావరణంలో చలి మంట ముందు కూర్చుని ఆస్వాదించకుండా ఎవరైనా నిద్రపోతారా


రిషి: ప్రతి సందర్భాన్ని మనసులో బంధిస్తావ్ కదా


వసు: నాకు నచ్చినవాన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటాను సర్. (మీరు మాత్రం జ్ఞానపకంగా కాదు ఎప్పటికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. పడే పడే మీ మనసుకి నేను చేసిన గాయం గుర్తుకు వస్తుంది.. నా మనసులో ఉన్నది ఎలా చెప్పాలి మీకు, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు చెప్పేందుకు ధైర్యం సరిపోవడం లేదు అని మనసులో అనుకుంటుంది).


రిషి: వసుధారా నిన్నొక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు.. నేను ఇస్తే తీసుకొని గిఫ్ట్ ని నా కళ్ళ ముందు పగిలిపోయిన గిఫ్ట్ ని తిరిగి నాకు ఇవ్వాలని ఎందుకు అనిపించింది. కాదనుకున్నదానివి నెలకి విసిరి కొట్టినంత పని చేసిన దానివి అసలు ఏమి జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావ్. అంత జరిగినా నార్మల్ గా ఎలా ఉండగలుగుతున్నావ్   


వసు: ఏంటి రిషి సార్ ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు నేను నిజం చెప్పినా మీరు నమ్ముతారని నాకు అనిపించడం లేదని మనసులో అనుకుంటుంది.  


రిషి: నువ్వు ఎందుకు ఎప్పటిలాగా ఉంటున్నావో నీకైనా తెలుసా అంటాడు.


ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం అని వసు అంటుంది. అందరూ మారుతున్నారు కానీ నేనే మారడం లేదేమో.. నా నుంచి నేనే పారిపోవాలని అనిపిస్తుంది అందుకే ఇలా వచ్చానేమో. నువ్వు నా గురించి ఒక్క ముక్కలో భలే చెప్పావ్ నాకు క్లారిటీ లేదని అదే కరెక్ట్ ఏమో అని రిషి చాలా బాధపడతాడు. కారు రెడీ అయిపోయిందని వచ్చి మెకానిక్ కీస్ తెచ్చి ఇస్తాడు. రిషి ఫోన్ చూసుకుని పెద్దమ్మ ఇన్నిసార్లు కాల్ చేశారు ఏంటి అని అనుకుంటాడు. ఫోన్ చేసి ఏమైందని అడుగుతాడు.. ఇక దేవయాని నిన్ను ఆఖరి సారి నిన్ను చూడాలని ఉండి త్వరగా రామ్మా అని ఫోన్ పీతటేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది. దీంతో రిషి కంగారు పడతాడు. అదంతా విని ధరణి ఆశ్చర్యపోతుంది. ధరణిని పిలిచి ఫ్రూట్స్ తెమ్మని చెప్తుంది. ఏంటి ఈవిడ ఇలా చేసిందని ఆలోచిస్తుంది.


జగతి ఫ్రూట్స్ తెచ్చి దేవయనికి ఇస్తుంది. ఏంటి జగతి నువ్వు తీసుకొచ్చావ్ అని అంటుంది దేవయాని. మీరు పెద్దవారు తెస్తే తప్పేముందు అక్కయ్య అని అంటుంది. నా కొడుకు ఆనందం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధం, మీకు ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించండి నా కొడుకు జీవితంతో ఆడుకోకండి మీకు దణ్ణం పెడతాను అని జగతి దేవయానిని ప్రాదేయపడుతుంది. ఓహో ఒడిపోయాను అని చేతులెత్తేశావా జగతి ఇప్పుడు రిషి వస్తాడు నేను ఏది చెప్తే అదే చేస్తాడు, రిషి నా ఆయుధం.. సాక్షితో ఎలాగైనా రిషి పెళ్లి చేస్తాను అని హెచ్చరిస్తుంది. రిషి నేను చెప్పినట్టే వింటాడు ఈ ఇంటికి వచ్చే కోడలు కూడా నేను చెప్పినట్టే వినాలి ఆ కోడలు సాక్షినే.. నీ సెలెక్షన్ లో వచ్చే కోడలు నా చెప్పు చేతల్లో ఉండదు కదా అని దేవయాని అంటుంది.


Also Read: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి


రిషి కంగారుగా ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని అందరూ అడిగినా పట్టించుకోకుండా పెద్దమ్మ ఎక్కడ ఉంది అని తన గదిలోకి వెళతాడు. రిషి రాగానే బాధగా ఏడుస్తూ నటిస్తుంది. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అని అనుకున్నాను తెలుసా అని ఏడుస్తుంది. నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తుంది. రిషి ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు.   


Also Read: తులసి కోసం ఓడిపోయి తనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సామ్రాట్- అది చూసి కుళ్ళుకుంటున్న లాస్య, నందు