ఏంటి రాధ నువ్వు దేవిని వాళ్ళ నాన్న దగ్గరకి చేర్చి సంతోషంగా ఉంచాలన్న నీ కోరిక తీర్చాలని నేను ఆరతపడుతుంటే అది నువ్వు అర్థం చేసుకోకుండా నా మీద కారు ఎక్కించాలని అనుకుంటే ఎలా చెప్పు అని మాధవ అంటాడు. ఎక్కించలేదుగా సంతోషించు ఇలాగే నాతో కథలు పడ్డావంటే ఏదో ఒకరోజు  నిజంగానే నీమీద కారు ఎక్కిస్తా అని వార్నింగ్ ఇస్తుంది. నీకు మర్యాద ఇస్తుంది ఎందుకో తెలుసా మీ అమ్మా నాన్న మొహం చూసి చిన్మయి ఎంత బాధపడుతుందో అని అది నువ్వు నిలబెట్టుకోవడం లేడని అంటుంది.


మాధవ: నేను కాదు నువ్వు ఆలోచించు ఎటు పోవాలో తెలియని స్థితిలో నీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు గుర్తుందా.. దీన్ని ఏమంటారో తెలుసా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం అంటారు.


రాధ: నా కష్టం చూసి గా పొద్దు ఏరు దాటడానికి సాయం చేశారు అనుకున్నా కానీ మీ స్వార్థం తెలిసినాక, నీ బుద్ధి అర్థం అయినక తెప్ప కాదు తెప్పని ఇడిచిపెట్టి నీలాంటి వాడిని తగలబెట్టినా తప్పులేదని అనిపిస్తుంది. నాకు మీరేం చేశారో  మీకు నేను ఏం చేశానో మాట్లాడుకోవడానికి ఏమి లేదు దాని గురించి మాట్లాడుకోడానికి కూడా గలిజ్ గా ఉంటది సారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరిని ఎవరికి దూరం చెయ్యాలని చూసినా నా పెనిమిటి కట్టినా ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నా నా బతుకు నా పెనిమిటి కోసమే. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నా పెనీమీటి ఆఫీసర్ సారె. అలా అని నా బతుకులోకి ఇంకోకళ్ళు వస్తే అది జరగడానికి ఒక్క క్షణం ముందైనా నా పానం తీసుకుంటా. ఇష్టం లేని బతుకు బతికే కంటే నిమ్మళంగా వెళ్ళి బొందలో పండుకుంటా. మళ్ళీ మళ్ళీ చెప్పాను ఇదే చివరి సారి.


మాధవ: కొన్ని బలమైన అభిప్రాయలు కూడా కొన్ని సమయాల్లో మార్చుకోక తప్పదు. వద్దు వద్దు అన్నా నేను ఇప్పటి వరకు నీ బతుకులోకి రాకున్నా ఊరందరి దృషిలో మనం ఇద్దరం ఒక్కటి. కడిగితే శరీరానికి ఉన్న మలినం పోతుంది కానీ ఏం చేసినా మనసులో ఉన్న ఆలోచన ఎప్పటికీ పోదు. అది ఎందుకు అంటావా నువ్వు నా భార్య అన్న ముద్ర. అది ఎప్పటికీ పోదు అనేసి వెళ్ళిపోతాడు.


స్కూల్ లో ఒక పిల్ల ఇంకొక అమ్మాయితో మాట్లాడటం దేవి వింటుంది. నీతో వచ్చిన ఆయనమీ డాడీ కాదంట కదా అని అడిగితే అవును మా డాడీ మంచోడు కాదు అందుకే అక్కడ ఉంటున్నాం అందులో తప్పేముందని అంటుంది. మా డాడీ కూడా మంచోడు కాదు అందుకని మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నామా అది తప్పు అని మరొక పిల్ల చెప్తుంది. ఈ మాటలన్నీ దేవి వింటుంది. గతంలో జరిగిన ఈ సంఘటన దేవి గుర్తు చేసుకుంటుంది. రేపు మా నాయన గురించి తెలిస్తే ఇలాగే మాట్లాడుకుంటారేమో దోస్త్ ల ముందు నా పరువు తీస్తారేమో. నేను మా నాయన చేసిన పనికి మాటలు పాడాలేమో. మా నాయన ఎవరో తెలియకే కదా ఈ పరిస్థితి. మా నాయన ఎవరో ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి, ఎలాగైనా తెలుసుకుంటా అని దేవి అనుకుంటుంది.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


సత్య మాధవ మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంది. బయట పడుకోవడానికి సత్య వెళ్తుంటే ఆదిత్య ఎదురు పడతాడు. మనుషుల మధ్య మాటలు తప్ప మనసులు కాలవనప్పుడు ఎక్కడ పడుకున్నా ఒక్కటే కదా అని అంటుంది. ఏంటి సత్య కొత్తగా మాట్లాడుతున్నావ్ లోపల పడుకో అని అంటాడు. నువ్వు ఈ మాట ఎందుకు అంటున్నావో నాకు తెలుసు నేను బయట పడుకుంటే ఆంటీ చూసి మన మధ్య ఏదో జరుగుతుందని అనుకుంటదని భయం అంతేగా అని సత్య అంటుంది. ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు ఆదిత్య నీ మనసులో నా స్థానం ఏంటి అని అడుగుతుంది. నీ స్థానం భార్య స్థానం అని కొత్తగా చెప్పాలా అని ఆదిత్య అంటే “నాకు అలా అనిపించడం లేదు నువ్వు నా భర్త అనుకున్నా కాబట్టి నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పాలని అనిపిస్తుంది. నీ మనసులో నాది భార్య స్థానం అని నీకు అనిపిస్తే మరి నీ మనసులో బాధ ఎందుకు నాతో పంచుకోవడం లేదు, ఏం నేను అడగాలా, నీ కష్టం సుఖం నేనే అయితే నాతో కాక ఎవరితో పంచుకుంటావ్. నేను మనిషినే నాకు ఎమోషన్స్ ఉంటాయి. ఈ దూరాన్ని మౌనాన్ని ఎన్ని రోజులు భరించగలను. పక్కనే మనిషి ఉన్నా ఈ దూరాన్ని మౌనాన్ని పాటించడం నరకం. ఆ నరకాన్ని నేను భరించలేకపోతున్నా” అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది.


దేవి నా కూతురుగా ఈ ఇంటి గడప తొక్కే వరకు నేనేమీ చెప్పుకోలేను సత్య అని ఆదిత్య మథనపడతాడు. దేవి తండ్రి గురించి నిద్రలో కలవరిస్తూ నాయనా అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి దేవమ్మా ఏయమైంది ఎందుకు అలా అరిచావ్ అని రాధ కంగారుగా అడుగుతుంది. మనల్ని వదిలిపెట్టి నాయన ఎందుకు ఇలా ఉంటున్నాడు. కళ్ళు మూసుకున్నా నాయనే గుర్తుకు వస్తున్నాడు. నాన్న ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు చెప్పు అని దేవి అడుగుతుంది. తెలవదు బిడ్డా.. మీ నాయన ఎక్కడ ఉన్నాడో తెలియకపోతే నేనేమీ చెప్తాను నువ్వు ఇలా నన్ను అడిగి అడిగి నన్ను బాధపెట్టకు అని ఏడుస్తుంది. నాన్న ఎక్కడ ఉన్నదో తెలియక మస్త్ బాధ అవుతుంది అందుకే అడిగాను నువ్వు ఇలా బాధపడకు నేను ఎప్పుడు నాయన గురించి అడగనులే అని దేవి అంటుంది. మాధవ సారు నీ మనసుని ఎంత విషం నింపాడు నా కండ్ల ముందు మీ నాయన్ని తిడుతుంటే తట్టుకోలేకపోతున్నా అని రుక్మిణి మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది.


Also Read: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ


దేవుడమ్మ పిల్లల బట్టలు, బొమ్మలు ముందు వేసుకుని వాటిని చూసుకుని సంబరపడుతుంది. ఏంటి దేవుడమ్మ ఎవరి కోసం ఈ బట్టలు ఎవరి కోసమని ఈశ్వర ప్రసాద్ అడుగుతాడు. దేవి మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూడగానే మన రుక్మిణి కూడా బిడ్డ ఉంది కదా అని గుర్తొచ్చింది అది కూడా దేవి వయసు ఉంటుంది కదా పుట్టింది బాబో పాప అనేది తెలియదు అందుకని ఇద్దరికీ సరిపోయే బట్టలు తెచ్చాను అంటుంది. ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా అని అడుగుతాడు. ఇక్కడ సత్య పిల్లల కోసం బాధపడుతుందని అంటాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది కనిపించని రుక్మిణి తన బిడ్డ కోసం కాదు ఇంట్లో ఉన్న మన బిడ్డ, సత్య గురించి. ఆదిత్య కారణంగా సత్య బాధపడుతుంటే నువ్వు వాడిని మందలించాల్సింది పోయి నువ్వు ఇక్కడ రుక్మిణి గురించి ఆలోచిస్తే ఎలా దేవుడమ్మా అని అంటాడు. వాడు పట్టించుకోక, నువ్వు పట్టించుకోక ఆ అమ్మాయి ఏమైపోవాలి అని ఈశ్వరప్రసాద్ చెప్తాడు.