జానకి ఇచ్చిన కాఫీ జ్ఞానంబ తాగుతూ ఉంటుంది. పక్కనే దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఇన్ డైరెక్ట్ గా జ్ఞానంబతో మాట్లాడుతుంది. వ్యాపారానికి వెళ్తు జ్ఞానంబ కూర్చున్న చోట మొక్కి ఆశీర్వాదం తీసుకుని రామా దగ్గరకి వెళ్తుంది. బండితో పాటు మీరు ఎందుకు కాలేజీకి ఆటోలో వెళ్ళవచ్చు కదా అని అంటాడు. కానీ జానకి మాత్రం రామా వెనుకే వస్తానని అంటుంది. వాళ్ళ మాటలు విని జ్ఞానంబ మురిసిపోతుంది. కొడుకు కోడలు ప్రేమ చాటుగా చూసి సంబరపడుతున్నావా అని గోవిందరాజులు అంటాడు. గుడికి వెళ్ళడానికి బయల్దేరుతూ మల్లికని పిలవమని గోవిందరాజులు వెన్నెలని పిలుస్తాడు. కానీ మల్లిక వదిన గుడికి వెళ్లిపోయిందని వెన్నెల చెప్పేసరికి కాసేపు ఇద్దరు కోడళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తాడు.
Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్
మల్లిక విష్ణుతో బట్టల వ్యాపారం పెట్టిస్తుంది. దాచుకున్న డబ్బుతో ఎలాగో వ్యాపారం మొదలు పెట్టామని మల్లిక సంతోషపడుతుంది. ఈ విషయం ఎక్కడ ఇంట్లో తెలుస్తుందోనని విష్ణు టెన్షన్ పడుతూ ఉంటాడు. షాపు పెట్టిన విషయం ఇంట్లో తెలియకూడదని తిడుతుంది. షాపులో ఉన్న పని వాడి మీద అజమాయిషీ చేస్తూ ఉంటుంది మల్లిక. సరిగా జానకి వాళ్ళు బండి తోసుకుంటూ వచ్చి మల్లిక వాళ్ళ షాపు ముందు ఆగుతారు. తనని చూసి జానకి రామాకి చెప్తుంది. గుడికి వెళ్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చింది ఏంటని లోపలికి వెళతారు. కొత్త షాపులో ఓనర్ గా కూర్చోబోతున్నా అని మల్లిక అనుకుంటూ ఉండగా జానకి వాళ్ళు వస్తారు. ఇద్దరూ ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతుంది.
షాపు తెలిసిన వాళ్ళది అయితే అని మల్లిక అబద్ధం చెప్తుంది. షాపు వీళ్ళదే కదా అమ్మగారు అబద్ధం చెప్తున్నారేంటని అక్కడ పని చేసే అతను అనుకుంటాడు. గుడికి వచ్చిన జ్ఞానంబ వాళ్ళు అమ్మవారికి జాకెట్ ముక్క పెట్టాలని కొనడానికి మల్లిక షాపుకే వస్తారు. వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. గుడికి వెళ్లామని చెప్పారు ఇక్కడేం చేస్తున్నారని గోవిందరాజులు అడుగుతాడు. ఇది మన షాపు నాన్న అని విష్ణు నోరు జారతాడు. మల్లిక విష్ణు వాళ్ళ ఫ్రెండ్ ది అని కవర్ చేస్తుంది. ఎక్కడో పని చేయడం ఎందుకని ఫ్రెండ్ షాపులోనే పని చేయడం మంచిదని చెప్పాను అని మల్లిక అబద్దం చెప్తుంది. షాపులో పని చేసే అతన్ని యాజమానిగా చూపిస్తుంది. కౌంటర్ లో కూర్చున్న అతను విష్ణుని పనివాడిలా ట్రీట్ చేస్తాడు.
Also Read: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్
జాకెట్ ముక్క తీసుకుని ఎంత అని జ్ఞానంబ అడుగుతుంది. డబ్బులు వద్దులేమ్మ అని విష్ణు అంటాడు. షాపు తొలి బోణీ తల్లి చేసినందుకు విష్ణు ఆనందపడతాడు. వ్యాపారం బాగా చేసుకోమని జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది. అఖిల్ జెస్సి వాళ్ళ నాన్న దగ్గరకి వస్తాడు. చదువుకి తగిన ఉద్యోగం వస్తే బాగుపడతానులే అని అఖిల్ పొగరుగా మాట్లాడతాడు. ఉద్యోగం ఆఫర్ లెటర్ ని పీటర్ అఖిల్ కి ఇస్తాడు. తాళి కట్టిన భార్య కోసం ఏమైనా చేస్తావేమో అనుకున్నా కానీ నువ్వు అలా చెయ్యలేదు. అందుకే నేనే ప్రయత్నం చేశాను. రేపే వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అవమని చెప్తాడు. ఇంట్లో సోమరిపోతు అనిపించుకోవడం కంటే ఇక్కడ మావయ్య ముందు తన మాట విన్నట్టు నటించడం బెటర్ అనుకుని అఖిల్ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటాడు.