జానకి మాధురిని చూసి ఎమోషనల్ అవుతుంది. అక్కడ మాధురి బ్యాగ్ ఉంటే ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తుంది.  అఖిల్ చైనా పని గుర్తు చేసుకుని బాధపడుతుంది. మాధురి తల్లిదండ్రులు కంగారుగా హాస్పిటల్ కి వస్తారు. కూతురిని చూసి వాళ్ళ అమ్మానాన్న చాలా ఏడుస్తారు. అసలు మాధురి మీద అఖిల్ ఎందుకు ఎటాక్ చేశాడో అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. తల మీద బలంగా గాయం తగలడం వల్ల పరిస్థితి కష్టంగా ఉందని, బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ బయటకి వచ్చి చెప్తుంది.


తమకి ఉన్నది ఒక్కగానొక్క కూతురేనని తనని కాపాడమని మాధురి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తారు. అది చూసి జానకి మనసు చలించిపోతుంది. ఇంట్లో జ్ఞానంబ వాళ్ళు జానకి కోసం కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. నాది దొంగ కడుపు అని జానకి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి డాక్టర్ ని తీసుకురావడానికి వెళ్ళిందేమో అని మల్లిక టెన్షన్ పడుతుంది. అటు రామా జానకికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ తను లిఫ్ట్ చేయదు. మనం కంగారుపడతామని తెలుసు కదా సమాచారం ఇవ్వాలి కదా జ్ఞానంబ అంటుంది. అప్పుడే జానకి ఇంటికి వస్తుంది. అప్పుడే అఖిల్ కూడా గదిలో నుంచి బయటకి వచ్చి జ్ఞానంబ వాళ్ళ దగ్గర నిలబడతాడు.


Also Read: అనసూయని వెర్రిదాన్ని చేసి ఆస్తి కొట్టేసిన లాస్య- తులసికి ఘోర అవమానం


ఒక ఆడపిల్లని చావు దాకా తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండటానికి నీ టెన్షన్ ని కవర్ చేసుకుంటున్నావా అఖిల్. నీ చెంప పగలగొట్టి నువ్వు చేసిన పని బయట పెట్టాలని ఉన్నా నా కొడుకు ఇంత పని చేశాడా అని అత్తయ్యగారు తట్టుకోలేరని ఆగుతున్నా అని జానకి మనసులో అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళావ్ ఏం మాట్లాడవేంటి అని జ్ఞానంబ అడుగుతుంది. స్టడీ మెటీరియల్ తీసుకుందామని వెళ్ళాను చెప్పకుండా వెళ్లినందుకు క్షమించండి అని అడిగి అక్కడి నుంచి దిగాలుగా వెళ్ళిపోతుంది. అది విని మల్లిక ఊపిరి పీల్చుకుంటుంది. పోలేరమ్మకి విషయం చెప్పకుండా దాచింది ఎందుకో ఆమె తట్టుకోలేదని దాచినట్టు ఉందని మల్లిక అనుకుంటుంది.


జానకి మాధురి గురించి డాక్టర్ చెప్పింది తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. రామా వచ్చి ఏమైందని అడుగుతాడు. అలసటగా ఉందని అబద్ధం చెప్తుంది కానీ రామా మాత్రం నమ్మడు, దేని గురించో ఆలోచిస్తున్నారా, కాలేజీలో కూడా మన ఇంటి గురించి మాట్లాడాలి అన్నారు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను అని రామా అంటాడు. అసలే మల్లిక దొంగ కడుపు సమస్య అనుకుంటే ఇప్పుడు అఖిల్ ఒక అమ్మాయిని మర్డర్ చేసే దాకా వెళ్లాడని తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది ముందు అఖిల్ తో మాట్లాడాలి అని మనసులో అనుకుని ఏం సమస్య లేదని పైకి చెప్తుంది. జానకి ఏదో చెప్పలేకపోతుందని గ్రహించిన రామా అడగటం ఆపేస్తాడు.


Also Read: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని అనుమానించిన మోనిత- శౌర్య దగ్గరకి వచ్చిన ఆనందరావు, హిమ


మాధురి విషయం బయటపడిన నా మీద ఎవరికి అనుమానం రాకూడదు అంటే మంచిగా మారినట్టు నటించాలి అని అఖిల్ అనుకుంటాడు. పుస్తకాలు తీసుకుని బయటకి వెళ్లబోతుంటే జెస్సి పిలిచి ఎక్కడికి అని అడుగుతుంది. చదువుకోవడానికి అని చెప్పేసరికి తనలో ఉన్న మార్పు చూసి జెస్సి సంతోషిస్తుంది. అదంతా జానకి వింటూనే ఉంటుంది. అక్కడ మాధురి మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని జానకి అనుకుని అఖిల్ దగ్గరకి వస్తుంది. నువ్వు చెప్పావని కెరీర్ మీద దృష్టి పెట్టాను అని చెప్తాడు. నీకోసం ఎవరో ఒక పర్సన్ వచ్చాడు నీతోనే మాట్లాడాలి అంట బయట వెయిట్ చేస్తున్నాడని జానకి అబద్ధం చెప్తుంది. నేను మాధురిన్ని చంపాను అని తెలిసి ఎవరైనా వచ్చారా అని అఖిల్ కంగారుగా బయటకి పరుగులు పెడతాడు.