మోటో జీ పవర్(2022) స్మార్ట్ ఫోన్ అమెరికాలో లాంచ్ అయింది. ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన మోటో జీ పవర్ (2021)కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరాను అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
మోటో జీ పవర్ (2022) ధర
ఈ ఫోన్ ధర 199 డాలర్లుగా(సుమారు రూ.14,700) ఉంది. దీనికి సంబంధించిన అన్‌లాక్డ్ మోడల్ బెస్ట్ బై, అమెజాన్, మోటొరోలా యూఎస్ వెబ్‌సైట్లలో 2022 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ఇందులో కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
మోటో జీ పవర్ (2022) స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. వెనకవైపు ఫ్లాష్ కూడా ఉంది. హైపర్‌ల్యాప్స్, డ్యూయల్ క్యాప్చర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5, వైఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!