ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే సెటిల్ అవ్వాలని ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు, సక్సెస్ రాలేదు. అదే సమయంలో ఇలియానా.. ఓ విదేశీయుడితో డేటింగ్ చేసేది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఈ జంట విడిపోయింది.
బ్రేకప్ తరువాత ఇలియానా డిప్రెషన్ కి గురైంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తరువాత మళ్లీ సౌత్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఇలియానా మరోసారి ప్రేమ వార్తలతో మీడియాకెక్కింది. ఆమె డేటింగ్ చేస్తుంది కూడా ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్ తో కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అతడితో ఇలియానా డేటింగ్ చేస్తుందట. ఇటీవల కత్రినా బర్త్ డే వేడుకల్లో కూడా ఇలియానా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇందులో సెబాస్టియన్ కూడా ఉండడంతో అందరూ ఈ డేటింగ్ వార్తలు నిజమేనని భావిస్తున్నారు. మరి ఈ ప్రేమ కహానీ ఎంతవరకు నడుస్తుందో చూడాలి!
Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?
Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్