వేద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి తలుచుకుని రాజా, రాణి చాలా బాధపడతారు. వాళ్లిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, మన కోసం వాళ్ళు నటించారు కానీ ఆ నటనలో ఉన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ముందున్న కాలం ఆ నటనలో నుంచి వాళ్ళని బయటకి తీసి ముందుకు నడిపిస్తుంది. త్వరలోనే వాళ్ళ ఒక్కటి అవుతారు. సులోచన వాళ్ళకి ఇప్పుడే నిజం చెప్పొద్దు అని రాజా అంటాడు. ప్రేమ బంధంతో ఒక్కటి అవుదామని వచ్చాము కానీ ఒప్పందంమే తప్ప మా మధ్య ఏ బంధం ఏర్పడలేదు. ఇన్ని రోజులు భర్తగా ప్రవర్తించి చివరికి నటన అన్నారు. నేను ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఎక్కడికి ఈ ప్రయాణం కలిసి ప్రయాణం చేస్తున్నామా, విడివిడిగానా? ఆయన మనసులో నేను లేనా అని వేద మనసులో అనుకుంటుంది.


Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసుని ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి


యష్ కూడా “వేద మనసులో నిజంగా నేను ఉన్నానా? భార్యగా నాతో జీవితం పంచుకోవడానికి నాతో రెడీగా ఉందా? ఎలా తెలుసుకోవాలి” అని అనుకుంటాడు. మాళవిక తన ఫేస్ కి పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయ్ అని ట్రీట్మెంట్ గురించి డాక్టర్ తో మాట్లాడుతుంటే భ్రమరాంబిక వస్తుంది. తన కాళ్ళకి నెయిల్ పాలిష్ వేయమని అడుగుతుంది. చేతులు అనుకుని మాళవిక వేయబోతుంటే చేతులు కాదు కాళ్ళు అని ఇస్తుంది. మాళవిక తన కాళ్ళ దగ్గర కూర్చుని నెయిల్ పాలిష్ వేస్తుంది. ఫోన్ మాట్లాడుతున్నట్టు మాళవికకి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. నా దగ్గర పని చేయాలంటే ఫ్రెష్ గా ఉండాలి. ఇద్దరి పిల్లల తల్లి పాత డొక్కు అయినట్టు నా దగ్గర పని చేయడానికి వీల్లేదు అని అంటుంది.


మాళవిక తన కాళ్ళ దగ్గర ఉండటం చూసి పెంపుడు కుక్క గుర్తుకు వస్తుంది, దాన్ని కూడా నేను బంగారం అని పిలుస్తాను అని దారుణంగా అవమానిస్తుంది. ఇంటి దగ్గర యష్, వేద వాళ్ళ కోసం మాలిని, సులోచన ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపు సులోచన, మాలిని మధ్య గొడవ మొదలవుతుంది. వేదకారులో నిద్రపోతుంటే యష్ తనని చూస్తూ ఉండిపోతాడు. ఎంతో సంతోషంగా వెళ్ళాం, ఏదో వెలితిగా తిరిగి వెళ్తున్నాం అని యష్ అనుకుంటాడు. ఇంట్లో అందరూ మనం హ్యపీగా తిరిగొస్తున్నాం అని ఆశపడుతున్నారు, మనం ఖుషికి తల్లిదండ్రులుగా బయల్దేరాం అలాగే తిరిగొస్తున్నాం వాళ్ళు ఏవేవో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటున్నారు మనం వెళ్ళినట్టుగానే తిరిగి వస్తున్నాం అనే విషయం తెలియనివ్వద్దు అని అక్కడ నటన చేసినట్టు ఇక్కడ కూడా నటిద్దాం అని అంటాడు. ఆ మాటకి వేద చాలా బాధపడుతుంది.


Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప


మీరు అన్ని సార్లు చెప్పాలా నాకు తెలియదా నేను ఏది చేసిన ఖుషి సంతోషం కోసం చేస్తాను మీరు చెప్పాల్సిన అవసరం లేదని వేద యష్ తో కోపంగా అంటుంది. . యష్ వేద మాటలకి బాధపడతాడు. కోపంగా వెళ్ళి కారులో కూర్చుని రండి కొత్త డ్రామాకి టైమ్ అయ్యింది, మన యాక్టింగ్ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారని అంటుంది.