మల్లిక చెప్పినట్టుగా విష్ణు బిర్యానీ తీసుకొస్తాడు. దాన్ని తింటూ మల్లిక పోలేరమ్మని తిట్టుకుంటుంది. అప్పుడే తనకి పొలమారడంతో మంచి నీళ్ళు తెమ్మని విష్ణు తిడుతుంది. కంగారుగా వాటర్ తీసుకెళ్తుంటే గోవిందరాజులు ఏమైందని అడుగుతాడు. మల్లిక తింటుంటే పొలమారిందని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు. అదేంటి జ్ఞానం ఇందాక మల్లికని తినమంటే ఈరోజు ఉపవాసం అని చెప్పి తినకుండా ఉంది కదా మరి ఇప్పుడు గదిలో తినడం ఏంటి అని డౌట్ పడతాడు. ఒకవేళ తినలనుకుంటే డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా చూస్తుంటే ఏదో మతలబు ఉందని అనిపిస్తుండ అనుమానపడతాడు గోవిందరాజులు. దీంతో జ్ఞానంబ మల్లిక గదికి వెళ్ళి చూస్తుంది. మల్లిక పీకల దాకా తినడం జ్ఞానాంబ వస్తుంది. అది గమనించుకోకుండా మల్లిక తిండి తింటూ ఆమెని తిడుతుంది. ఆమెకి భయపడే రోజులు మారాయి, చిన్న కోడలి తిరుగుబాటు మొదలైంది, సింహాన్ని టచ్ చేస్తే వైలెంట్ గా ఉంటుంది. చిన్న కోడలిని టచ్ చేసినా అలాగే ఉంటుంది. అది ఈరోజు నుంచే మొదలైందని వాగుతూ ఉంటుంది. అప్పుడే గుమ్మం దగ్గర జ్ఞానంబ వాళ్ళని చూసి మల్లిక షాక్ అవుతుంది.
నీకు అసలు బుద్ది ఉందా? ఈ ఇంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఆన్ లెక్క ఉందా? ఈ ఇంట్లో మాంసం ముట్టరని పెళ్లి అయిన రోజే చెప్పాను కదా. నీ ఇష్టాన్ని చంపుకోకుండా బయట తినమని చెప్పాను కదా. నీకు అంతగా తినాలని అనిపిస్త బయటకి వెళ్ళి తినొచ్చు కదా ఇంట్లో ఎందుకు ఈ సంత పెట్టావ్ అని చడామదా తిట్టేస్తుంది. నేను బయటే తింటాను అన్నాను కానీ మీ అబ్బాయి ఇంటికి తీసుకొచ్చాడని చెప్పి విష్ణుని ఇరికిస్తుంది. ఇక జ్ఞానంబ గుర్రుగా విష్ణు వైపు చూస్తుంది. నిజమెంటో అత్తయ్యగారికి చెప్పండి అనేసరికి అంటే అమ్మా అది బయట హోటల్ లో తింటే అందరు చూస్తారని విష్ణు నసుగుతాడు. భలే కవర్ చేస్తున్నావ్ ర ఇద్దరు టో దొంగలే అని గోవిందరాజులు అంటాడు. తెలిసో తెలియకే తప్పు చేశాం కాబట్టి ఏదో ఒక శిక్ష వెయ్యండి అని మల్లిక అడుగుతుంది. అవునా యాయితే మీరిద్దరు ఇంట్లో తిండి తినకండి అని జ్ఞానం చెప్తుంది. ఏంటో ఈవిడ పిచ్చి శిక్ష ఇంట్లో తినకపోతే బయటకి వెళ్ళి తినమా ఏంటి అని మన అనుకుంటుంది. ఇంట్లో తినకండి బయట తినమని చెప్పాను కదా మీరిద్దరు ఈ రెండు రోజులు ఇల్లు దాటాడానికి వీల్లేదని జ్ఞానంబ ఆర్డర్ వేస్తుంది.
ఈ చికెన్ ఎంత పని చేసింది రా దేవుడా అని మల్లిక ఏడుస్తుంది. జానకి చదువుకుంటూ ఉంటే రామా తన కోసం బహుమతి పట్టుకుని వస్తాడు. జానకి చదువుకోవడం కోసం ఛార్జింగ్ లైట్ తీసుకుని వస్తాడు. అది చూసి జానకి మురిసిపోతుంది. మా ఆయన బంగారం అని మెచ్చుకుంటే మా ఆవిడ ఇంకా బంగారం అని రామా కూడా అంటాడు. జానకి రామాని కౌగలించుకోవడంతో టెంప్ట్ ఏయీ సమయం వృధా అయిపోతుంది మీరు చదువుకోండి అని అంటాడు. వెంటనే జానకి పుస్తకాలు మూసేస్తుంది. అదేంటి పుస్తకాలు మూసేస్తున్నారు ఏమైనా దుర్ముహూర్తం ఉందా అంటే కాదు ఇది భార్యాభర్తల ఏకాంత సమయం ఇది. అత్తయ్యగారు ఏం చెప్పారు భార్యభర్తల ఏకాంత సమయం అని చెప్పారు కదా మరి ఆ మాట వినాలి కదా అని జానకి అంటుంది.
Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?
రామాని గట్టిగా కౌగలించుకుని విడిచిపెట్టకుండా జానకి అలాగే ఉండిపోతుంది. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. జ్ఞానంబ జానకిని చూసి ముభావంగా ఉంటుంది. చూశావా ఇంటి పనులు విస్మరించొద్దని చెప్పావ్ జానకి చూడు ఇంటి పనులన్నీ చేసి అత్తమావ సేవలు కూడా చేస్తుంది నువ్వు అనవసరంగా భయపడి షరతులు పెట్టావని అంటాడు. అప్పుడే వెన్నెల జీన్స్ వేసుకుని కాలేజీ వెళ్తున్నా అనేసరికకి జ్ఞానంబ తిడుతుంది. ఆ బట్టలు ఏంటి వెళ్ళి మార్చుకో అని చెప్తుంది. జానకి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇక కోచింగ్ తీసుకోవడానికి వెళ్తూ జ్ఞానంబ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంది. టిఫిన్ మర్చిపోవడంతో చికితా తెచ్చి ఇస్తుంది. మొదటి రోజే టిఫిన్ మర్చిపోయావు చదవు ధ్యాసలో పడి ఇంకెన్ని మర్చిపోతావో భర్తని ఇంకెంత నిర్లక్ష్యం చేస్తావో అని నిష్టూరంగా అంటుంది. అలా ఎందుకు అంటావు ఇంటి పనులు ఏదైనా మర్చిపోయిందా చెప్పు అని గోవిందరాజులు అనేసరికి జ్ఞానంబ సరే అని జానకిని కాలేజీలో చేర్పిస్తాను పదమని అంటుంది. పోలేరమ్మ వచ్చేలోపు రెండు రోజులకి సరిపడే తినేస్తానని మల్లిక అనుకుంటుంది. చికితా మల్లికని రెండు రోజులు తీనొద్దని చెప్పాను చూస్తూ ఉండమని జ్ఞానంబ చెప్తుంది.