క‌థానాయ‌కుడిగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఎంత పేరుందో... మాన‌వ‌తావాదిగా అంత‌కంటే ఎక్కువ పేరుంది. వెండితెర‌పై త‌న న‌ట‌న‌తో ఎంతోమందిని ఆక‌ట్టుకున్న ఆయ‌న‌... నిజ జీవితంలో సేవా కార్య‌క్ర‌మాల‌తో అంత కంటే ఎక్కువ‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. నిజ జీవితంలో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎంతోమంది గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు. సామాన్య ప్ర‌జ‌ల్లో మాత్ర‌మే కాదు... రాజ‌కీయ, సినీ, సామాజిక ప్ర‌ముఖుల్లోనూ పునీత్ రాజ్‌కుమార్‌కు అభిమానులు ఉన్నారు. పునీత్ అకాల మ‌ర‌ణంతో వారంతా శోక‌సంద్రంలో మునిగారు. ముఖ్యంగా... పునీత్ సోద‌రుడు, క‌థానాయ‌కుడు శివ రాజ్‌కుమార్‌! కన్నీటితో క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. పునీత్ అంతిమ‌యాత్ర జ‌రిగిన బెంగ‌ళూరు రోడ్లు, క‌న్న‌డ కంఠీర‌వ స్టేడియం ప్రాంతాలు క‌న్నీటి సంద్ర‌మ‌య్యాయి.


పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు స‌హా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ బొమ్మై, డీకే శివ‌కుమార్, ఇంకా ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు, అభిమానులు అంతిమయాత్ర‌లో పాల్గొన్నారు. అంతిమ యాత్ర ప్రారంభం కావ‌డానికి ముందు... పునీత్‌ను సీయం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ముద్దాడారు. దివంగ‌త న‌టుడిపై త‌న‌కున్న ప్రేమ‌ను ఆ విధంగా చాటుకున్నారు. 


Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...


తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల పక్కనే పునీత్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేనందున పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న కొడుకు విన‌య్ రాజ్‌కుమార్ చేశారు. అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి అంతిమ యాత్ర నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ అంతిమ యాత్ర సాగింది. ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలుకాగా.. 16 కిలోమీటర్ల మేర జరిగింది. ఆ సమయంలోనూ పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు తరలివచ్చారు. వేల మంది అభిమానుల మధ్య పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. నటుడు రవిచంద్రన్, సుదీప్, యష్, నటుడు రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, నటి, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు పలువురు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?


Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి


Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!


Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి