మెగాస్టార్ చిరంజీవి, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతార 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటించారు. వాళ్లిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా అది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. అయితే... ఈసారి చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటించడం లేదు. సినిమాలోని కీలక పాత్రలో నటించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన హిట్ సినిమా 'లూసిఫర్'కు రీమేక్ ఇది. అయితే... తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఆయనకు సోదరిగా నయన్ నటించనున్నారని సమాచారం. నయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 





ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి, ఆయనపై ఓ పాటను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఆల్రెడీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ట్యూన్స్ వర్క్ స్టార్ట్ చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి 153వ సినిమా ఇది.

Also Read: చర్చలకు నాలుగేళ్లు... చిత్రీకరణకు మూడేళ్లు... విడుదలకు 50 రోజులు!
Also Read: స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో... తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి