ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల వెయ్యి దిగువకు వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఈ వారం సైతం మళ్లీ వెయ్యి పైగా వచ్చాయి. తాజాగా మరోసారి వెయ్యి దిగువన కొవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50 వేల శాంపిల్స్ పరీక్షించగా 865 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
లేటెస్ట్ బులెటిన్..
నిన్నటితో పోల్చితే ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో రాష్ట్రంలో మరో 9 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. ఏపీలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 14,195 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,96,103 పాజిటివ్ కేసులకు గాను.. 20,24,334 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11 వేలకు దిగొచ్చాయి. ఏపీలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,574 అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శనివారం తాజా బులెటిన్ విడుదల చేసింది.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
రికవరీ రేటు భేష్..
ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గానే ఉంది. కరోనా పాజిటివ్ కేసులకు రెట్టింపు డిశ్ఛార్జ్ కేసులు ఉండటం ఊరట కలిగిస్తుందని రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజులో 865 మంది కరోనా బారిన పడగా, అదే సమయంలో 1,424 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో ఏపీలో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దురు, కృష్ణాలో ఇద్దరు కరోనాతో చనిపోయారు.
Also Read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు
ఏపీలో నేటి ఉదయం వరకు 2 కోట్ల 84 లక్షల 471 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో గడిచిన 24 గంటల్లో 50,304 శాంపిల్స్‌కు కరోనా టెస్టులు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరిలో 172, చిత్తూరులో 168, గుంటూరులో 117, ప్రకాశంలో 90 మందికి తాజాగా కరోనా సోకింది. శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో అత్యల్పంగా 4 మంది కరోనా బారిన పడ్డారు.