ఏంటి తెగ ఆలోచిస్తున్నావ్ అని యష్ అడుగుతాడు. ఇంత అర్థరాత్రి దెయ్యం లాగా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావ్ అని అడుగుతాడు, ఏమి లేదని అంటుంది. నాకు తెలుసులే నువ్వు ఎందుకు నిద్రపోలేదో నీకేమో నిద్ర రావడం లేదు నేను హాయిగా నిద్రపోతున్నా అని టార్చర్ చేస్తున్నావ్ కదా అని వేదని అంటాడు. ఇద్దరూ కాసేపు కొట్లాడుకుంటారు. వేద లైట్ ఆపి వస్తుంటే కాలు జారి యష్ మీద పడిపోతుంది. నువ్వు ఏంటి ఏదైనా స్కెచ్ వేస్తున్నవా ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పు ముందే నేను వెళ్ళి హాల్ లో పడుకుంటాను అని అంటాడు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కాస్త తగ్గండి మీకు అంత సీన్ లేదని వేద అంటుంది. మరి ఎందుకు నాకు ఎప్పుడు కాలు జారదు, నువ్వే కాలు జారి పడతావ్ ఏంటి అని యష్ అంటాడు. బాబోయ్ మీకొక నమస్కారం వెళ్ళి పడుకోండి అని వేద అంటుంది.


ఖైలాష్ అభిమన్యుకి ఫోన్ చేస్తాడు. నేను తండ్రిని కాబోతున్నాను పొద్దునే మా కంచు వచ్చి చెప్పింది ఈ గుడ్ న్యూస్ చెప్పింది అది చెప్దామని ఫోన్ చేశాను అంటాడు. ఈ టైం లో ఫోన్ చేసి చెప్పడానికి కారణం ఏంటని అభి అడుగుతాడు. మనం మనం శత్రువులకి మిత్రులం శ్రేయోభిలాషులం ఇంత పెద్ద విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నాకు మాత్రమే చెప్పింది అర్థం చేసుకో బ్రో అని ఖైలాష్ ఫోన్ పెట్టేస్తాడు. తల్లి కాబోతున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మొగుడికి మాత్రమే మోసింది అంటే కాంచన మనసులో కోపం, ఆ ఇంట్లో వాళ్ళతో దూరం మనకి పనికొస్తాయి. భార్య కోసం అరెస్ట్ చేయించిన యష్ అక్క కడుపులోని బిడ్డ కోసం ఖైలాష్ ని విడిపిస్తాడా? అని మాళవిక అంటుంది. ఈ మొగుడు పెళ్ళాల్ని అడ్డం పెట్టుకుని యష్ వాళ్ళని ఒక ఆట ఆడుకుందామని అభి ఐడియా ఇస్తాడు. దీన్ని సంప్రదాయం బద్ధంగా నేను మొదలుపెడతాను అని మాళవిక అంటుంది.  


Also Read: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ


కారు దగ్గర యశోధర్ ని వేద ఆటపట్టించి నవ్వుతూ ఉంటే మాళవిక అక్కడికి వస్తుంది. ఏంటి మరి ఆరుబయట సరసాలా అని అంటుంది మాళవిక. నువ్వు చెప్తే వినే స్టేజ్ లో నేను లేనని యష్ కోపంగా చెప్తాడు. కంగ్రాట్స్ చెప్తుంది..  ఎందుకు అని యష్ అంటాడు. తెలుస్తుంది నీకు తనకి అందరికీ తెలుస్తుంది అని అంటుంది. నేను ఎందుకు వచ్చానో తెలుసుకోవాలని అనిపిస్తే నాతో పాటు రండి అని అంటుంది. కాంచన బాధగా ఉండటం చూసి మాలిని వచ్చి మాట్లాడుతుంది. ఇట్లా బాధపడితే ఎలా తిండి నిద్ర లేకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అని బాధపడుతుంది. నేను తినిపిస్తాను రామ్మా అని బతిమలాడుతుంది. చెప్తున్నారు కదా తిను కాంచన అని మాళవిక ఎంట్రీ ఇస్తుంది. కంగ్రాట్స్ కాంచన అంటుంది. నీ కండిషన్ కి టైం కి తింటేనే కదా బలం అని అంటుంది. నా గురించి నాకు తెలుసు నువ్వు చెప్తే వినే ఖర్మ నాకు పట్టలేదని కాంచన కోపంగా చెప్తుంది.


ఏయ్ ఈ ఇంటితో సంబంధం లేని మనిషివి మళ్ళీ ఏం గొడవ పెట్టడానికి వచ్చావని మాలిని తిడుతుంది. గొడవ పెట్టడానికి రాలేదు మలబార్ మాలిని గారు నా మాజీ ఆడపడుచుకీ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను అంటుంది. దేనికి అని మాలిని అడుగుతుంది. కాంచన చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి కంగ్రాట్స్ చెప్తుంది. ఈ టైం లో ప్రతి ఆడది భర్త భుజం మీద తల వాల్చి హాయిగా ఉండాలని అనిపిస్తుంది. కానీ ఏంటో ఈ ఘోరం. ఈ టైం లో పులుపు తినాలని అనిపిస్తుంది. కానీ ఏంటో నీ దురదృష్టం అవేమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నావ్ అని మాళవిక మాట్లాడుతూనే ఉంటుంది. చాలు ఆపుతావా అసలు ఎందుకు వచ్చావని రత్నం అంటాడు. ఏంటి కాంచన ఈ మంచి శుభవార్త ఇంట్లో చెప్పలేదా అని మాళవిక అంటే నీ నాటకాలు ఆపి ముందు బయటకి వెళ్ళు అని కాంచన కోపంగా చెప్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తెల్ల మొహాలు వేసుకుని నిలబడతారు. అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావని యష్ గట్టిగా అడుగుతాడు. కాంచన ప్రగ్నెంట్ అని మాళవిక చెప్తుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. ఇది నిజమా అని మాలిని, యష్ అడుగుతారు కానీ కాంచన మౌనంగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఇంత శుభ సమయంలో విషాదం ఏంటో తెలుసా ఈ విషయం మీకెవ్వరికి చెప్పకపోవడం.. మీ మీద ఎంత కోపం ద్వేషం కాకపోతే తను వెళ్ళి ఎక్కడో పోలీస్ స్టేషన్ లో ఉన్న భర్తకి చెప్తుంది అని మాళవిక మంట పెట్టేస్తుంది.


Also Read: తల్లి కాబోతున్న కాంచన- వేద మీద కోపంతో రగిలిపోతున్న మాలిని, బాధలో చిత్ర


మీ అక్క కడుపుతో ఉండి తన భర్త పక్కన లేడు అటు చూడు ఎలా ఏడుస్తుందో ముందు తన గురించి ఆలోచించకుండా ఎందుకు నా మీద అరుస్తావ్ అయినా మీ కుటుంబ విషయాలు నాకెందుకులే అని మాళవిక యష్ తో అంటుంది. ఇంట్లో నుంచి వెళ్తూ వెళ్తూ వేద దగ్గర ఆగి ఈ ఇంటి కోడలివి కదా పాపం మీ ఆడపడుచుకి తన భర్త తోడు కావలంట తన భర్తని తనకి తిరిగి ఇవొచ్చు కదా అని చిన్నగా చెప్తుంది.


తరువాయి భాగంలో..


అక్క అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. తనకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని అందరం అనుకున్నాం కానీ అక్క మాత్రం మాతో సంతోషంగా పంచుకోవాల్సిన విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పి సమస్యగా మార్చిందని యష్ బాధపడుతూ ఉంటాడు. ఖైలాష్ మీద ఉన్న కోపం మీ అక్క మనసులో మన మీద ద్వేషంగా మారింది అందుకే మనకన్నా భర్తే ఎక్కువ అయ్యాడని వేద అంటుంది. మేరేమి టెన్షన్ పడకండి ఒక్కొక్కటిగా అన్ని సర్దుకుంటాయ్ అని వేద చెప్తుంది.