Telangana Inter Exam Fee: తెలంగాణ(Telangana)లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో కలిపి 10.59 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఫీజు చెల్లింపు గడవు ముగిసేనాటికి 9.77 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇంకా 82 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది ఇంటర్ బోర్డు. ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ విద్యార్థులు రూ. 710 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 10,59,233 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో అడ్మిషన్లను పొందారు. వీరిలో 8,99,041 మంది విద్యార్థులు నిర్ణీత గడువులోపే పరీక్ష ఫీజులు చెల్లించారు. మరో 61,005 మంది విద్యార్థులు రూ.100 ఫైన్‌తో, 8,638 మంది విద్యార్థులు రూ.500ల ఫైన్‌తో, 5,212 మంది విద్యార్థులు రూ.1000 ఫైన్‌తో, 3,144 మంది విద్యార్థులు రూ.2000 ఫైన్‌తో చెల్లించారు. ఇప్పటి వరకు మొత్తంగా 9,77,040 మంది విద్యార్థులు మార్చి -2024 పరీక్ష ఫీజులను చెల్లించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
పరీక్ష ఫీజు వివరాలు ఇలా..
🔰 ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు రూ. 500 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
🔰 ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల నిమిత్తం అదనంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది.
🔰 ఒకేషనల్ విద్యార్థులైతే రూ. 710 చెల్లించాలి.
🔰 నవంబరు 14 నుంచి 30 వరకు ఫీజు ఆలస్యరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. (డిసెంబరు 12 వరకు పొడిగించారు).
🔰 రూ. 100 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
🔰 రూ. 2000 ఆలస్య రుసుంతో తెలియాల్సి ఉంది.
పరీక్షల షెడ్యూలు వెల్లడి..
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష టైమ్ టేబుల్‌ను డిసెంబరు 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
➥ 28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
➥ 01-03-2024: ఇంగ్లిష్ పేపర్-I
➥ 04-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
➥ 06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
➥ 11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
➥ 15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
➥ 18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ పరీక్షలు..
➥ 29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
➥ 02-03-2024: ఇంగ్లిష్ పేపర్-II
➥ 05-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
➥ 07-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
➥ 12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
➥ 16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
➥ 19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
ALSO READ:
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, పరీక్ష ఫీజు వివరాలు ఇలా
ఏపీలో సార్వత్రిక విద్యాపీఠం(APOSS) పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఫీజు చెల్లించాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.25 ఆలస్యరుసుముతో జనవరి 20 నుంచి 27 వరకు, ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుముతో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..