Kalyan Ram comments effect on devil collections: నందమూరి హీరోలకు, వాళ్ళ సినిమాలకు ఫ్యామిలీ ఫ్యాన్ బేస్, తెలుగు దేశం పార్టీ అభిమానుల మద్దతు చాలా బలంగా ఉంటుంది. సినిమా టాక్ విడుదలైన తర్వాత తెలుస్తుంది. మొదటి షో పడిన తర్వాత, రివ్యూలు వచ్చాక మ్యాట్నీ, ఈవెనింగ్, సెకండ్ షోలకు జనాలు రావడం మొదలు పెడతారు. అయితే... మార్నింగ్ షోను భుజాన వేసుకుని చూసేది అభిమానులే. 


నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాకు ఆ అభిమానుల మద్దతు కరువైందా? తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఈ సినిమాను లైట్ తీసుకున్నాయా? అని డౌట్ కలుగుతుంది. అందుకు కారణం సినిమా విడుదలకు ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాజకీయాలపై ఎదురైన ఓ ప్రశ్న కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానమే.


ఆంధ్రాలో 2024లో జరగబోయే ఎన్నికల్లో మీ స్టాండ్ ఎటువైపు అని ప్రశ్నించగా... తాతయ్య నందమూరి తారక రామారావు స్థాపించిన ''తెలుగు దేశం పార్టీకి'' అని స్పష్టంగా కళ్యాణ్ రామ్ జవాబు ఇవ్వలేదు. కుటుంబమంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, అది తీసుకున్నప్పుడు తెలియజేస్తానని చెప్పారు. హరికృష్ణ, ఆయన పెద్ద కుమారుడు జానకి రామ్ మరణించారు. కుటుంబం అంటే కళ్యాణ్ రామ్, ఆయన సోదరుడు జానియర్ ఎన్టీఆర్ మాత్రమే. 


నందమూరి కుటుంబం అంటే బాబాయ్ బాలకృష్ణతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి మినహా మిగతా కుటుంబమంతా టీడీపీతో ఉంది. కళ్యాణ్ రామ్ మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం నందమూరి అభిమానులలో చాలా మందితో పాటు టీడీపీ శ్రేణులకు నచ్చలేదని, దాంతో వాళ్ళు 'డెవిల్' సినిమా వైపు చూడలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.
 
'బింబిసార'తో గత ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆ సినిమాకు మొదటి రోజు సుమారు 10 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఆ హిట్ తర్వాత 'అమిగోస్'తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా మీద ముందు నుంచి అంచనాలు లేవు. అయినా సరే మొదటి రోజు రూ. 3 కోట్లు కలెక్ట్ చేసిందంటే కారణం నందమూరి, టీడీపీ అభిమానులే!


Also Read: మానసా చౌదరి రొమాన్స్ మామూలుగా లేదుగా, ఒక్క పాటలో 14 లిప్ కిస్‌లు!


ఇప్పుడు 'డెవిల్' సినిమాతో కళ్యాణ్ రామ్ థియేటర్లలోకి వచ్చారు. దీని మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ, థియేటర్లలో జనాలు మాత్రం లేరు. 'డెవిల్'కు మొదటి రోజు అటు ఇటుగా రూ. 2 కోట్లు వచ్చాయని టాక్. పొలిటికల్ స్టాండ్ విషయంలో కళ్యాణ్ రామ్ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం అందుకు కారణమని రాజకీయ, సినిమా విశ్లేషకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.


Also Readడెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?



'డెవిల్' విడుదలైన కొన్ని గంటలకు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అందులో 'డెవిల్ 2' చేస్తామని కళ్యాణ్ రామ్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడంతో సీక్వెల్ చేయడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు.