New Year Eve Parties In Hyderabad 2024: 2023తో మన ప్రయాణం ముగిసిపోనుంది. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాం. జరిగిన చెడును మర్చిపోయి ఇప్పుడు కొత్త ఆశలతో అంతకు మించిన లక్ష్యాలతో 2024కు ఆహ్వానించడానికి యావత్‌ ప్రపంచం రెడీ అవుతోంది. ఈ వేడుకను కలర్‌ఫుల్‌ అండ్‌ కిక్క ఇచ్చేలా నిర్వహించేందుకు సిద్దమైపోయింది. 


భారీ ఈవెంట్స్ 


2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 ఏడాదికి స్వాగతం పలుకుతూ భారీగా రిజల్యూషన్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి సంస్థలు. ప్రత్యేక ఆఫర్‌లతో ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే వాళ్ల కోసం చాలా సంస్థలు విభిన్న స్టైల్‌లో ఈవెంట్స్‌ను ఏర్పాటు చేసి 2024ను ఆహ్వానించబోతున్నాయి.


డీజేల మోత 


అద్భుతమైన ఫుడ్‌ మెను, మందుపై మంచి ఆఫర్‌లు ఇస్తున్నాయి సంస్థలు అంతేనా 31 పార్టీ అంటేనే డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోవాలి. పబ్‌లు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఇతర పార్టీ ఈవెంట్‌ ఏదైనా సరే డీజే ఉండాల్సిందే. లేకుంటే అసలు ఆ పార్టీలో జోషే ఉండదు. అందుకే స్పెషల్‌ దేశవిదేశాల నుంచి పేరున్న డీజేలు, ఆర్టిస్టులను పిలిచి మరీ ఈవెంట్స్‌ కండక్ట్ చేస్తున్నారు. 


సాఫ్రాన్‌ వ్యాలీలో ఈవెంట్‌


న్యూఇయర్‌ బాష్‌ 2024 పేరుతో హైదరాబాద్‌లోని రామాంతపూర్ విలేజ్‌లో మసాయిపేటలో ఉన్న సాఫ్రాన్‌ వ్యాలీ, ఫామ్‌హౌస్‌ రిసార్ట్స్‌లో ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో అన్ని వయసుల వారికీ ఆహ్వానం ఉంది. వెయ్యి రూపాయల నుంచి టికెట్‌ రేట్‌లు ఉన్నాయి. 8 గంటలకు ప్రారంభమయ్యే వేడుక నాలుగు గంటల పాటు జరగనుంది. ఇంటర్‌నేషనల్‌ డీజే లియాలిసే, డీజే జయ్‌, పండు మాస్టర్‌ అలరించబోతున్నారు. వీళ్లు ప్రత్యేకంగా డ్రైవర్‌ను ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్లు ఇంటి వద్దే పిక్‌ అప్‌ చేసుకొని మళ్లీ డ్రాప్ చేస్తారు. 


3.0 పేరుతో ఈవెంట్‌


ద ప్రిజమ్‌ సర్కస్‌ 3.0 పేరుతో ప్రిజమ్ క్లబ్‌ అండ్‌ కిచెన్ ఈవెంట్‌ ఏర్పాటు చేసింది.  ఇక్కడ 21 ఏళ్లకుపైబడిన వారినే అనుమతిస్తారు. అలీ మర్చెంట్‌, డీజే కాజల్‌, డీజే షాడో దుబాయ్‌, స్కింటిల్లెట్ అతిథులను అలరించనున్నారు. వీటితోపాటు అంతర్జాతీయ మ్యాజిక్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ ఒక్కో టికెట్ రేటు 3వేల నుంచి ప్రారంభంకానుంది. 


మాస్క్‌ థీమ్‌


తుక్కుగూడలో ఉన్న సావీ ఫామ్‌ హౌస్ వాళ్లు కూడా బజ్‌ పేరుతో ఈవెంట్‌ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ రేటు 7 వందల నుంచి ప్రారంభమవుతుంది. పూల్‌ పార్టీ, మాస్క్‌థీమ్డ్‌ పార్టీ, ఓపెన్ డీజే ఇలా ప్రత్యేక ఈవెంట్స్‌తో ఆకర్షిస్తోంది. 


హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కూడా ఓఎంజీ ప్రో పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాప్రిసియో, డీజే పృథ్వి సాయి ఈవెంట్‌కు హాజరుకానున్నారు. ఇక్కడ ఒక్కో టికెట్‌ రేటు 8వందల నుంచి ప్రారంభమవుతుంది. 


చిరాన్ ఫోర్ట్‌లో ఓపెన్ ఎయిర్‌ న్యూఇయర్ పార్టీ జరగనుంది. మషుప్మీనతి, రిషితా దత్తా ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. లైవ్‌ డీజే స్పెషలిస్ట్‌ ఢిల్లీకి చెందిన మషుప్మీనతి తొలిసారిగా హైదరాబాద్‌లో ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ టికెట్‌ ఆరు వందల నుంచి ప్రారంభమవుతుంది. 


ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో కూడా 2024ను ఆహ్వానించడానికి లైవ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పేరున్న ప్రముఖ డీజేలు హాజరుకానున్నారు. విభిన్న ఈవెంట్స్‌తో నాలుగు వేదికను ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 8 మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. 
ఇలా ఎటు చూసిన పార్టీలతో డిసెంబర్‌ 31 నైట్‌ హైదరాబాద్‌ మోతెక్కుపోతునంది. డీజేలతో డ్యాన్స్‌ ఫ్లోర్‌ ఊగిపోనుంది. 


మరికొన్ని ఈవెంట్స్‌
నూతన సంవత్సర వేడుకలు 2023 @కంట్రీ క్లబ్ 
Mysti5 NYE బ్లాస్ట్
అనంతగిరి హిల్స్ న్యూ ఇయర్ నైట్ క్యాంపింగ్
గేటెడ్ కమ్యూనిటీ న్యూ ఇయర్ పార్టీ
జోష్ 2024 న్యూ ఇయర్ పార్టీ
డెక్కన్‌ట్రైల్స్‌లో నూతన సంవత్సరం 
సహస్ర నూతన సంవత్సర సమావేశం
న్యూ ఇయర్ ఫియస్టా ఎఫ్‌టీ శాంతి పీపుల్‌
తాజ్ బంజారాలో నూతన సంవత్సర వేడుకలు 
TOT నూతన సంవత్సర పండుగ 
స్పాయిల్ న్యూ ఇయర్ బాష్ 2024 
ట్రైడెంట్‌లో 2023 NYEలో ఫన్ ఎక్స్‌టెండెడ్ 
న్యూ ఇయర్ ఈవ్ పార్టీ – రామోజీ సిగ్నేజ్ ఏరియా 
NYE 2023 తాజ్ దక్కన్ వద్ద 
NYE 2023 వాల్యూమ్. 4.0 Fusion9 
లియోనియాలో DJతో NY పార్టీ 2024 
మ్యాడ్‌ ఆన్‌ BSportyలో 2024
NYE 2023 ప్లేబాయ్ బీర్ గార్డెన్‌ 
హైటెక్ సిటీలో బూమరాంగ్ న్యూ ఇయర్ ఈవ్ 2023
PUB-G 2024
నూతన సంవత్సర ఫ్యామిలీ ఈవెంట్ @ SkyZone