అనసూయ కూరగాయలు కొంటుంటే అక్కడ అమ్మలక్కలు అందరూ తలా ఒక మాట అంటారు. తులసి ఆఫీసుకి వెళ్తు ఇంటి దగ్గర ఆగుతుంది. ఇంట్లోకి వెళ్లబోతుంటే తులసిని ఆపుతుంది అనసూయ. మీరందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారుగా నేనే తులసిని బయటకి గెంటేశాను. ఈవిడ గారు హద్దులు చెరపేసి నాకు నా ఇంటికి ఇలాంటి కూతురు, కోడలు అవసరం లేదు, మీరన్నట్టు తప్పు నాదే కోడలు ఎప్పుడు కూతురు కాలేదు. తను ఈ కాలనీలో గుండె వెళ్ళకుండా నేను ఆపలేను. కానీ ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను. ఈవిడ నా కోడలు కాదు కూతురు కాదు. ఈవిడగారితో నా కుటుంబానికి సంబంధం లేదని అమ్మలక్కలతో చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తులసి వెళ్లబోతుంటే లాస్య ఆపుతుంది.


Also Read: కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని అనుమానించిన మోనిత- శౌర్య దగ్గరకి వచ్చిన ఆనందరావు, హిమ


లాస్య: ఇప్పుడే లాయర్ ని కలిసి వస్తున్నా


తులసి: ఎందుకు మీ ఆయనకి విడాకులు ఇవ్వడానికా


లాస్య: గుడ్ జోక్ కానీ నవ్వు రాలేదు. ఈ పేపర్లు చదివి సైన్ చెయ్యి


తులసి: దేనికి సంబంధించినవి


లాస్య: ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా ఈ ఇంటిని నీ ఇష్టప్రకారం అత్తయ్యగారి పేరు మీదకి రాస్తున్నట్టు  


అనసూయ తులసిని నానా మాటలు అంటుంది. అది విని తట్టుకోలేక ఈ ఇల్లు నాకు కావాలని ఎప్పుడు అనుకోలేదు అని తులసి సంతకం పెట్టేస్తుంది. ఇక ఈ ఇల్లు మీదే నాకు ఈ ఇంటితో సంబంధం లేదేమో కానీ ఇంట్లో వాళ్ళతో బంధాన్ని తెంచలేరు అని చెప్పేసి తులసి వెళ్ళిపోతుంది. తులసి సంతకం పెట్టిన పేపర్స్ తీసుకుని లాస్య మురిసిపోతుంది. ఆఫీసులో కూర్చుని తులసి అనసూయ అన్న మాటలు తలుచుకుని చాలా బాధపడుతుంది. పీఏ వచ్చి ఆఫీసు వర్క్ గురించి మాట్లాడుతుంటే తులసి కోపంగా అరుస్తుంది.


Also read: ఆదిత్యతోనే ఉంటానన్న దేవి- రుక్మిణి మీకు కనిపించిందా అని సత్యని ప్రశ్నించిన దేవుడమ్మ


సామ్రాట్ అది చూసి షాక్ అవుతాడు. నిజంగా పీఏ మీద కోపంతో అరిచారా అని అడుగుతాడు. ఇంట్లో వాళ్ళ మీద కోపం అని అంటుంది. తన వాళ్ళు గురించి చెప్పుకుని చాలా బాధపడుతుంది. మిమ్మల్ని హర్ట్ చేసింది ఎవరని అడుగుతాడు. ఈరోజు చాలా బాధగా అనిపించింది అందుకే కంట్రోల్ తప్పాను అని సోరి చెప్తుంది. మా అమ్మ కంటే అత్తయ్యకె 25 ఏళ్లు సేవలు చేశాను అని తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆఫీసు ఫైల్ మీద సంతకం పెట్టినట్టు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టింది ఏంటి అది, కనీసం బతిమలాడను కూడా లేదు అని అరుస్తుంది. మీరు తిట్టారని ఆవిడగారు ఇల్లు వదిలి వెళ్లలేదు తన ప్రియుడి కోసం వెళ్లిపోయిందని లాస్య మరింత ఎక్కిస్తుంది.


తులసితో ఇంటి పేపర్ల మీద సైన్ చేయించుకున్న విషయం మావయ్యకి చెప్పొద్దు అని లాస్య చెప్తుంది. అందుకు అనసూయ సరే అంటుంది. లాస్య ఇంటి పేపర్లు తీసుకుని చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది.


తరువాయి భాగంలో..


అటు తులసిని, ఇటు అనసూయని రెచ్చగొట్టి ఆస్తి చేజిక్కించుకున్నందుకు లాస్య తెగ సంబరపడిపోతుంది. ఈ పేపర్లు నందుకి కనిపించకూడదు వెంటనే దాచి పెట్టాలి అని అవి దాస్తుండగా నందు వస్తాడు.