Guppedantha Manasu December 30th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 30 ఎపిసోడ్)


వసుధారని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రౌడీలు..రిషిని దాచి ఉంచిన ఇంటి దగ్గరకు వెళతారు. బయటకు రాకపోతే వసుధారని చంపేస్తామని బెదిరిస్తారు. రిషిని బయటకు వెళ్లొద్దని ఆ వృద్ధ దంపతులు బతిమలాడుతారు. వసు పీకకోస్తాడు రౌడీ.....వసుధారా అంటూ గట్టిగా అరుస్తాడు రిషి..( ఇదంతా రిషి కల). ఆ పక్కనే ఉన్న వృద్ధ దంపతులు నీ వాళ్లు గుర్తొచ్చారా, అక్కడకు వెళ్లాలని ఉందా, కానీ కొన్ని దినాలు ఓపిక పట్టాలని చెబుతారు. లేదు నేను ఇప్పుడే వెళ్లాలి అంటాడు రిషి. ఇప్పుడు అడుగు బయటపెట్టలేవు బిడ్డా , నిన్ను వెతుక్కుంటూ రౌడీలు కూడా వచ్చారు , జాగ్రత్తగా ఉండు బిడ్డా..తొందర్లోనే నీ వాళ్లు అందర్నీ కలుస్తావని ధైర్యం చెబుతారు. రిషి కామ్ గా ఉండిపోతాడు. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రిషి ఉన్న ఇంటిని కనిపెట్టిన రౌడీలు - వసుధారను కిడ్నాప్ చేసిన భద్ర


మరోవైవు భద్ర...మత్తు మందుఇచ్చి ఎవర్నో భుజం మీద మోసుకెళుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లోంచి వసుధార వాయిస్ వినిపించడంతో కంగారుగా ఇల్లంతా వెతుకుంటూ ఉంటుంది. వసుధార వాయిస్ లోపల నుంచి విన్న భద్ర...అది వసుధార వాయిస్ మరి నేను ఎవర్ని తీసుకొచ్చాను అనుకుంటాడు. అనుపమని చూసి షాక్ అవుతాడు. ఇంతలో మహేంద్ర, వసుధార మాటలు వినిపించి...భద్ర ఇంటిబయట అనుపమను పడుకోబెట్టేసి అరేయ్ ఎవర్రా మీరు అని డ్రామా స్టార్ట్ చేస్తాడు. 
భద్ర: నేను నిద్రలో ఉండగా గేటు చప్పుడైంది..ఎవరో మేడంని ఎత్తుకుపోతున్నాడు..నేను పరుగుల వచ్చి మేడంగారిని లాగేశాను..ఆమే స్పృహలో లేరు..వాడిని పట్టుకుందామని వాడి వెంటే వెళ్లాను కానీ దొరకలేదు. సమయానికి ఇంట్లో కరెంట్ కూడా లేదు నేను వాడి మొహం కూడా చూడలేదు.
మహేంద్ర: అందరకీ కరెంట్ ఉంది కదా..
భద్ర: ఇది కచ్చితంగా వాడి పనే అయి ఉంటుంది..మీరు మేడంని లోపలకు తీసుకెళ్లండి నేను మెయిన్ ఆన్ చేసి వస్తాను...
మహేంద్ర, వసు..అనుపమని లోపలకు తీసుకెళ్తారు..మొహంపై నీళ్లు కొట్టడంతో లేచిన అనుపమ..నాకు ఏమైందని అడుగుతుంది. నిన్ను ఎవరో కిడ్నాప్ చేయబోయారన్న మహేంద్ర మాటలు విని షాక్ అవుతుంది అనుపమ. భద్ర కాపాడాడు అని చెబుతారు. సమయానికి భద్ర ఉన్నాడు కాబట్టి సరిపోయింది అనుకుంటారు. అయినా నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు, ఆ అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తుంది అనుపమ. వాడిని పట్టుకుందామని ట్రై చేసినా వాడు మిస్సైపోయాడని చెబుతాడు భద్ర. వాడు వచ్చింది నాకోసం కాదు...వసుధార కోసం అని క్లారిటీ ఇస్తుంది అనుపమ. నేనే వసుధార అనుకుని తీసుకెళ్లాడని చెబుతుంది. 
భద్ర: మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియని శత్రువులు చాలామంది ఉన్నారు..
మహేంద్ర: నీకు ఎవరిపై అయినా అనుమానం వస్తే చెప్పు కానీ సైలెంట్ గా ఉండొద్దు. మేడంకి అడుగడుగునా ఆపద పొంచిఉంది..నువ్వే ఆఆపద నుంచి బయటపడేయాలి...
భద్ర: అది నా డ్యూటీ..నన్ను దాటి మేడం దగ్గరకు ఏ ఆపదా రానివ్వను. మీరు వెళ్లి పడుకోండి అంటాడు...( నీ అదృష్టం బావుండి తప్పించుకున్నావ్ వీలైనంత తొందర్లోనే నా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాను అనుకుంటాడు భద్ర)


Also Read:  శైలేంద్ర ఎండీ సీట్ కి చెక్ పెట్టేసిన వసు, సమాచారం అందించే ఆలోచనలో రిషి!


అక్కడ శైలంద్ర నిద్రలేచి ఆలోచిస్తుంటాడు..వాడు ఏవేవే చెప్పాడు కానీ చేస్తాడో లేదో అని డౌట్ పడతాడు. అసలు పనైందో లేదో టెన్షన్ పెరిగిపోతోంది, గుండెలు అదిరిపోతున్నాయ్ వీడింకా కాల్ చేయలేదు అనుకుంటాడు..ఇంతలో కాల్ వస్తుంది. ఫోన్ తీసుకుని శైలేంద్ర బయటకు వెళ్లిపోతాడు...ధరణి నిద్రలేస్తుంది కానీ నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ( ఈయనకింకా బుద్ధి రాలేదు..రోజులు దగ్గరపడ్డాయ్ అనుకుంటుంది. 
శైలేంద్ర: ఎక్కడున్నావ్ ఎంతసేపు వెయిట్ చేయాలని అడుగుతాడు... ఫైర్ అయిపోతుంటాడు శైలేంద్ర
భద్ర: ఇంకా పని అవలేదు.. పెద్ద పొరపాటు జరిగిందంటూ...వసు బదులు అనుపమని తీసుకెళ్లిన విషయం చెబుతాడు..
శైలేంద్ర: చీకట్లో కనిపించకపోతే పర్సనాలిటీ అర్థం కాలేదా అని మండిపడతాడు
భద్ర: ఇది ఓ రకంగా మన మంచికే జరిగింది..శైలేంద్ర ఆవేశం చూసి... నేను తప్పుకుంటాను అయితే అంటాడు. ఆవేశ పడితే ప్రయోజనం ఉండదని క్లారిటీ ఇస్తాడు. వాళ్లకి నాపై నమ్మకం పెరిగింది..నేనే అనుపమని కాపాడాను అనుకుంటున్నారు..
శైలేంద్ర: నువ్వు చేయాల్సిన పని తొందరగా చేయి
భద్ర: ఈ మనిషి ప్రవర్తనే బాలేదు.అయినా నాకు బేరం ముఖ్యం అనుకుంటాడు..
రూమ్ లోపలకి విసురుగా వెళ్లి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతాడు శైలేంద్ర... ధరణి నిద్రపోయిందా, నటిస్తోందా అని నాలుగైదు సార్లు పిలుస్తాడు.  ధరణి మాత్రం నిద్రలేవదు...హమ్మయ్య తను నిద్రపోయింది నేను మాట్లాడింది వినలేదు అనుకుని పడుకుంటాడు. 
మీలాంటి మూర్ఖులు ఈ భూమ్మీద ఉండకూడదు అనుకుంటుంది ధరణి...


Also Read: మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయం, డిసెంబరు 30 రాశిఫలాలు
అక్కడ రిషి ట్రీట్మెంట్ జరుగుతుంది. వసుధారని తలుచుకుంటూనే ఉంటాడు రిషి. నా శరీరేం సహకరించలేదు కానీ నిన్ను , డాడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తోంది. నేను ఎంతో కాలం ఇక్కడే పడి ఉండలేను వస్తున్నా వసుధార అని లేచేందుకు ట్రై చేస్తాడు. కానీ లేవలేకపోతాడు. ఫోన్ కావాలని అడుగుతాడు. నంబర్ చెప్పు నేను వెళ్లి మాట్లాడి వస్తానని ఆ వృద్ధుడు అంటే.. నువ్వెళ్లి పోన్ తీసుకురా అని మరొకరు చెబుతారు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో ఫోన్ తీసుకొస్తానని వెళతాడు. నీ భార్య కోసం ఎంతో తపనపడుతున్నావ్ ఆమె చాలా అదృష్టవంతురాలు అని పొడుగుతుంది ఆ వృద్ధురాలు. కాదు పెద్దమ్మా తను నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని వసుధారని తలుచుకుని బాధపడతాడు...