తులసి కోపంగా మ్యూజిక్ స్కూల్ ఫైల్ కోసం నందు క్యాబిన్ కి వస్తుంది. ఇది జనరల్ మేనేజర్ క్యాబిన్ లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలి. ఇది మన ఇల్లు కాదు నీ మాజీ భర్తతో మాట్లాడినట్టు జనరల్ మేనేజర్ గారితో మాట్లాడితే బాగోదు ఆలోచించుకోండి. మ్యూజిక్ స్కూల్ ఫైల్ హ్యాండోవర్ చేసుకున్నా జనరల్ మేనేజర్ గారు చెప్పబట్టి నీకు క్లారిఫికేషన్ కావాలంటే ఆయన్నే అడగండి అని లాస్య అంటుంది. ఇప్పటికే చాలా కాస్ట్ పెరిగిపోయింది అందుకే ఆ ఫైల్ లాస్యని తీసుకోమని చెప్పినట్టు నందు చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ ఎలా ఉండాలో నాకు తెలుసని తులసి కోపంగా అడుగుతుంది. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నేను తీసుకోవాల్సిందే అని తులసి అంటుంటే సామ్రాట్ అప్పుడే వస్తాడు.
ఈ ప్రాజెక్ట్ వరకు తులసిగారు నా బిజినెస్ పార్టనర్.. అంటే తను మీకు బాస్. ఆమెని గౌరవించే పద్ధతి ఇదేనా అని సామ్రాట్ సీరియస్ అవుతాడు. మ్యూజిక్ స్కూల్ ఆమె కల, తనని ఇన్వాల్వ్ కావొద్దని చెప్తే ఎలా అని సామ్రాట్ అంటాడు. నాకు చదువు, అర్హత ఉంది నేను సరైన నిర్ణయం తీసుకుంటాను అని నందు ఎదురు సమాధానం చెప్తాడు. నువ్వు తెలివైన వాడివి కావొచ్చు కానీ ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోకూడదు, మీ తప్పు సరిదిద్దుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. సామ్రాట్ మాటలకి నందు చిరాకు పడతాడు. ప్రేమ్, శ్రుతి ఇద్దరి మళ్ళీ వాదులాడుకుంటారు. ఇక నువ్వు మారావా ఇలాగే ఉంటావా అని శ్రుతి ఏడుస్తూ అడుగుతుంది. అన్నీ మర్చిపోయి కలిసి ఉందామని నేను అడిగాను అంతే అవును ఒప్పుకుంటాను కానీ నువ్వు మీ అమ్మ కోసం అలా అడిగావు. నీకు అసలు భర్తగా ఉండే అర్హత లేదు. భర్తగా నువ్వు ఒక డిజాస్టర్ అని అరుస్తుంది.
అలాంటప్పుడు ఎందుకు ఉన్నావ్ నేను పనికిరాను అనిపిస్తే ఇల్లు వదిలి వెళ్లిపో, నువ్వు లేకుండా బతకలేను అని బతిమాలడను, నేను నీకు పనికిరాకపోతే నువ్వు నాకు పనికిరావు. నీ మొహం కనిపించకపోతే నేను ప్రశాంతంగా బతుకుతాను. నువ్వు కూడా భార్యగా ఉండే అర్హత లేదు, ఒక డిజాస్టర్ అని ప్రేమ్ కోపంగా అరుస్తాడు. నందు సామ్రాట్ మాటలు తలుచుకుంటూ రగిలిపోతూ తాగుతాడు. ఏమైందని లాస్య వస్తుంది. తులసి ముందు నన్ను అవమానిస్తాడా అని రగిలిపోతాడు. జాబ్ వదిలేద్దాం అని నందు అంతే కావాలంటే నువ్వు మానేయ్ అని లాస్య అంటుంది. జాబ్ కోసం చెప్పులరిగేలా తిరిగాం, సామ్రాట్ మంచి జాబ్ ఇచ్చాడు ఇంకేం కావాలని అంటుంది. రేపు నీకు కూడా నాకు పట్టే గతి పట్టేలా చేస్తుంది, చచ్చినా నేను సామ్రాట్ ఆఫీసులో అడుగుపెట్టను అని నందు కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు.
Also Read: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ
శ్రుతి బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే తులసి వచ్చి ఆగు అని లోపలికి రమ్మని పిలుస్తుంది. అత్తయ్యని చూడాలని అనిపించి వెళ్తున్నా అని శ్రుతి అబద్ధం చెప్తుంది. నిజంగానే మీ అత్తయ్యని చూడటానికి వెళ్తున్నావా నాకు కూడా చెప్పవా అని అడుగుతుంది. ఆ మాటకి శ్రుతి ఏడుస్తూ వెళ్ళి తులసిని హగ్ చేసుకుంటుంది. నావల్ల ఏదైనా తప్పు జరిగిందా, ఎవరైనా బాధపెట్టే పని చేశారా? మరి ఎందుకు ఇంత రాత్రి పూట నాకు కూడా చెప్పకుండా వెళ్తున్నావ్ అని అడుగుతుంది. శ్రుతి గతంలో ప్రేమ్ చేసిన గొడవ అంతా చెప్తుంది. నన్ను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు అని చెప్తుంది. ఆ మాటకి తులసి కోపంగా ప్రేమ్ అని అరుస్తుంది. ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళు అందరూ బయటకి వస్తారు.
శ్రుతి జరిగింది అంతా అమ్మకి చెప్పేసి ఉంటుందనుకున్న ప్రేమ్ ఏదో మాట్లాడబోతుంటే తులసి వినకుండా చెంప చెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టానో తెలుసా..కట్టుకున్న భార్యకి గౌరవం ఇవ్వడం తెలియని నువ్వు ఏం మగాడివి, నీకు చెప్పకుండా ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేసింది ఎందుకు నువ్వు ఎదగాలని కదా. తన త్యాగానికి నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి తాగొచ్చి అవమానిస్తావా, అర్థరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతే పట్టించుకోవా ఏం చూసుకుని నీ పొగరు. నిజం దాచిందని తనని ఏడిపిస్తావా అని అరుస్తుంది.
Also Read: మాళవికకి కమ్మలు తొడిగిన యష్- నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించిన వేద