కార్తీకదీపం ఆగస్టు 11 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam August 11 Episode 1428)


శోభ బండారం శౌర్య బయటపెట్టడంతో స్వప్నలో మార్పు వస్తుంది. అటు సత్యం కూడా నువ్వు అనుకుంటున్నట్టు నిత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం స్నేహం మాత్రమే అని మరోసారి క్లారిటీ ఇస్తాడు. నేను నమ్ముతున్నానండీ అంటుంది స్వప్న.


ఇంట్లో ఒంటరిగా కూర్చుని నిరుపమ్ మాటలు తల్చుకుంటూ బాధపడుతుంటుంది శౌర్య. వెనుకనుంచి వచ్చి కళ్లుమూస్తాడు. డాక్టర్ సాబ్ అని పిలుస్తుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావ్ అని అడిగితే అలా తెలిసిపోతుంది అంతే అంటుంది.
నిరుపమ్: మేం ఎవ్వరం కనిపెట్టలేని శోభ నిజస్వరూపాన్ని నువ్వు కనిపెట్టగలిగావ్ నువ్వు గ్రేట్..థ్యాంక్యూ శౌర్యా..
శౌర్య: నిరుపమ్ చేయి పట్టుకోవడంతో అలా చూస్తూ నిల్చుంటుంది
నిరుపమ్: ఇది యాక్టింగ్ కాదు నిజమే..అప్పుడు ఇప్పుడు చెబుతున్నాను నువ్వు మా ఫ్యామిలీకోసమే పుట్టావ్
శౌర్య: చెప్పడానికి మీకు ఎలా ఉందో కానీ వినడానికి నాకు చిరాగ్గా ఉంది..పుండుమీద కారం చల్లినట్టుంది.. మీ పెళ్లికి ఎళాంటి ఆటంకాలు లేవని మీరే అంటున్నారు కదా..సంతోషంగా పెళ్లిచేసుకోండి..హాయిగా ఉండండి..నన్ను వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను
నిరుపమ్ పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య


Also Read: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!


హిమ-ప్రేమ్
స్నప్నత్త మారిపోయాక ఈ పెళ్లి ఆపడం అసంభంవ అనిపిస్తోందని హిమ అంటే..నాకెందుకో ఈ పెళ్లి జరగదని నా మనసు చెబుతోంది అంటాడు ప్రేమ్. జరగొద్దని కోరుకుంటున్నాం కానీ దాన్ని ఆపేదెలా అని క్వశ్చన్ చేస్తుంది హిమ.


శౌర్య: నెయిల్ పాలిష్ పెట్టుకుందామని కూర్చుని..జీవితంలో కళ లేనప్పుడు ఈ నెయిల్ పాలిష్ ఎందుకు అనుకుంటుంది.. అంతలోనే ఎవరెలా పోతే నాకెందుకు అనుకుంటుంది. ఇంతలో స్వప్న వచ్చి గోరింటాకు పెట్టాలని ట్రై చేస్తుంది.నిన్నటి వరకూ తిట్టిపోశావ్, ఆటో తగలబెట్టావ్ ఇప్పుడేమో కోడలు అంటున్నావ్ అంటుంది..
స్వప్న: మనుషుల్ని, బంధాలను దూరం చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు
హిమ, నిరుపమ్ వచ్చి గోరింట పెట్టుకో అని చెబుతారు...
శౌర్య: మీర ఇప్పటి వరకూ నాపై చూపించిన టన్నుల కొద్దీ ప్రేమ చాలు..ఇంకా కొత్తగా కురిపించాల్సిన అవసరం లేదు..
స్వప్న: తనతో ప్రేమగా ఉన్నా ఆ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు..ఈ కోపం ఎప్పటికి పోతుందో ఏమో..
ఇంతలో అక్కడకు వచ్చిన ఆనందరావు..నా కూతురివి నువ్వు మాలో కలవడానికే ఇంతకాలం పట్టింది..మరి నా మనవరాలికి ఎన్నాళ్లు పడుతుందో ఏమో 
నిరుపమ్: అవును తాతయ్య మొండిపట్టుదలలో శౌర్యకి మేనత్త పోలికలు వచ్చినట్టున్నాయి...


అటు బ్యాంకువాళ్లు శోభ ఇంట్లో ఆస్తులు, బంగారం లెక్కలు వేస్తుంటారు. పక్కనే కూర్చున్న శోభ..తనకు జరిగిన అవమానం గుర్తుచేసుకుంటుంది. బ్యాంక్ లోన్ చెల్లించమని మీకు చాలా అవకాశం ఇచ్చాం మీనుంచి ఎలాంటి స్పందనా లేదు.. అందుకే మీ ఇంటిని జప్తు చేస్తున్నాం, మీ హాస్పిటల్ కూడా సీజ్ చేస్తున్నాం అని చెప్పి వెళ్లిపోతారు. దీనికంతటికీ కారణం నువ్వే కదా.. నువ్వు కోరుకోలేని దెబ్బ కొడతాను, నీ లైఫ్ అల్లకల్లోలం అయిపోతుంది..ఈ శోభ అంటే ఏం అనుకున్నావ్ అని అరుస్తుంటుంది...


Also Read: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు


ఇంటి బయట గార్డెన్లో ఒంటరిగా కూర్చుని నిరుపమ్ తో పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ తల్చుకుంటూ ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడకు వస్తుంది. 
సౌందర్య: ఇంట్లో అందరూ ఒకేచోట ఉంటే నువ్వేంటే ఇక్కడ
శౌర్య: ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపిరి కట్టది మరోదారి అని..నన్ను అలా అనుకోండి
సౌందర్య: అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నావ్ ఎందుకు
శౌర్య: అందరూ ఉన్నా ఒంటరిదాన్నే..వంటలక్క కూతుర్నే
సౌందర్య: నేను చెప్పేది మనసులోకి తీసుకో
శౌర్య: నాక్కూడా మనసుందని గుర్తించావా..నాకు మనసు ఒకప్పుడు ఉండేది..దాన్ని చాలామంది ముక్కలు చేశారు..నాపై నిజంగా ప్రేమే ఉంటే నేను ఇంట్లోంచి పారిపోయినప్పుడు నాకోసం వెతికారా..నేను రెక్కలు కట్టుకుని ఎగిరిపోలేదు.. వెతికితే దొరికేదాన్ని. మీరు వెతకలేదు..నేను మీకోసం వెతికాను..ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసింది..ప్రేమనేది ఉంటే ఏదైనా సాధ్యమే. నేను జ్వాలని కాదు శౌర్యని అని తెలియగానే లేని ప్రేమ గుర్తొచ్చి నా మనవరాలు అంటున్నారు. అన్ని సంవత్సరాలు నాకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయని మీరు ఇప్పుడు స్విచ్ వేయగానే బల్బ్ వెలిగినట్టు ప్రేమలు వెలిగిపోతాయా..
సౌందర్య: నీపై ప్రేమ లేకపోవడం ఏంటి...
(మళ్లీ దీప-కార్తీక్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచీ శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోవడం, శౌర్యని తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ గుర్తుచేసుకుంటుంది. శౌర్య ఎక్కడుందో తెలుసుకుని వెళ్లి బతిమలాడినా నేను రానంటే రానని తేల్చి చెబుతుంది,డబ్బిచ్చినా తీసుకోదు)



రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
ఇంట్లో అంతా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. ఇంతలో స్వప్న వచ్చి నా ఇద్దరు కోడళ్లకు చీరలు కొన్నానంటుంది. నాకు బట్టలు లేవని నేను అడిగానా..నాపై కొత్తగా ప్రేమను చూపించాల్సిన అవసరం లేదంటుంది. ఆ పెళ్లేదో తొందరగా అయిపోతే నా దారి నేను చూసుకుంటాను...