Karthika Deepam Premi Viswanath  Vantalakka: కార్తీకదీపం సీరియల్‌లోకి వంటలక్క రీ ఎంట్రీ ఇస్తోందా..ఈ మాట వినగానే బుల్లితెర బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ కి పూనకాలొచ్చినట్టే. ఎందుకంటే వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్ నటనకు పిధా కానివారు లేరు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో డాక్టర్ బాబు -వంటలక్క కలిసేది ఎప్పుడంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. ఎట్టకేలకు మోనిత కుట్రలకు చెక్ పెట్టి దీప-డాక్టర్ బాబు ఒక్కటయ్యారు. అప్పట్లో హనీమూన్ కోసం వెళ్లి చిక్ మంగుళూరు టూర్ మళ్లీ వెళ్లారు. తమకు కలతలు మొదలైన ప్లేస్ లో మళ్లీ సంతోషంగా గడిపి తిరిగిరావాలనుకున్నారు. కానీ హిమ డ్రైవింగ్ సరదా కారణంగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ కారులోంచి హిమను తోసేసిన డాక్టర్ బాబు-వంటలక్క.. శౌర్య జాగ్రత్తమ్మా అని చెబుతారు. ఆ తర్వాత ఆ కారులోయలో పడి పేలిపోయింది. హిమలానే డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఆ కార్లోంచి బయట పడ్డారా...ఎప్పటికైనా తిరిగొస్తారా అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది.ఈ మధ్య కాలంలో సీరియల్ లో కొన్ని డైలాగ్స్, సోషల్ మీడియాలో ఆయా నటుల పోస్టులు చూస్తుంటే పాత టీమ్ రీఎంట్రీ పక్కా అనిపిస్తోందంటున్నారంతా...


Also Read: పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్న హిమ-ప్రేమ్, తగ్గేదే లే అంటున్న శౌర్య, పగతో రగిలిపోతున్న శోభ


రీసెంట్ ఎపిసోడ్స్ లో బోనాలు పండుగ సందర్భంగా అమ్మవారి దగ్గర చీటీలు వేయమని పూజారి చెప్పడంతో.. మా అమ్మా నాన్న తిరిగి రావాలని కోరుకుంటుంది శౌర్య..అంటే దీప-కార్తీక్ వస్తారని చెప్పకనే చెప్పారు. తాజా ఎపిసోడ్ లో అమ్మా నాన్న తిరిగొస్తారనే నమ్మకం ఉందని అప్పట్లో శౌర్య చెప్పిన విషయం గుర్తుచేసుకుంటుంది సౌందర్య. వీటికి మరింత ఊతం ఇస్తూ తన ఇన్ స్టా అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది ప్రేమీ విశ్వనాథ్. 


 






సాధారణ చీర, పెద్ద బొట్టు, వాలుజడ, ఎత్తైన కనుబొమ్మలు..కార్తీకదీపం  క్యాస్ట్యూమ్స్‌తో మేకప్ అవుతూ కనిపించింది ప్రేమీ విశ్వనాథ్. వెనుకనుంచి ‘దీప మేడమ్ షాట్ రెడీ’ అని అనడంతో.. వస్తున్నా అని నవ్వులు చిందిస్తూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది దీప. ఇంకేముంది..మేం వెయిటింగ్ తొందరగా వచ్చెయ్ దీపక్కా అని కామెంట్లు మోత మోగిపోతున్నాయ్. మీతో పాటు డాక్టర్ బాబుని కూడా తీసుకుని వచ్చేయండి అంటున్నారు. అయితే ఇది దీప రీఎంట్రీ ప్రోమోనా లేదా పాతదా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీప రావడం పక్కా అయితే డాక్టర్ బాబు కూడా వచ్చేస్తాడు. 


 



మరోవైపు ఆ మధ్య మోనిత కూడా 'కార్తీకదీపం' సీరియల్ లోకి వచ్చేస్తున్నా అంటూ హింట్ ఇచ్చింది.. మొత్తానికి మరో జనరేషన్ వచ్చిన తర్వాత కాస్త నెమ్మదించిన కార్తీకదీపం సీరియల్ కి... పునర్వైభవం వచ్చేట్టే ఉంది. 


Also Read: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!