తులసికి సామ్రాట్ అమెరికాకి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ అప్పగించడంతో ఇంగ్లీషు నేర్చుకునేందుకు తిప్పలు పడుతుంది. దీంతో బుక్స్ షాపుకి వెళ్ళి ఇంగ్లీషు నేర్చుకోవడానికి పుస్తకాలు కావాలని అడుగుతుంది. వారం నుంచి నెలరోజుల్లో ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాలు కొని ఇంటికి వస్తుంది. వాటిని పరంధామయ్య చూస్తాడు. అమెరికా ప్రాజెక్ట్ కి సంబంధించి వాళ్ళతో మాట్లాడటానికి ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకుంటున్నట్టు చెప్తుంది ఆ మాటలు విని శ్రుతి తను నేర్పిస్తాను అని అంటుంది. అప్పుడే అంకిత వచ్చి లోకల్ ఇంగ్లీషు పనికిరాదు, అమెరికా ఇంగ్లీషు కావాలని అంటుంది. కాన్వెంట్ లో చదువుకున్న నేను ఉన్నా కదా నేను నేర్పిస్తాను అని అంటుంది.


Also Read: భ్రమరాంబిక కాళ్ళ దగ్గర మాళవిక, ఘోరమైన అవమానం- ఇంటికి చేరుకున్న వేద, యష్


లాస్య ఆ మాటలు విని అంటే శ్రుతిడి బట్లర్  ఇంగ్లీషు అంటావా? అదేంటి అంత మాట అనేశావ్ అని మంట పెట్టేస్తుంది. ఆ మాటకి శ్రుతి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా చేశారని అంకిత లాస్యని అంటుంది. శ్రుతి అలా పట్టించుకునే మనిషి కాదు అని తులసి అంతే పైకి చెప్పకపోయినా మొహం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయిందని పరంధామయ్య అంటాడు. తాను పెట్టిన చిచ్చు బాగానే రగులుకుందని లాస్య మనసులో సంబరపడుతుంది. శ్రుతి బాధపడుతూ ఉంటే తులసి వచ్చి మాట్లాడుతుంది. అంకిత కూడా శ్రుతికి సోరి చెప్పడానికి వస్తుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నిన్ను చెల్లెలు అనుకుంటాను, అలాంటప్పుడు నిన్ను ఎందుకు బాధపెట్టాలని చూస్తాను అని అంకిత అంటుంది. అప్పుడే ప్రేమ్ శ్రుతికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు. దాన్ని తీసుకురావడం కాదు తమ కళ్ళ ముందే తినిపించమని అంటారు.


ప్రేమ్ ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసేసారికి అది లస్సీ అని తెలియడంతో శ్రుతి నవ్వుతుంది. అనసూయ, పరంధామయ్యకి లాస్యకాఫీ పెట్టుకుని తీసుకొస్తుంది. లాస్య చేసింది తాగాలంటే పరంధామయ్య భయపడతాడు. అది చండాలంగా ఉండటంతో మొహం అసహ్యంగా పెట్టి బాగానే ఉందని పైకి చెప్తాడు. అది తాగలేక పక్కన పెట్టేస్తాడు. తులసి పూజ చేసి హారతి తీసుకొస్తుంది. ఇంట్లో అందరూ తీసుకుని నందు కూడా తీసుకోబోతుంటే లాస్య ఆపుతుంది. భార్య చేత్తోనే ఇస్తేనే కదా హారతి తీసుకోవాలి అని అంటుంది. నందు బయటకి వెళ్లబోతుంటే ఎక్కడికి బయల్దేరావ్ అని అడిగేస్తుంది. నందు వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు, భార్య ఎదురు వస్తే మంచి జరుగుతుందని లాస్య అంటుంది.


Also Read: రిషి నిర్ణయం విని షాకైన దేవయాని- వసుని ప్రేమని అంగీకరించి పెళ్లిచేసుకోమన్న చక్రపాణి


నందు ఉద్యోగం కోసం వెళ్తుంటే లాస్య ఎదురు వచ్చి చిలిపిగా బుగ్గ గిల్లుతుంది. అది చూసి ఇంట్లో అందరూ నవ్వుతారు. తులసి హడావుడిగా ఆఫీసుకి వెళ్తుంటే దివ్య వచ్చి తన ల్యాప్ టాప్ బాగోలేదని అంటుంది. కొత్త ల్యాప్ టాప్ కావాలని అడుగుతుంది. తన పరీక్షల కోసం కొత్త ల్యాప్ టాప్ కావాలని అంటుంది. ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అని తులసి అంటుంది. సామ్రాట్ అంకుల్ కి ఫోన్ చేసి ల్యాప్ టాప్ కావాలని అడుగుతా అనేసరికి తులసి సీరియస్ అవుతుంది. స్వార్థం కోసం ఫ్రెండ్షిప్ వాడుకోకూడదు అని తిడుతుంది. ఇప్పటికిప్పుడు ల్యాప్ టాప్ అంటే కుదరదు తర్వాత చూస్తానులే అని తులసి కోపంగా చెప్తుంది. ఇదే అవకాశంగా చూసుకుని లాస్య వచ్చి తులసిని మాటలు అంటుంది. దివ్యని తనవైపుకి తిప్పుకోవాలని లాస్య స్కెచ్ వేస్తుంది.