Naga Panchami Serial Today Episode 


మోక్ష పంచమితో గొడవ పడి హాల్‌లోకి వచ్చి కూర్చొంటాడు. వాళ్లిద్దరి గొడవని మోక్ష తల్లిదండ్రులు చూసేస్తారు. ఏమైందా అని బాధపడతారు. ఇక వైదేహి వాళ్లతో మాట్లాడుతా అంటుంది. ఇక మరోవైపు మేఘన కూడా ఆ గొడవ చూస్తుంది. తర్వాత మేఘన మోక్ష ఒంటరిగా కూర్చొని ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడుతుంది. 


మేఘన: మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు ఏం అనుకోకండి. భార్యాభర్తులు అన్న తర్వాత మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కానీ అవి లోకం దృష్టికి తెలీకూడదు. పంచమి చాలా మంచిది. 
మోక్ష: అది నాకు తెలుసు కానీ మా మధ్య సమస్య మంచితనం గురించి కాదు. ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన..
మేఘన: మనసులో.. ఆ విషయం నాకు తెలుసు మోక్ష. మీరిద్దరూ కలవలేకపోతున్నారు. త్వరలోనే నువ్వు నా వశం కాబోతున్నావు. అంత వరకు నువ్వు పవిత్రంగా పుణ్య బ్రహ్మచారిగానే ఉండిపోవాలి. 


నాగదేవత: భూలోకంలో ప్రత్యక్షమై.. నీ కార్యచరణ ఎంతవరకు వచ్చింది యువరాజా..
ఫణేంద్ర: త్వరలోనే శుభవార్త చెప్తాను మాతా. ముక్కోటి ఏకాదశిలోనే కార్యం పూర్తి చేసుకొని వస్తాను మాతా.
నాగదేవత: ఆ గడువు నువ్వు మోక్షని కాటేయడానికి.. ఇక యువరాణిని తీసుకురాలేవని అర్థమవుతోంది.  
ఫణేంద్ర: అలాంటిదేం లేదు మాతా. నా పట్టుదలను అనుమానించాల్సిన అవసరం లేదు. యువరాణి నాగలోకానికి వచ్చి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తను ప్రాణంగా ప్రేమించిన మోక్ష యువరాణిపై చేయిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి  ప్రేమ స్థానంలో కోపం పెరిగింది. ఒకరి మీద ఒకరు రోషంతో రగిలిపోతున్నారు.
నాగదేవత: నువ్వు చెప్పేవన్నీ మంచి పరిణామాలే యువరాజా. పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. మళ్లీ వాళ్ల మధ్య సఖ్యత కుదరక ముందే యువరాణి నాగలోకానికి రావడానికి ఒప్పించు యువరాజా. యువరాణి మానవ రూపంలోనే ఉంది కాబట్టి క్షణికావేశం చప్పున చల్లారిపోతుంది. తనలో మన నాగజాతి పగను రగిలించు. అప్పుడే మోక్షను కాటేయడానికి సిద్ధపడుతుంది. రాణి పీఠం మీద మరొకరు కూర్చొనే అవకాశం లేదు కాబట్టి చాలా విషయాల్లో మనం రాజీ పడాల్సి వస్తోంది. అది అర్థం చేసుకుని నీకు అప్పగించిన కార్యం సఫలం చేసుకుని త్వరగా వచ్చేయ్‌ యువరాజా!


మరోవైపు పంచమి తన గదిలో కూర్చొని మోక్ష మాటలను తలచుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పాము రూపంలో ఫణేంద్ర వస్తాడు. 


ఫణేంద్ర: ఇదంతా మీ స్వయం కృతాపరాధం యువరాణి. నాగలోకంలో ఒక యువరాణిగా నువ్వెలా ఉండాల్సినదానివి. ఒకరుతో దెబ్బలు తినాల్సిన అవసరం నీకు లేదు యువరాణి. ఇప్పుడే మోక్షను కాటేసి చంపేంత కోపం వస్తోంది. వెంటనే బయల్దేరు యువరాణి మనం నాగలోకానికి వెళ్లిపోదాం. నేను ప్రాధేయపడి నాగదేవతను ఒప్పించుకుంటాను. నువ్వు సరేనంటే నేను ఇప్పుడే మోక్షను కాటేసి చంపేస్తా. 


పంచమి: ఆపండి యువరాజా! నేనిప్పుడు మోక్ష బాబు భార్యను. నా భర్త నన్ను కొట్టినా, చంపినా భరించాల్సింది నేను. నా భర్తకు అంత కోపం రావడానికి కారణం నేనే.  నాకు నా భర్తంటే ప్రాణం యువరాజా. తన ప్రాణాలు కాపాడి ఇక తనకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగినప్పుడే నేను నాగలోకం రాగలను. దానికి ఉన్న మార్గం చెప్పండి.
ఫణేంద్ర: నేను చెప్పినట్లు చేస్తే మన ప్రణాళికకు మోక్ష ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మోక్షకు ఏమాత్రం ప్రమాదం లేకుండా మనమే ఓ నిర్ణయానికి వద్దాం. నువ్వు పాముగా మారి మోక్షని కాటేసి చంపి మనద్దరం నాగలోకం వెళ్లిపోయి నాగమణిని తీసుకొచ్చేద్దాం. అంతవరకు మోక్ష భౌతిక కాయానికి మేఘన రక్షణ కవచంలా ఉంటుంది.
పంచమి: అది జరగని పని. నా భర్తొ అనుమతి లేకుండా నేను ఏ పని చేయను. కచ్చితంగా మోక్షాబాబు ఒప్పుకుంటేనే మనం అలాంటి పని చేయగలం. 
ఫణేంద్ర: అయితే నా నిర్ణయం కూడా చెప్తాను విను యువరాణి. ఏకాదశి రోజున నాగదేవత ఆదేశించినట్లు నేను మోక్షని కాటేసి నా పాటికి నేను నాగలోకం వెళ్లిపోతాను. ఇక నువ్వు పాముగా మనిషిగా మారుతూ.. ఎవరో ఒకరి చేతిలో దెబ్బలు తిని చనిపోతావు.
మేఘన: మనసులో.. కథ అడ్డం తిరిగి మళ్లీ మొదటికి వచ్చిందే.. వీళ్ల వాలకం చూస్తుంటే నాగమణి నా చేతికి వచ్చేలా కనిపించడం లేదు. అధైర్య పడకు పంచమి.. ఫణేంద్ర కోపంలో అలా అన్నాడేకానీ అలా చేయడు. అవును పంచమి నిన్ను నాగలోకం తీసుకెళ్లడం ఫణేంద్ర ధ్యేయం. అందుకోసం నాగమణిని తీసుకొచ్చి తీరుతాడు. నువ్వు నీ మాట మీద గట్టిగా ఉండు పంచమి అప్పుడే ఫణేంద్ర నీదారికి వస్తాడు.
పంచమి: ఏమో మేఘన నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. 


ఇక మేఘన ఇంట్లో పనులు అన్నీ చేసేసి.. పూజలు చేసి శబరిని బుట్టలో వేసుకుంటుంది. ఇక చిత్ర, జ్వాలలు తన దగ్గరికి వస్తే కాఫీ ఇస్తుంది. చిత్ర ఆ కాఫీ తీసుకొని తాగి వేడి అని మంటకు అరుస్తుంది. ఇక ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది. మరోవైపు మోక్ష హాల్‌లోని సోఫాలోనే పడుకొని ఉంటాడు. ఇక వైదేహి అక్కడికి వస్తుంది. మోక్ష వెళ్లిపోతుంటే ఆగమని చెప్తుంది. సోఫాలో ఎందుకు పడుకున్నావని నిలదీస్తుంది. 


వైదేహి: ఇంత వరకు నాలుగు గోడల మధ్య నలిగిన మీ సమస్య రాత్రి బట్టబయలు అయింది. రాత్రి మీరు గొడవ పడటం నువ్వు పంచమిని కొట్టడం నా కళ్లారా చూశాను. కొన్ని విషయాలు ఎంత దాచాలి అన్నా దాగవు. ఇంత కాలం మా దగ్గర నటిస్తూ వచ్చారు. మీరిద్దరూ సంతోషంగా లేరు అనే విషయం నాకు ఎప్పుడో తెలుసు. కానీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాత్రి మీరే బయటపడ్డారు. 


శబరి: ఎంట్రా మనవడా మీ అమ్మ చెప్పేది నిజమేనా.. నువ్వు పంచమిని కొట్టావా.. 
మీనాక్షి: కొట్టేంత తప్ప పంచమి ఏం చేసింది మోక్ష. ఎవరైనా భార్యమీద చేయి చేసుకుంటారా చెప్పు. 
వైదేహి: నువ్వు ఎంత విసిగిపోయి ఉంటే పంచమిని కొట్టుంటావో నేను అర్థం చేసుకోగలను మోక్ష.  ఓ రకంగా రాత్రి అలా జరగడం మంచిదే అయింది లేదంటే నీ జీవితం ఇంకా నాశనం అయిపోయిండేది. ఇక నైనా మేం చెప్పినట్లు విని కొత్త జీవితాన్ని ప్రారంభించు. పంచమిని మర్చిపో. 
మీనాక్షి: వదినా ఏదో చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం  అవసరం లేదు. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం.
వైదేహి: మీనాక్షి ఇది నా కొడుకు జీవితం ఒక సుఖం.. సంతోషం లేకుండా పిచ్చొడిలా తిరుగుతఉంటే నేను చూస్తూ ఉండలేను. 
శబరి: అలా ఉండాలి అని ఎవరూ కోరుకోరు వైదేహి. సమస్యకు పరిష్కారం వెతక్కుండా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. మోక్ష ఇంకా చిన్న పిల్లాడు కాదు. 
వైదేహి: ఈ విషయంలో నాదే తుది నిర్ణయం. నేను అంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. మోక్ష నువ్వు ఇంక పంచమిని మర్చిపో. 
మోక్ష: అమ్మా మా మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము సాల్వ్ చేసుకుంటాం. మమల్ని వదిలేయండి.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.