గోవిందరాజులు ట్యాబ్లెట్స్ తీసుకువస్తానని అంటుంది జానకి కానీ డబ్బులు లేక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విష్ణు బయటకి వెళ్తుంటే జానకి పిలిచి మందులు తీసుకువస్తావా లేదంటే డబ్బులు ఉంటే ఇవ్వవా అని అడుగుతుంది. విష్ణు నీళ్ళు నములుతుంటే మల్లిక వచ్చి మీ దగ్గర లేని డబ్బులు మా దగ్గర ఎలా ఉంటాయని అంటుంది.
జానకి: ఉమ్మడిలో పెట్టుకున్న షాపు ఉంది కదా, మా దగ్గర లేకపోయినా మీ దగ్గర లేకుండా ఎలా ఉంటాయి
మల్లిక: పేరుకు పెద్ద షాపు అయినా ఆదాయం లేదు, ఇప్పుడు అసలు షాప్ లేదు
జ్ఞానంబ: షాపు లేకపోవడం ఏంటి
విష్ణు: షాపు లేదమ్మా. మా ఫ్రెండ్ షాపు అని పెట్టుకున్నా, వ్యాపారం పెంచుకోవాలని వాడి దగ్గర అప్పు తీసుకుని షాపు కోసం ఖర్చు చేశాను
గోవిందరాజులు: అప్పు చేసి ఖర్చు చేసిన షాపు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది
Also Read: దివ్య మీద ఫైర్ అయిన తులసి- అంకిత, శ్రుతి మధ్య చిచ్చు పెట్టిన లాస్య
విష్ణు: అలా చేసిన ఆదాయం పెరగలేదు, అప్పులే మిగిలాయి చివరికి షాపు వాడికి దాన్ని ఇచ్చేయాల్సి వచ్చింది, లేదంటే మనం డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే షాపు ఇచ్చేశాను
మల్లిక: అందుకే ముందే విషయం చెప్పమని చెప్పాను పరిస్థితి ఇది, అందుకే వేరుగా వెళ్దామని అనుకున్నా మీరు ఒప్పుకోలేదు
జ్ఞానంబ: అడిగేదాక ఎందుకు చెప్పలేదని అంటుంది. కానీ మల్లిక మాత్రం మాట దాటేసి వెళ్ళిపోతుంది. తన మాటలకి జ్ఞానంబ బాధపడుతుంది. మాట మారింది, మనషులు మారుతున్నారని గోవిందరాజులు అంటాడు. రామా పని కోసం అందరి దగ్గరకి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. అటు జానకి మందులు ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రామా పని కోసం రోడ్డు మీద వెళ్తుంటే ఒకతను క్యాటరింగ్ ఆర్డర్ ఉందని పనోళ్ళు దొరకలేదని అంటుంటే తనకి ఆ పని ఇప్పించమని అడుగుతాడు. జ్ఞానంబ కొడుకుని అని చెప్పడంతో అతను పని ఇస్తాడు. అడ్వాన్స్ గా కొంత డబ్బు కూడా ఇస్తాడు. అటు జానకి కూడా పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక స్కూల్ కి వెళ్ళి ఉద్యోగం కావాలని అడుగుతుంది.
Also Read: భ్రమరాంబిక కాళ్ళ దగ్గర మాళవిక, ఘోరమైన అవమానం- ఇంటికి చేరుకున్న వేద, యష్
ఎక్స్ పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా అని ఆ స్కూల్ ప్రిన్సిపల్ అడుగుతుంది. ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని వచ్చి చేరమని ప్రిన్సిపల్ చెప్తుంది. స్కూల్ నుంచి బయటకి రాగానే రామా కూడా వస్తాడు. తనకి ఉద్యోగం దొరికిందని జానకి చెప్తుంది. చిన్న చిన్న సమస్యల కోసం లక్ష్యం వదిలేస్తే ఎలా అని రామా అంటాడు. జానకి మాత్రం లక్ష్యం వదిలేయను అని కానీ డబ్బు కోసం ఉద్యోగం చేయాలి కదా అంటుంది. విష్ణు తండ్రి మందులకి కూడా డబ్బులు లేవని బాధపడుతున్నారని అంటే మల్లిక మాత్రం ఒప్పుకోదు. ముందు ఈ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాలి, మన దగ్గర ఉన్న డబ్బుతో షాపు పెట్టుకుందామని మల్లిక సలహా ఇస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఇంట్లో నుంచి బయట పడేందుకు తనదగ్గర ప్లాన్ ఉందని చెప్తుంది.
అఖిల్ ఇంటి బాధ్యతలు పట్టకుండా ఫోన్ లో గేమ్ ఆదుకోవడం చూసి జెస్సి సీరియస్ అవుతుంది. నచ్చిన జాబ్ కోసం ఖాళీగా కూర్చోవడం కాదు ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని, నలుగురు నచ్చేలా ఉండాలి ఇలా కాదని జెస్సి తిడుతుంది. అప్పుడే చికిత వచ్చి జెస్సి వాళ్ళ తండ్రి వచ్చినట్టు చెప్తుంది.