దీప శౌర్య గురించి ఆలోచిస్తూ దుర్గతో మాట్లాడుతుంది. అక్కడ ఉన్నది శౌర్య అయితే వాళ్ళు మిమ్మల్ని ఫంక్షన్ కి ఎందుకు పిలుస్తారు. వేరే అమ్మాయిని మీకు చూపించాల్సిన అవసరం ఏంటి? ఉన్న బాధలు చాలవు అన్నట్టు కొత్తవి తలకి ఎక్కించుకోకు. శౌర్య వాళ్ళ దగ్గరే ఉంటే అసలు మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఊరు వదిలి పారిపోతారు. ఎక్కువగా ఆలోచించకు దీపమ్మా, మనం కార్తీక్ సార్ కి గతం గుర్తుకు తీసుకురావడం గురించి ఆలోచించాలి అని దుర్గ నచ్చజెపుతాడు. మోనిత కారు దగ్గరకి కార్తీక్ ని తీసుకుని వస్తుంది. మెకానిక్ ఎక్కడ అని కార్తీక్ అడుగుతాడు. వచ్చి రిపేర్ చేసి వెళ్లిపోయాదని మోనిత చెప్పినా కార్తీక్ నమ్మడు. కారుని వదిలేసి ఆటో ఎందుకు ఎక్కావ్ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. కోపంగా మోనిత తల కారుకేసి కొట్టుకుంటుంది.


మోనిత చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎక్కడ పొంతన లేదు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి శౌర్యని వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఆలోచిస్తాడు. మోనిత కార్తీక్ ని చూసి ఏంటి ఇలా మారిపోయావ్ అని అడుగుతుంది. తల కొట్టుకుంటున్నా ఆపాలని కూడా అనుకోవడం లేదు ఏంటి కార్తీక్ అని అడుగుతుంది. ఎందుకు ఆపడం మెకానిక్ తెలుసు అన్నావ్ కదా కారుకు ఏదైనా అయితే వచ్చి రిపేర్ చేస్తాడులే అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇలా మారిపోవడానికి కారణాం ఆ వంటలక్క అని తన ఇంటికి వెళ్తుంది. చూడటానికి అమాయకంగా కనిపించే నువ్వు ఏం నాటకాలు ఆడుతున్నావ్, ఏం మాయమాటలు చెప్పావ్ అని మోనిత అరుస్తుంది.


దీప: నా మొగుడ్ని నువ్వు ఎత్తుకుపోయి నీ మొగుడికి నేను గాలం వేసినట్టు మాట్లాడుతున్నావ్, అసలు ఏంటే నువ్వు .. నన్ను అనుమానించేలా చేసి డాక్టర్ బాబు చుట్టూ కుక్కపిల్లలా తిరిగావ్, ఏమన్నా సాధించావా


మోనిత: ఇప్పుడు కార్తీక్ నా వాడు నా సొంతం


దీప: అయితే మరి ఎందుకు గొంతు చించుకుంటున్నావ్.. సంతోషంగా ఉండలేవు ఎందుకంటే డాక్టర్ బాబు నా సొంతం, అప్పుడే ఏం సాధించలేవు ఇప్పుడేం చేస్తావ్. దుర్గ రెడీ గా ఉన్నాడు నిన్ను తరిమి తరిమి కొడతాడు. నిన్ను అడ్డు తొలగించగలను కానీ నువ్వు నా భర్తని కాపాడి నాకు అప్పగించావ్


మోనిత: కార్తీక్ ని నా సొంతం చేసుకుని తీరతాను, నా ప్రాణాలు పోయినా సరే కార్తీక్ ని వదిలిపెట్టను


Also read: ఆదిత్యతోనే ఉంటానన్న దేవి- రుక్మిణి మీకు కనిపించిందా అని సత్యని ప్రశ్నించిన దేవుడమ్మ


చంద్రమ్మ ఇంద్రుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంద్రుడు కూడా చాలా టెన్షన్ గా శౌర్య వాళ్ళ నాన్న రోడ్డు మీద కనిపించాడు నన్ను పిలిచాడు కానీ తప్పించుకుని వచ్చేశాను అని చెప్తాడు. చంద్రమ్మ కూడా దీప ఇంటికి వచ్చిందని చెప్పడంతో ఇద్దరు కంగారు పడతారు. ఊరి వదిలి వెళ్లిపోదాం అంటే జ్వాలమ్మ ఒప్పుకోదు కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆనందరావు, హిమ అక్కడికి వస్తారు. దీప మళ్ళీ శౌర్య గురించే ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే దుర్గ వస్తాడు. నిజంగా శౌర్యమ్మ అక్కడే ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అని దుర్గ వెళ్లబోతుంటే కార్తీక్ ఇంటి బయట ఎదురుపడతాడు.


కార్తీక్ వద్దని ఆపుతాడు, రేపు మేము వెళ్ళి మాట్లాడతామూలే అని అంటాడు. సరే అని దుర్గ ఆగిపోతాడు. నువ్వు శౌర్య గురించి ఆలోచించకు మనం వెతుకుదాం తప్పకుండా దొరుకుతుందని చెప్తాడు. ఇంతకముందు ఎప్పుడో గాని నా దగ్గరకి వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఎక్కువసేపు నాదగ్గరే ఉంటున్నారు మోనిత మీద అయిష్టం పెరిగిందా లేక గతం ఏమైనా గుర్తుకు వచ్చిందా అని దీప అనుమానపడుతుంది. అటు మోనిత కూడా కార్తీక్ ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది. గతం గుర్తుకు వచ్చిందా నన్ను లాగిపెట్టి కొట్టి ఆ వంటలక్క దగ్గరకి వెళ్తాడు కదా మరి నాదగ్గరకి ఎలా వచ్చాడు, కారు చెడిపోతే ఆటో ఎక్కడం సహజం కదా అయినా అంతగా ఎందుకు గుచ్చి గుచ్చి అడిగాడు ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని మోనిత అనుకుంటుంది.


Also read: మాళవికతో యష్ పిక్నిక్ కి వెళ్ళడానికి ఒప్పుకున్న వేద- ధైర్యం చెప్పిన మాలిని


మన ఇంటికి వెళ్దాం రమ్మని శౌర్యని ఆనందరావు పిలుస్తాడు. శౌర్య మాత్రం రాను అని కోపంగా చెప్తుంది. అమ్మానాన్నలు కనిపించే వరకి ఇక్కడే ఉంటాను అని అంతే అమ్మానాన్నలు తప్పిపోలేదు అని ఆనందరావు చెప్తాడు. ఎంత బతిమలాడినా శౌర్య మాత్రం రానని చెప్పేస్తుంది.