కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
వివరాలు..
* సైబర్ సెక్యూరిటీ కోర్సులు
1) సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ కోర్సు
2) డిప్లొమా కోర్సు
3) పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్
4) సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ కోర్సు
5) సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ
అర్హత: ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.10.2022.
Certificate in Cyber Security
Certificate in Cyber Security Officer
Cyber Security Teachers' Training
:: Also Read::
నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...