‘జబర్దస్త్’ హైపర్ ఆది పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆది మాట్లాడటం మొదలుపెడితే చాలు.. పంచ్‌ల ప్రవాహం సాగుతూనే ఉంటుంది. అయితే, ఆది ఈ మధ్య ‘జబర్దస్త్’లో కనిపించడం లేదు. సినిమా అవకాశాల వల్ల హైపర్ ఆది ‘జబర్దస్త్’కు దూరమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లేకుండానే ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ నడుస్తోంది. అయితే, ఆది ఇంకా ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోస్ మాత్రం వదల్లేదు. మళ్లీ ‘జబర్దస్త్’లో చేస్తాడా లేదా అనేది కూడా స్పష్టత లేదు. 


జూన్ 9న ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ షో ప్రోమోలో కూడా హైపర్ ఆది కనిపించలేదు. కేవలం రైజింగ్ రాజు టీమ్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రాకెట్ రాఘవ ఒక్కడే షోను తన భుజాలపై మోస్తున్నట్లు తెలుస్తోంది. మిగతావారి స్కిట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆది తన ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శాంతి స్వరూప్ ఓ ఫన్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఆది టీమ్ సభ్యులు స్విమ్మింగ్‌పూల్‌లో ఉండగా.. శాంతి, రైజింగ్ రాజు టవల్స్ కట్టుకుని ఉన్నారు. ‘‘మీ కావల్సింది మా దగ్గర ఉంది’’ అనే పాటకు వీరు రీల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను ఇక్కడ చూడండి. 


వీడియో: 






Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?


Also Read: పెళ్లి తర్వాత నటనకు నయనతార దూరం? కాబోయే అత్తగారు పెట్టిన కండిషన్ కారణంగా..