దేవికి తన తండ్రి ఎవరో తెలియడంతో చాలా ఆనందంగా ఉంటుంది. చిన్మయి వచ్చి పిలిచినా పట్టించుకోదు. ఏంటి దేవి పిలిచినా పలకకుండా దేని గురించి ఆలోచిస్తున్నావ్ అని చిన్మయి అడుగుతుంది. నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉందని చెప్తుంది. ఎందుకని చిన్మయి అడిగితే ఏం లేదని దేవి చెప్పకుండా దాచేందుకు చూస్తుంది. నాతో కూడా చెప్పవా అని చిన్మయి మళ్ళీ అడిగేసరికి దేవి మా నాయన ఎవరో తెలిసింది, ఇన్ని రోజులు మా నాయన ఎవరో తెలియక చాలా బాధ పడ్డాను అని దేవి చెప్తుంది. ఆ మాట విని చిన్మయి షాక్ అవుతుంది. ఎవరని తెలిసిందని చిన్మయి కంగారుగా అడుగుతుంది.
దేవి: ఇంకెవరూ ఆఫీసర్ సర్ మా నాయన
చిన్మయి: ఆఫీసర్ సర్ మీ నాయన అని నాకు ముందే తెలుసు
దేవి: తెలుసా.. ఎలా తెలుసుకున్నావ్ అమ్మ చెప్పిందా
చిన్మయి: ఎలాగో తెలుసుకున్నాలె
దేవి: నాకు ఒక విషయం అర్థం కాలేదు అమ్మ, నాయనకి ఒకరికొకరు మస్త్ ఇష్టం అయినా ఎందుకు దూరంగా ఉంటున్నారు
చిన్మయి: ఆ విషయం నాకు తెలియదు.. కానీ ఇంకొక విషయం సత్య ఆంటీ అమ్మకి చెల్లెలు. తన కోసమే దూరంగా ఉంటుంది. మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే సత్య ఆంటీ అంకుల్ కి దూరం అవుతుందేమో అని అమ్మ భయం
Also read: మాళవికతో యష్ పిక్నిక్ కి వెళ్ళడానికి ఒప్పుకున్న వేద- ధైర్యం చెప్పిన మాలిని
అప్పుడే ఆదిత్య రుక్మిణిని తన కారులో తీసుకుని వస్తాడు. అది ఇంటి పైనుంచి రామూర్తి చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ చూసి దేవి చాలా సంతోషిస్తుంది. దేవి వెళ్ళి తనని కౌగలించుకుంటుంది. బలవంతంగా ఆదిత్యని ఇంట్లోకి తీసుకొచ్చి హడావుడి చేస్తుంది. అప్పుడే వచ్చిన మాధవ్ వాళ్ళని చూసి రాధ, ఆదిత్య రోజు రోజుకి మరింత దగ్గర అవుతున్నారు ఏదో ఒకటి చేసి రాధని నా దాన్ని చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు. మా అమ్మ నీకు ఎక్కడ కనిపించిందని దేవి ఏం తెలియని దానిలా అడుగుతుంది. ఇంతకముందు నువ్వు ఎక్కడెక్కడో తిప్పావ్ కదా ఇప్పుడు టిప్పు సారు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని దేవి అంటుంది. ఇప్పుడు కాదమ్మా నేను మళ్ళీ వస్తాను చెప్తాడు. స్కూల్ దగ్గరకి వచ్చి కనిపించడం కాదు ఇంటికి రా నీతోనే స్కూల్ కి వస్తాను నీతోనే ఉంటాను అని దేవి చెప్పేసరికి ఏం అర్థం కాక ఆశ్చర్యపోతూ చూస్తారు.
సత్య రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరి ముందు త్యాగం చేసి ఇలా చాటుగా తిరగడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే దేవుడమ్మ వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఇంత బాధపడుతున్నా ఆదిత్యలో మార్పు రావడం లేదంటే మీ అక్క ఇక్కడే ఎక్కడో ఉందా అని అడుగుతుంది. అదేంటి ఎందుకు అలా అడుగుతున్నారు ఆ అనుమానం ఎందుకు వచ్చిందని సత్య తడబడుతూ అడుగుతుంది. ఆదిత్య తనని తాను మర్చిపోయి మరి తిరిగేది ఒక్క రుక్మిణి ఉన్నప్పుడు మాత్రమే.. ఇన్నేళ్ల తర్వాత వాడిలో ఆ మార్పు కనిపిస్తుందని దేవుడమ్మ అంటుంది. మా అక్క ఇక్కడ ఎందుకు ఉంటుందని సత్య అంటుంది. మరి మీ జీవితాల్లో ఎందుకు ఈ అలజడి, కొన్నాళ్ళు నీతో బాగానే ఉన్నాడు కదా ఉన్నట్టుండి ఇప్పుడేమైందని అడుగుతుంది.
Also read: తులసికి సామ్రాట్ సరైన భర్త అన్న పరంధామయ్య- అనసూయకి నూరిపోస్తున్న లాస్య
అప్పుడే ఆదిత్య ఇంటికి వస్తాడు. దేవుడమ్మ భోజనం చెయ్యమని అడిగినా ఆకలి లేదని వెళ్ళిపోతాడు. వెనుకాలే సత్య కూడా వస్తుంది. ఆదిత్య దేవి దగ్గరకి రావడం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉంటాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని సత్య కోపంగా అడుగుతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా వేరే వాళ్ళ భార్యతో దీపాలు వెలిగించడం ఏంటి అని నిలదీస్తుంది. కానీ ఆదిత్య మాత్రం అసలు అవేమీ పట్టించుకోడు. దేవి రుక్మిణి, ఆదిత్య గురించి ఆలోచిస్తుంది. వాళ్ళని ఎలాగైనా కలపాలని చిన్మయితో అంటుంది.