రామ డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జానకి వచ్చి కిడ్నీ ఇస్తాను కదా ఇంకెందుకు టెన్షన్ అని అంటుంది.  చిన్నప్పటి నుంచి ఆశపడిన కల గురించి ఆలోచించమని చెప్తాడు. మీ లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నారు, అమ్మని కాపాడుకోవాలి దాతలు ఇస్తారేమో చూద్దామని అంటాడు. ఏ నిర్ణయం తీసుకోవద్దని ఏదో ఒక ప్రయత్నం చేస్తానని అంటాడు. అమ్మతో పాటు మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అవడం ముఖ్యంఅని ముందు ఎగ్జామ్స్ బాగా రాయమని చెప్తాడు. జానకి చదువుకుంటూ ఉంటుంది. కానీ రామ మాత్రం తల్లి గురించి ఆలోచిస్తూ బాధపడటం జ్ఞానంబ దంపతులు చూస్తారు. అసలు ఏమైంది దేని గురించి ఇంకా బాధపడుతున్నాడని గోవిందరాజులు వాళ్ళు అనుకుంటారు.


Also Read: రాజ్ కంట పడకుండా తప్పించుకున్న కావ్య- చెల్లెళ్ళని దగ్గరకి తీసుకుని ఎమోషనల్ అయిన స్వప్న


రామ దగ్గరకి గోవిందరాజులు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఎందుకు ఇలా ఒంటరిగా వచ్చి కూర్చుంటున్నావ్ ఏమైందని అంటాడు కానీ రామ మాత్రం ఏమి లేదని చెప్తాడు. జ్ఞానంబ చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటే చేయనివ్వమని మలయాళం అంటాడు. అది విని జానకి సీరియస్ అవుతుంది. అత్తయ్య పని చేయకూడదు, అలా చూసుకోవాలి లేదంటే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపో అని సీరియస్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైందని అలా తిడుతున్నావ్ అని వెన్నెల అంటుంది. జానకి మాటలు విని గోవిందరాజులు, జ్ఞానంబ అనుమానపడతారు. ఎప్పుడు లేనిది జానకి ఎందుకు అంత కోపంగా అరుస్తుందని అనుకుంటారు. అసలు రాముడు, జానకి కి ఏమైందని అనుకుంటారు.


జ్ఞానంబ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తూ ఉంటుంది. ఓ వైపు ఇంటి పనులు చేస్తూనే చదువుకుంటూ ఉంటుంది. జ్ఞానంబ పని చేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంటే జానకి, రామ వచ్చి పట్టుకుంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. జానకి ఎగ్జామ్ కి వెళ్తు హడావుడిల్లో హాల్ టికెట్ మర్చిపోయి వెళ్తుంటే జెస్సి ఆపి ఇస్తుంది. హాల్ టికెట్ మర్చిపోయేంతగా ఏం ఆలోచిస్తున్నావ్ అని అంటుంది. ఏమి లేదని చెప్పి జానకి వెళ్ళిపోతుంది. తండ్రి ఇచ్చిన పెన్నుతో జానకి పరీక్ష రాస్తుంది. జ్ఞానంబకి మళ్ళీ నడుము నొప్పి వచ్చి బాధపడుతుంటే గోవిందరాజులు కంగారుపడతాడు. రోజు రోజుకీ నీరసించి పోతున్నావ్ జానకి ఇచ్చిన మందులు వాడమని చెప్తాడు. అసలు ఆ మందులు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు ఇస్తున్నారు వెంటనే తెలుసుకోవాలని జ్ఞానంబ అనుకుంటుంది.


Also Read: వసు గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్స్- ఊహించని నిర్ణయం తీసుకున్న రిషి


జానకి పరీక్ష రాసి ఇంటికి వచ్చేసరికి జ్ఞానంబ హాస్పిటల్ కి వెళ్ళిందని వెన్నెల చెప్తుంది. దీంతో జానకి కంగారుగా డాక్టర్స్ నిజం చెప్తారో అని హడావుడిగా వెళ్ళిపోతుంది. రామ జానకికి ఫోన్ చేసి పరీక్ష బాగా రాశారా అని అడుగుతాడు. జ్ఞానంబ డాక్టర్ ని వచ్చి కలుస్తుంది. తన ఆరోగ్య పరిస్థితి ఏంటని డాక్టర్ ని అడుగుతుంది. డాక్టర్ అబద్ధం చెప్తుంటే తనకి అంతా తెలుసని జ్ఞానంబ చెప్తుంది. మీ కోడలు చెప్పొద్దని అన్నది అనేసరికి అంటే చెప్పొద్దన్న నా కోడలే చెప్పింది వివరంగా తెలుసుకుందామని వచ్చాను జ్ఞానంబ అంటుంది. దీంతో డాక్టర్ ప్రాణం పోతుందని తెలిసినా.. అనేసరికి జ్ఞానంబ షాక్ అవుతుంది.