ఆ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. ఆ ఇంట్లోని బాలుడికి, ఈ ఇంట్లోని బాలిక చిన్న తనం నుంచే స్నేహంగా మెలిగేవారు. వారి వయసు 15 ఏళ్లు. బంధుత్వం కారణంగా ఇద్దరి మధ్య అన్నా చెల్లెళ్ల బంధం ఉంది. రోజూ కలిసే స్కూలు వెళ్లడం, బయటికి వెళ్లి సరదాగా తిరిగి రావడం చేసేవారు. వరుసకు అన్నా చెల్లెళ్లు కాబట్టి, రెండు కుటుంబాల్లోని పెద్దలు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు. మామూలుగా అయితే, ఆ టీనేజీ వయసులో పిల్లల్ని ఓ కంట కనిపెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ, వీరి విషయంలో మాత్రం అంతగా పట్టించుకోకపోవడం పెద్ద సమస్యకు దారి తీసింది.
బిహార్‌కు చెందిన వీరు భయపడిపోయి ఏం చేయాలో తెలియక, ఊళ్లో గొడవ అవుతుందని రైలెక్కేశారు. ఆ రైలు సికింద్రాబాద్ చేరుకుంది. ఇక్కడికి వచ్చిన బాలుడు, బాలికను చైల్డ్ లైన్ ప్రతినిధులు గుర్తించగా అప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది.
బిహార్ లో పక్క పక్క ఇళ్లలో ఉండే ఈ 15 ఏళ్ల టీనేజీ అన్నా చెల్లెళ్లు స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో సాన్నిహిత్యం బాగా పెరిగింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం చాలా ఆలస్యంగా తెలిసిన ఆ బాలుడు, బాలిక బెంబేలెత్తిపోయారు. దీంతో భయపడి పారిపోయి హైదరాబాద్ కు రాగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దివ్య దశ చైల్డ్ లైన్ కంట్లో పడ్డారు.
బిహార్‌లో పక్కపక్క ఇళ్లలో ఉండే బాలిక (15), బాలుడు (15) కలిసి ఒకే తరగతి చదువుకుంటున్నారు. ఆ చనువుతో దగ్గరయ్యారు. వరుసకు అన్నా చెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులు కూడా అనుమానించలేదు. బాలికకు రెండు నెలలుగా రుతుక్రమం ఆగిపోవటంతో బాలుడికి చెప్పింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఏడు నెలల గర్భం అని చెప్పారు. తెలిస్తే ఇంట్లో, ఊళ్లో గొడవ జరుగుతుందని ఆందోళనకు గురైన వారు ఈ నెల 22న రైల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దివ్య దిశ చైల్డ్‌లైన్ ప్రతినిధులు గుర్తించి ఆరా తీయటంతో అసలు విషయం బయటపడింది.
వారు వెంటనే ఆ పిల్లల నుంచి ఫోన్ నంబర్లు తీసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తొలుత బాలుడి కుటుంబసభ్యులు రావడంతో అతణ్ని వారికి అప్పగించారు. ఆ తర్వాత వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు జీఆర్పీలో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసును బిహార్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తామని చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.