బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. తనకు నచ్చని విషయాలను ముఖం మీదే చెప్పేస్తుంది. ఇక తన గురించి నెగెటివ్ ప్రచారం చేస్తే చీల్చి చెండాడుతుంది. తాజాగా తన గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ రణబీర్ కపూర్-అలియా భట్ పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ నిప్పులు చెరిగింది. వారిది ఓ నకిలీ పెళ్లి అని, దాని నుంచి బయటపడేందుకు రణబీర్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చింది.  


మీరు ఎన్ని ప్రచారాలు చేసినా నన్నేం చేయలేరు!


కంగనా రనౌత్, విజయ్ సేతుపతితో చేయబోయే ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వర్గం ట్రోలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో కంగనా ఆలియా దంపతులపై తీవ్ర ఆరోపణలు చేసింది.  తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన నెగెటివ్  కవరేజ్ కు సంబంధించిన వార్తల స్క్రీన్‌ షాట్‌లను షేర్ చేసింది. ’’నేను ఎప్పుడు ఏ కొత్త సినిమా ప్రకటించినా, భయంకరమైన నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి అసహ్యకరమైన బల్క్ మాస్ మెయిల్‌లు విపరీతంగా ప్రచారం పొందుతాయి. అన్ని పేపర్లలో ఒకే హెడ్‌లైన్ ఎలా ఉంటుంది? దీనిని బల్క్ మాస్ మెయిల్ అంటారు. ప్రియమైన చాంగు మంగు, నన్నుబాధపెడుతున్న నీకు ఆ భగవంతుడు శాంతిని అందించాలని కోరుతున్నాను. గ్యాంగ్ చాంగు మంగుకి నేను ఒక్కటే చెప్పగలను, మీరు ఎన్ని ప్రచారాలు చేసినా నన్ను ఏం చేయలేరు” అని వెల్లడించింది. 


ఫేక్ పెళ్లి నుంచి బయట పడాలి అనుకుంటున్నాడు!


ఇటీవల తన పుట్టిన రోజు వేడుకల కోసం రణబీర్ కపూర్ లండన్ కు వెళ్లాడు. ఆయనతో పాటు తన తల్లి నీతూ కపూర్ తో  ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే, తన భార్య ఆలియా, కూతురు రాహా మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని బేస్ చేసుకుని వారి పెళ్లిపైనా పలు పలు విమర్శలు చేసింది కంగనా. “ఇటీవలి ఫ్యామిలీ ట్రిప్ నుంచి భార్య, కుమార్తె ఎందుకు దూరమయ్యారు? భర్త అని పిలవబడే వ్యక్తి నన్ను వేడుకుంటూ మెసేజ్‌లు ఎందుకు పంపుతున్నాడు? అతడిని కలవమని ఎందుకు వేడుకున్నాడు? ఇది వాస్తవమో కాదు చెప్పాలి” అని కంగనా డిమాండ్ చేసింది. “సినిమా ప్రమోషన్‌లు/డబ్బులు/పని కోసం పెళ్లి చేసుకుంటే ఇలా జరుగుతుంది, ప్రేమ కోసం చేసుకుంటే ఇలా జరగదు. మాఫియా డాడీ ఒత్తిడితో పెళ్లి చేసుకున్న ఈ నటుడు, ఇప్పుడు ఆ నకిలీ పెళ్లి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.  కానీ, పాపం ఇప్పుడు అతడిని బయకు తీసుకువచ్చేవారు ఎవరు లేరు. అతడు తన భార్య, కూతురు మీద దృష్టి పెట్టాలి. ఇది భారతదేశం ఒక్కసారి పెళ్లి అయితే అంతే!” అని చెప్పుకొచ్చింది.


వరుస ప్రాజెక్టులతో కంగనా బిజీ బిజీ  


ఇక కంగనా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న 'తేజస్' మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగనా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎమర్జెన్సీ'ని విడుదలకు సిద్ధం చేస్తోంది. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. అటు 'చంద్రముఖి 2', నోటి బినోదిని బయోపిక్ కూడా చేస్తోంది.


Read Also: నేనేమీ ప్రెగ్నెంట్ కాదు, పెళ్లి చేసుకోడానికి - ఆ హీరోయిన్‌ పెళ్లిపై తాప్సీ సెటైర్?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial