న్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా 'కాంతార'. ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడలో సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ భారీ హిట్ అందుకోవడంతో ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేశారు. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమాను త్వరలో ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని అనౌన్స్ చేసినా ప్రేక్షకులు థియేటర్ లో చూడటానికే ఇష్టపడుతున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు ఓవరాల్ గా రూ.400 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. 


'కాంతార' సినిమా ను ఈ నెల 24 న ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే అంతకంటే ముందే సినిమా 400 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. నిజానికి 'కాంతార' లాంటి సినిమాలు థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అందుకే సినిమా వచ్చి 50 రోజులు గడుస్తున్నా ఇంకా థియేటర్ లో చూసేవాళ్ళు సంఖ్య తగ్గలేదు. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. 



400 కోట్లు వసూళ్లు:


⦿ 'కాంతార' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించినట్టు సమాచారం.


⦿ కర్ణాటకలో ఈ సినిమా రూ.168.50 కోట్లు.


⦿ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.60 కోట్లు.


⦿ తమిళనాడులో రూ.12.70 కోట్లు.


⦿ కేరళలో రూ.19.20 కోట్లు.


⦿ ఓవర్సీస్ రూ.44.50 కోట్లు.


⦿ నార్త్ ఇండియాలో  రూ.96 కోట్లు.


కంటెంట్ ఉంటే కలెక్షన్స్ గ్యారెంటీ :


'కాంతార' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ లో సైలెంట్ గా విడుదల అయ్యింది. అక్కడ అభిమానులకి ఈ సినిమా విపరీతంగా నచ్చేయడంతో భారీ హిట్ అందుకుంది. అయితే సినిమా మొత్తం కన్నడ నేపథ్యం స్పష్టంగా కనబడుతుంది. అందుకే అక్కడ హిట్ సాధించింది. అయితే ఒక్క కన్నడలోనే కాకుండా విడుదల అయిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకొని చరిత్ర సృష్టించింది. కన్నడ తర్వాత హిందీలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. సినిమా ఎక్కడైనా సినిమానే, కంటెంట్ ఉంటే ఏ భాషలో అయినా కలెక్షన్స్ వస్తాయి అని మరోసారి నిరూపించింది 'కాంతార' మూవీ. 


'కాంతార' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సీక్వెల్ పై అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ మధ్య భారీ హిట్ అందుకున్న సౌత్ ఇండియన్ సినిమాలు సీక్వెల్స్ కు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కాంతార' సినిమా కు కూడా సీక్వెల్ ఉంటుందనే అనుకుంటున్నారు. అయితే దీనిపై ప్రస్తుతానికి మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక 'కాంతార' సినిమా  ఈ నెల 24 న ఓటీటీ లో విడుదల అవుతోంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.



Also Read: అవన్నీ ఫేక్ వార్తలు, వాళ్ళని ఊరికే వదలకూడదు: హీరో శ్రీకాంత్