తెలుగు సినిమా పరిశ్రమలో ఒకే రకమైన సక్సెస్ రేట్ కలిగి ఉన్న హీరో అల్లరి నరేష్. ఆయన నటించిన సినిమా ఫ్లాప్ కాదనే టాక్ ఉంది. అల్లరి నరేష్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో కామెడీ రోల్స్ ఎక్కువగా చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలతో పాటు కథాబలం ఉన్న సినిమాలను ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ‘నాంది’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్.. తాజాగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  అనే సినిమా చేస్తున్నాడు.  


తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. నవంబర్ 11న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.  ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ తో పాటు వెన్నెల కిశోర్ కలిసి అటవీ ప్రాంతంలో  ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించేందుకు సామాత్రితో వెళ్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచాయి.  మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అల్లరి నరేష్ కెరీర్ లో 59వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది.


ఇక నరేష్ గత సినిమా ‘నాంది’ మంచి విజయాన్ని అందుకుంది. నటుడిగా నరేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో అల్లరి నరేశ్ కు జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి',  'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ తో మరోసారి ఆకట్టుకోబోతున్నది.  వెన్నెల కిషోర్ సహా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.  ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు. హాస్య మూవీస్,  జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  అల్లరి నరేష్ కెరీర్ లో డిఫరెంట్  కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోవాలంటే నవంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే!






ప్రముఖ సినీ దర్శకుడు  ఇ.వి.వి.సత్యనారాయణ కుమారుడిగా 2002లో వచ్చిన ‘అల్లరి’ అనే చిత్రంతో తొలిసారి వెండి తెరపై కనిపించాడు నరేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అల్లరి నరేష్ గా మారిపోయాడు. ఆ తర్వాత సీమటపాకాయ్, కితకితలు, ఫిట్టింగ్ మాస్టార్, మడతకాజా, సీమశాస్త్రీ, గోపీ, బెట్టింగ్ బంగార్రాజు లాంటి సూపర్ హిట్ కామెడీ సినిమాలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం కామెడీకి కాస్త బ్రేక్ చెప్పి వైవిధ్యభరిత సినిమాల్లో నటిస్తున్నాడు. 


Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?



Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?