Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: భోజనం టేబుల్ దగ్గర కూర్చొని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు ఉంటారు. కానీ మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భాగమతి, అరుంధతి ఇద్దరు అక్కచెల్లెళ్ళు అవ్వటమేంటి, అక్క పిల్లలు అని తెలియకపోయినా మిస్సమ్మ ఇక్కడికి రావడం ఏమిటి అని కోపంతో ఊగిపోతుంది.


నీల: తర్వాత తన గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకున్న మనోహరి దగ్గరికి నీల వచ్చి మీతో మాట్లాడాలి అంటుంది.


మనోహరి : ఇప్పుడు కాదు రేపు పొద్దున్న మాట్లాడుకుందాం ఈ రోజు నాకు బాగా అలసటగా ఉంది అంటుంది.


నీల: ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో ఇంట్లో ఆత్మ ఉంది అని గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మనోహరి.


మనోహరి : ఏం మాట్లాడుతున్నావ్ అని కంగారుగా అడుగుతుంది.


నీల: నిజమేనమ్మ ఇంట్లో ఆత్మ ఉంది అంటుంది.


మనోహరి: పొద్దున ఘోర కూడా అదే చెప్పాడు అయినా ఎందుకో నమ్మాలి అనిపించలేదు అయినా నువ్వు ఆత్మను చూసావా.. ఉంది అని అంత గట్టిగా ఎలా చెప్తున్నావ్ అని అడుగుతుంది.


నీల : ఆత్మతో మిస్సమ్మ మాట్లాడటం నేను చూశాను మిస్సమ్మ ఆ ఆత్మ ని నాకు పరిచయం కూడా చేసింది. ఏం చెప్పాలో తెలియక కనిపించినట్లుగా నటించి వచ్చేసాను అని చెప్తుంది.


మనోహరి : నాకు చాలాసార్లు ఆ వైబ్రేషన్ తెలిసింది కానీ ఈ రోజుల్లో ఇంకా ఇవన్నీ ఏమిటి అని లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు అరుంధతి ఇంట్లోనే ఉంది అని టెన్షన్ పడిపోతూ చెమటలు కక్కుకుంటుంది.


నీల : ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ.


మనోహరి : నాకేమీ బుర్ర పనిచేయటం లేదు అని తల పట్టుకుంటుంది. నిజంగానే ఆత్మ ఇక్కడే ఉందంటావా అని మళ్లీ అనుమానంగా అడుగుతుంది.


నీల : ఉందమ్మా..ఇప్పుడు మన పక్కనే ఉండి మన మాటలు కూడా వినొచ్చు అనడంతో మరింత భయపడిపోతుంది మనోహరి.


అయితే నిజంగానే అరుంధతి అక్కడ ఉండి వాళ్ళ మాటలు వింటుంది.


అరుంధతి: కంగారుగా చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్లి నీల మనోహరి కి నిజం చెప్పేసింది ఇప్పుడు తను ఆత్మ ఉంది అని నమ్ముతుంది ఇప్పుడు ఏం చేయటం అని కంగారుగా అడుగుతుంది.


చిత్రగుప్తుడు : చేయటానికి ఏమీ లేదు మనం ఈ లోకం విడిచి వెళ్లిపోవాలి, కూటములన్నీ బలపడుతున్నాయి మనం ఎంత త్వరగా వెళితే అంత మంచిది లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న దానివి అవుతావు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల సంతోషం కంటే దుఃఖమే ఎక్కువ ఇంట్లో ఇప్పుడు ఉన్న నవ్వులు అప్పుడు ఉండవు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


అరుంధతి: గుప్తా గారు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పోవడానికి అలా చెప్తున్నారు అని లైట్ తీసుకుంటుంది.


ఆరోజు రాత్రి నీల అందరూ పడుకున్నది లేనిది చూసి మనోహరికి చెప్తుంది. మనోహరి నీలతో కలిసి చడిచప్పుడు లేకుండా పిల్లల గదికి వెళుతుంది.


నీల : ఇప్పుడు ఎందుకమ్మా ఈ ప్రయోగాలు నేను, ఘోర ఇద్దరం చెప్తున్నాం కదా ఆత్మ ఉందని అంటుంది.


మనోహరి: నేను కూడా తెలుసుకోవాలి ఒకవేళ అరుంధతి ఉంటే కచ్చితంగా పిల్లలు గదిలోనే ఉంటుంది ఈసారి నాకు ఆ వైబ్రేషన్స్ తెలిస్తే కనుక రేపటి నుంచి దానికి మామూలుగా ఉండదు అని నీలకి చెప్పి పిల్లల గదిలోకి ప్రవేశిస్తుంది.


 ఆ అలికిడికి పడుకున్న అరుంధతి నిద్రలేస్తుంది ఈ గదిలో ఇక్కడికి వచ్చావ్ ఏంటి అని అంటుంది. అదే పనిగా నించుని చూస్తున్న మనోహరితో ఇందాక అది అన్నమాటలు పట్టించుకున్నావా అని అడుగుతుంది. కానీ ఆమె మాటలు మనోహరికి వినిపించవు.


మనోహరి పిల్లో తీసి అంజు మొహం మీద పెట్టటానికి ప్రయత్నిస్తుంది. కోపంతో రెచ్చిపోతుంది అరుంధతి. నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను అంటూ ఆవేశపడుతుంది. ఆ వైబ్రేషన్ మనోహరీ ఫీల్ అవుతుంది.


మనోహరి: అంజు..పిల్లో తీసి నీ తలకింద పెడదాం అనుకున్నాను కానీ ఏదో అడ్డుపడినట్లుగా ఉంది ఏంటది అని అమాయకంగా అంటుంది.


అరుంధతి: నువ్వు అందుకు వచ్చావా సారీ ఏమీ అనుకోకు అని మనోహరికి సారీ చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


మనోహరి అంజు తల కింద పిల్లో పెడుతుంది.