Jio 2999 Independence Plan 2022: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేకంగా '2999 ఇండిపెండెన్స్ ఆఫర్ 2022' రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం రీచార్జ్ చేసిన వినియోగదారులు అంతే విలువైన అంటే 3000 రూపాయల విలువైన ఓచర్లను పొందనున్నారు.
జియోకు చెందిన ప్రీ-పెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.2,999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 100 శాతం మనీ బ్యాక్ ఇస్తున్నట్‌టు జియో కంపెనీ ప్రకటించింది. జియో ప్రకటించిన ఈ ప్రత్యేక ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
మూడు కంపెనీల కూపన్లు అందుబాటులో ఉంటాయి
జియో ఈ ప్లాన్‌లో 75 GB డేటాతోపాటు, నెట్‌మెడ్స్(Netmeds), అజియో(AJIO), ఇక్సిగో (Ixigo) రీడీమ్ కూపన్లు కూడా ఇస్తోంది. రీఛార్జ్ చేసిన 72 గంటల్లోపు ఈ కూపన్‌లు మై జియో(My Jio) యాప్‌లో క్రెడిట్ అవుతాయి. ఈ ప్లాన్‌లో మీరు 75 GB డేటా వోచర్‌ను కూడా పొందుతారు. మీరు దీన్ని మీకు కావలసినప్పుడు ఉపయోగించవచ్చు. ఈ ఆఫర్ కింద, నెట్‌మెడ్ మూడు కూపన్లు 25 శాతం తగ్గింపుతో ఇస్తున్నారు. ఈ కూపన్ సహాయంతో మీరు రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
కూపన్ సమాచారం మరింత వివరంగా
నెట్‌మెడ్ (Netmeds) కూపన్ 9 ఆగస్టు నుంచి 31 అక్టోబర్ వరకు చెల్లుబాటు అవుతుంది. ఇక్సిగో కూపన్స్‌తో రూ.750 వరకు తగ్గింపు ఉంటుంది. మీరు ఈ సైట్ నుంచి రూ. 4,500 లేదా అంతకంటే ఎక్కువ విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే మీకు రూ. 750 ఆఫర్ లభిస్తుంది. ఇది కాకుండా అజియో(Ajio) రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.
జియో రూ. 2,999 ప్లాన్ ప్రయోజనాలు చూస్తే దీంట్లో ప్రతిరోజూ 2.5 GB డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్(SMS)లు కాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తున్నారు. ఇది కాకుండా, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఒక సంవత్సరం పాటు ఫ్రీగా లభిస్తాయి. దీంతోపాటు 75 జీబీ అదనపు డేటా కూడా అందిస్తున్నట్టు జియో ఓ ప్రటనలో తెలిపింది.
రాఖీపౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు వైవిద్యంగా శుభాకాంక్షలు చెప్పిందీ జీయో సంస్థ