అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లుగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. వివాహబంధానికి దూరమవుతున్నా.. ఎప్పటికీ స్నేహితుల్లా ఉంటామని ఓ పోస్ట్ పెట్టారు సమంత,చైతన్య. దీనిపై నాగార్జున కూడా రియాక్ట్ అయ్యారు. నాగచైతన్య, సమంత విడిపోతుండడం దురదృష్టకరమని అన్నారు నాగార్జున. భార్య-భర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతమని అన్నారు. సమంత-చైతు ఇద్దరూ తనకు ప్రియమైన వ్యక్తులని చెప్పారు. ఇక ఈ విడాకుల విషయం బయటకొచ్చినప్పటి నుంచి మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..
సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అవ్వడంతో అక్కినేని ఫ్యామిలీ ఆమెకి భరణం కింద రూ.200 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సమంత ఆ డబ్బుని తీసుకోవడానికి సిద్ధంగా లేదని టాక్. తను సొంతంగా సంపాదించగలనని.. ఎలాంటి భరణం అక్కర్లేదని సమంత చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది.
కొంతకాలంగా సమంత-చైతు దూరంగానే ఉంటున్నారు. చైతు ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేసి ఓ హోటల్ లో బస చేస్తున్నాడని టాక్. సమంత కూడా తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. చైతన్య నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్స్ లో కూడా సమంత ఎక్కడా కనిపించలేదు. ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో కూడా సమంత లేకపోవడంతో అనుమానాలకు బలం చేకూరింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ జంట విడాకులు విషయాన్ని ప్రకటించి షాకిచ్చింది.
ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే సమంత సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్స్ ను క్లోజ్ చేసింది. మాములుగా అయితే సమంత అలా చేయదు. కానీ ఇప్పుడు తనపై నెగెటివ్ కామెంట్స్ వస్తాయని ఆలోచించి ముందే క్లోజ్ చేసినట్లు కనిపిస్తోంది.
Also Read:విడిపోయిన చైతు-సమంత.. రియాక్ట్ అయిన నాగార్జున..
Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..
Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్
Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు
Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..