నువ్వు మాట్లాడకుండా దూరం పెట్టేసరికి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, అఖిల్ కి మీరంటే చాలా ప్రేమ మీరు మాట్లాడకుండా దగ్గరకి తీసుకోకుండా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు, తను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అఖిల్ ని క్షమించి తనతో మాట్లాడండి లేదంటే ఆ బాధతో ఇంకేం చేస్తాడో అని అనిపిస్తుందని జానకి చెప్తుంది. జానకి చెప్పింది నిజమే ఒకసారి అఖిల్ ని పిలిపించి మాట్లాడమని గోవిందరాజులు కూడా చెప్తాడు. నువ్వు మాట్లాడకపోతే మరింత తప్పులు చేస్తాడని రామా అంటాడు. మీరు ఒకసారి దగ్గరకి తీసుకుంటే మీరు ఏది చెప్తే అదే చేస్తాడని జానకి చెప్తుంది. వాడి మీద కోపం బాధ పోవాలంటే నాకు కొంచెం సమయం పడుతుంది, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను అని జ్ఞానంబ అంటుంది.


జానకి చదువుకుంటూ అలాగే నిద్రపోతుంది. తెల్లరిన తర్వాత అది చూసి రామా తన కోసం కాఫీ పెట్టుకుని తీసుకెళ్లడం మల్లిక చూస్తుంది. కాఫీ తెచ్చి జానకిని నిద్రలేపుతాడు. మీ చదువుకి ఎటువంటి ఆటంకం రాకుండా ఇంటి పనులు కూడా పూర్తి చేశాను అని రామా చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కుళ్లుకుంటుంది మల్లిక. నేను ఉండగా నిన్ను ఎలా ప్రశాంతంగా చదువుకోనిస్తాను అని మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తుంది. జానకిని తిట్టించడం కోసం మల్లిక ఇంటి ముందు తులసి కోటలో ఉన్న తులసి మొక్కని పీకేస్తుంది. అది రామా, జానకి చూస్తారు. అప్పుడే జ్ఞానంబ తులసి కోటకి పూజ చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యమని చికితకి చెప్తుంది. మల్లిక తులసి కోటని కూడా కిందపడేస్తుంది.


Also Read: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి


జ్ఞానంబ తులసి కోట దగ్గరకి రావడం చూసు మల్లిక అక్కడి నుంచి జారుకుంటుంది. తులసి కోటని అలా చూసి జ్ఞానంబ షాక్ అవుతుంది. ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. ఎవరు ఇలా చేశారని జ్ఞానంబ అడుగుతుంది. రామా, జానకి  మల్లిక వైపు చూస్తారు. తులసి కోటని ఇలా పడగొట్టింది జానకినే అని మల్లిక అంటుంది. పొద్దున్నే తులసి కోటని శుభ్రం చేసేది జానకినే కాబట్టి పడగొట్టింది కూడా తనే అని అంటుంది. రామా ఆ మాటలకి మల్లిక మీదకి వెళ్తుంటే జానకి ఆపుతుంది. జానకి మనస్తత్వం నాకు తెలుసు తన వల్ల పొరపాటు జరిగితే నాకు చెప్పి క్షమాపణ అడుగుతుందని జ్ఞానంబ వెనకేసుకొస్తుంది. జానకి కాకపోతే తులసి కోట విలువ తెలియని జెస్సి వల్లఅ పొరపాటు ఏమో అని మల్లిక మళ్ళీ పుల్ల వేస్తుంది. నిజంగా నాకు తెలియదు నేనేమీ చేయలేదని జెస్సి అంటుంది.


రామా విషయం చెప్పబోతుంటే జానకి ఆపి దానికి కారణం తనే అని ఒప్పుకుంటుంది. అత్తయ్యగారికి చెప్పాలనుకునే లోపు ఇదంతా జరిగింది నన్ను క్షమించండి నా పొరపాటు వల్లే తులసి కోట పడిపోయిందని జానకి అంటుంది. ఇది నిజం కాదని గోవిందరాజులు అంటాడు. చదువుకోకుండా టైమ్ వెస్ట్ చేయించాను ఇది చాలులే అని మల్లిక మనసులో అనుకుంటుంది. జానకి తులసి కోట మట్టి అంత ఎత్తుతుంటే అందులో ఉంగరం కనిపిస్తుంది. ఇందులో ఏదో ఉంగరం దొరికిందని జానకి జ్ఞానంబకి చెప్తుంది. అది చూసిన గోవిందరాజులు సంతోషంగా ఇది మన పెళ్లి నాటి ప్రధాన ఉంగరం జ్ఞానం అని చెప్తాడు. అది చూసి జ్ఞానంబ సంతోషిస్తుంది.  


Also Read: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ